DailyDose

గాడిదలకో సంత.

గాడిదలకో సంత.

ప్రతి కుక్కకూ ఒక రోజు వస్తుంది అంటారు కదా… కానీ, ఇక్కడ ప్రతి గాడిదకీ ఒక పేరు వస్తుంది. అది కూడా బాలీవుడ్ సూపర్స్టార్ల పేరు! వాటి పేర్ల వెనక కథ ఏమిటంటే… మధ్యప్రదేశ్లోని చిత్రకూట్ ప్రాంతంలో మందాకినీ నదీ తీరంలో ఏటా దీపావళి తరవాత పెద్ద ఎత్తున గాడిదల సంత జరుగుతుంది. మన పల్లెల్లో గేదెల సంతలు జరుగుతుంటాయి కదా…. అలా అన్నమాట. ఔరంగజేబు కాలం నుంచి జరుగుతున్న ఈ సంతకు దేశంలోని పలు ప్రాంతాల నుంచి వేలాది గాడిదలు తరలివస్తుంటాయి. వచ్చిన ప్రతి గాడిదనూ శుభ్రంగా కడిగి రంగులు అద్దుతారు. వాటిలో కాస్త ఒడ్డూపొడవూ ఉన్న అందమైన గాడిదలు లక్ష నుంచి రెండు లక్షల వరకూ పలుకుతాయి. పైగా అలాంటి వాటికి యజమానులు సల్మాన్ ఖాన్, షారుఖాన్, కత్రినా బాలీవుడ్ సినిమా తారల పేర్లు కూడా పెట్టడం విశేష దాదాపు వారం రోజుల పాటు జరిగే ఈ సంతలో సుమారు 30 నుంచి 40 కోట్ల లావాదేవీలు జరుగుతుంది. అంటే గాడిదలకు మంచి మార్కెట్ ఉందన్నమాట మన దగర.
Whats-App-Image-2022-11-15-at-7-56-06-PM