Movies

డేరింగ్ అండ్ డాషింగ్ హీరో… ఎందుకంటే ?

డేరింగ్ అండ్ డాషింగ్ హీరో… ఎందుకంటే ?

తెలుగు ఫిల్మ్ ఇండ‌స్ట్రీ ప్రేమ పిపాసి హీరో కృష్ణ ఇవాళ క‌న్నుమూశారు. ఎన్నో హిట్ చిత్రాల‌తో తెలుగు సినీ ప్రేక్ష‌కుల మ‌నసు దోచిన ల‌వ్లీ స్టార్ కృష్ణ‌కు డేరింగ్ అండ్ డాషింగ్ హీరో అన్న నిక్‌నేమ్ ఉంది. సుమారు 350కు పైగా చిత్రాల్లో చేసిన కృష్ణ‌.. ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో ఎన్నో ప్ర‌యోగాలు చేశారు. 60వ ద‌శాబ్ధం నుంచి చిత్రరంగంలో ఉన్న ఆయ‌న .. ఆధునిక టెక్నాల‌జీ ప‌ట్ల‌ ఎక్కువ మ‌క్కువ‌ చూపారు.తెలుగు ఇండ‌స్ట్రీకి సినిమాస్కోప్‌ను ప‌రిచ‌యం చేసింది కృష్ణే. సూప‌ర్ హిట్ ఫిల్మ్ అల్లూరి సీతారామ‌రాజు చిత్రాన్ని సినిమాస్కోప్ టెక్నాల‌జీతో తీశారు. 70ఎంఎం స్క్రీన్‌పై విడుద‌లైన తొలి చిత్రం సింహాస‌నం. ఆ సినిమాను ప్రొడ్యూస్ చేసి, డైరెక్ట్ చేసింది కూడా సూప‌ర్‌స్టార్ కృష్ణ‌నే. తెలుగు చిత్రాల్లో కౌబాయ్ పాత్ర‌ను ప‌రిచ‌యం చేసింది కూడా ఈయ‌నే. మోస‌గాళ్ల‌కు మోస‌గాడు చిత్రం కౌబాయ్ చిత్రాల్లో ఫేమ‌స్ హిట్‌. అనేక యాక్ష‌న్ చిత్రాల్లో హీరో కృష్ణ న‌టించారు. జేమ్స్ బాండ్ పాత్ర‌ల‌ను కూడా తెలుగులో ఇంట్ర‌డ్యూస్ చేసింది కృష్ణే. గూఢాచారి 116 ఫిల్మ్ ఓ హైలెట్‌. ఆ సినిమా ఇండ‌స్ట్రీలో కృష్ణ ఇమేజ్‌నే మార్చేసింది. ఆ త‌ర్వాత అదే వ‌రుసలో ఏజెంట్ గోపి, జేమ్స్ బాండ్ 777 సినిమాలు తీశాడు. కృష్ణ ఫ్యాన్స్ ఆయ‌న్ను తెలుగు జేమ్స్ బాండ్‌గానే గుర్తిస్తారు. ఫిల్మ్ ఇండ‌స్ట్రీలో చేసిన ప్ర‌యోగాల‌కు ఆయ‌న్ను డేరింగ్ అండ్ డాషింగ్ హీరోగా పిలుస్తారు.