బంధువులు, స్నేహితుల పెళ్లికి ఎవరైనా గుర్తుండిపోయే కానుకలు అందజేస్తారు. వీళ్తు కూడా అమెరికాలో పెళ్లి చేసుకుంటున్న భారత సంతతికి చెందిన తమ స్నేహితుడిని సర్‌ప్రైజ్ చేయాలనుకున్నారు. అందుకోసం అచ్చం భారతీయ మహిళల మాదిరగా చీరకట్టుతో పెళ్లి మండపానికి వెళ్లారు. వీళ్లు చీర కుచ్చిళ్లు పట్టుకొని వయ్యారంగా నడుస్తున్న వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది.భారత సంతతి యువకుడి అతని ఇద్దరు మగస్నేహితులు ఇండియన్ డ్రెస్‌కోడ్‌తో సర్‌ప్రైజ్ చేశారు. పట్టుచీరకట్టుకొని, నుదుట బొట్టు పెట్టుకొని పెళ్లి కూతురితో కలిసి చికాగోలోని మండపానికి వెళ్లారు. వాళ్లను తన బెస్ట్ ఫ్రెండ్స్‌ని భారతీయ సంప్రదాయ చీరకట్టులో చూసి పెళ్లికొడుకు నవ్వు ఆపుకోలేకపోయాడు. పెళ్లికూతురు కూడా కొంచెం సేపు నవ్వుతూ ఉండిపోయింది. ఆ తర్వాత పెళ్లికొడుకు వాళ్లతో కలిసి గ్రూప్ ఫొటో దిగుతాడు.చికాగోకు చెందిన పారాగాన్‌ఫిల్మ్స్ అనే వెడ్డింగ్ వీడియోగ్రాఫర్స్ ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. వీడియో మొత్తం చూడచక్కగా ఉంది అని ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్ కామెంట్ చేశాడు. ఇప్పటివరకు ఈ వీడియోను 28వేల మంది చూశారు.