సూపర్ స్టార్ కృష్ణ తన కెరీర్‌లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు, మరెన్నో బ్లాక్‌బస్టర్ చిత్రాలను తీశాడు. కృష్ణ తన నటనతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకున్నాడు. కాగా అభిమానులు కృష్ణను మొదట్లో నటశేఖర, డేరింగ్ అండ్ డాషింగ్ అని బిరుదులతో పిలుచుకునే వాళ్ళు. అయితే ప్రముఖ సినీ పత్రిక శివరంజని ఓ సందర్భంలో తెలుగు సినిమాల్లో సూపర్ స్టార్ అనే బిరుదు ఎవరికి ఇస్తారని ఓటింగ్ నిర్వహించింది. ఆ ఓటింగ్‌లో కృష్ణకు తిరుగులేని మెజార్టీ వచ్చింది. ఇక అప్పటి నుండి ఆయనను టాలీవుడ్ ప్రేక్షకులు సూపర్ స్టార్ అంటూ పిలుస్తున్నారు. కులగోత్రాలు సినిమాతో కెరీర్ ప్రారంభించిన కృష్ణ, తేనే మనుసులు సినిమాతో హీరోగా మారాడు. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ సాధించాడు. ఆ తర్వాత కన్నెమనుసులు అనే సినిమా తీశాడు. అయితే ఈ చిత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఈ చిత్రం తర్వాత గూఢాచారి 116 సినిమా చేశాడు. తొలి జేమ్స్ బాండ్ చిత్రంగా తెరకెక్కిన ఈ మూవీ కృష్ణ కెరీర్‌నే మార్చేసింది. ఈ ఒక్క సినిమాతో కృష్ణకు ఏకంగా 20సినిమా ఆఫర్స్ వచ్చాయి. 1964-1995 మధ్య కృష్ణ అనేక సినిమాలు తీశాడు. ఆ సమయంలో కృష్ణ మూడు షిఫ్టుల్లోనూ పనిచేసేవాడట. ఇక ఆయనకు రికార్డు స్థాయిలో 2,500 అభిమాన సంఘాలున్నాయి