*ఏపీలోని బాపట్ల జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఓ ప్రేమ జంట ఆత్మహత్య కలకలం రేపింది. జిల్లాలోని అద్దంకి గరటయ్య కాలనీ సమీపంలోని కాకనికుంట వద్ద ప్రేమ జంట చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది . పెద్దిరాజు(22) అనే యువకుడు, ప్రశాంతి(20) అనే యువతిని ప్రేమించాడు. వీరి పెళ్లికి కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. ఈ ప్రేమ జంట ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు అన్వేషిస్తున్నారు.
*ముంబై నగర వాసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ధన్ ధన్ అని మోగుతున్న శబ్ధాలకు నివ్వెరపోయారు. తమ చుట్టూ ఏం జరుగుతోందంటూ కాసేపు స్తంభించిపోయారు. ఆదివారం రాత్రి ఎద్దుల బండ్ల పోటీల నిర్వహణలో ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవ కాల్పులకు దారితీసింది. వ్యక్తుల మధ్య గొడవ కాస్త ఇరువర్గాలకు పాకింది. దీంతో ఓ వర్గం మరో వర్గం వారిపై కాల్పులకు దిగారు. సుమారు 15-20 రౌండ్ల కాల్పులు జరిగినట్లు సమాచారం.
*అద్దంకిలో ప్రేమ జంట ఆత్మహత్య స్థానిక గరటయ్య కాలనీ సమీపం లోని కాకాని కుంట వద్ద చెట్టుకు ఉరి వేసుకున్న ప్రేమికులు.. అద్దంకి పట్టణానికి చెందిన పెద్దిరాజు(22) ప్రశాంతి (20) గా గుర్తించిన పోలీసులు.
*దేవరపల్లి మండలం గౌరీపట్నం సమీపంలోని విజన్ డ్రగ్స్ లోభారీ ప్రమాదం.కెమికల్ కాలమ్ వేలడంతోముగ్గురు కార్మికులు మృతి.మృతులు దొంగ మహీధర్, చాగల్లు,వై. రత్నబాబు త్యాజంపూడిఏ వి వి సత్యనారాయణ, గౌరీపట్నం
*అశోక్‌నగర్ శ్మశానవాటికలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ నిర్మాణాలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఫ్లాష్ సంస్థ శ్మశానవాటికలో అంబులెన్స్‌లు, శవపేటికలు ఉంచుతోంది. అయితే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ అధికారులు నిర్మాణాలను తొలగించింది. అనవసర ఆరోపణలతో నిర్మాణాలను తొలగించడం సరికాదని నిర్వాహకులు ఆవేదన చెందారు. అధికారుల తీరుపై సేవా సంస్థ నిర్వాహకులు మండిపడుతున్నారు. నిర్మాణాల తొలగింపుపై విపక్షాలు నిరసనకు దిగగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
*ఏలూరు రూరల్ మండలం చాటపర్రు గ్రామంలోని మద్యం దుకాణంలో గత మూడు రోజుల అమ్మకం సొమ్ముతో మద్యం దుకాణం సూపర్వైజర్ పరారు.శుక్ర, శని, ఆదివారాలు అమ్మిన సొమ్మును సోమవారం ఖజానాకు జమ చేయాల్సి ఉంది. అయితే ఆ సొమ్ముతో దుకాణం సూపర్వైజర్ పరారైనట్లుగా తెలుస్తుంది.ప్రభుత్వ మద్యం దుకాణంలో సేల్స్ మ్యాన్ గా పని చేస్తున్న సదరు వ్యక్తికి 10 రోజులు క్రితమే ఎక్సైజ్ డిపోలో చక్రం తిప్పుతున్న ఓ అధికారి ఆశీస్సులతో సేల్ సూపర్వైజర్ గా చాటపర్రు మద్యం దుకాణంలో నియమించినట్లుగా
సమాచారం. సోమవారం ఉదయం అదే మద్యం దుకాణంలో ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేసి అంత సజావుగా ఉన్నట్లుగా పుస్తకంలో రాసి వెళ్ళారు.సుమారు 5.50 లక్షలతో పరారైనట్లుగా తెలుస్తుంది. మంగళవారం ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఎక్సైజ్ అధికారులు ఫిర్యాదు చేశారు.ఏలూరు రూరల్ పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు..
*టీఆర్ఎస్ బైక్ ర్యాలీలో పేలిన బాణాసంచా.. ఒకరి పరిస్థితి విషమం ||
నూతన మెడికల్ కాలేజీ ఓపెనింగ్ సంబరాల్లో బాణాసంచా ప్రమాదంరోడ్డుపై పైనే వ్యక్తీ సజీవ దహనంచింతా ప్రభాకర్ నిర్వహించిన ర్యాలీలో అపశృతి చోటు చేసుకుంది. పీఎస్ఆర్ గార్డెన్ నుండి సంగారెడ్డి నూతన మెడికల్ కాలేజీ వరకు భారీగా బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నారు.తరుణంలో బైక్ ర్యాలీ చౌరస్తా మీదుగా కలెక్టరేట్ వరకు చేరుకుంది.
అభిమానులు టపాసులు కలుస్తూ సందడి చేస్తున్న తరుణంలో ఆకాశంలో పేల్చే తార జువ్వలు ప్రమాదవశాత్తు టపాసులతో ఉన్న వాహనంలో పాడడంతో ఒక్కసారిగా నిప్పురవ్వలు టపాసులకంటుకొని ఆటోలో ఉన్న బాణసంచా సామగ్రి మొత్తం పేలి అందులో ఆటోఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. అలాగే బైక్ ర్యాలీ తీస్తున్న కార్యకర్తకు చెందిన బైక్ పూర్తిగా దగ్ధం అయ్యింది. ఈ ఘటనతో కలక్టరేట్ చుట్టు పక్కల ప్రాంతంలో ఉండే ప్రజలంతా ఉల్లిక్కి పడ్డారు. దీంతో ట్రాఫిక్ జాం అయ్యింది.
*గుజరాత్ రాష్ట్రంలోని కచ్ జిల్లాలోని నర్మదా కాల్వలో ఘోర ప్రమాదం జరిగింది. నర్మదా కెనాల్ లో మునిగిపోతున్న ఓ మహిళను రక్షించే ప్రయత్నంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మంచినీళ్లు తీసుకువచ్చేందుకు వెళ్లిన ఓ మహిళ నర్మదా కాల్వలోకి జారి పడిపోయింది. కాల్వలోకి జారిపడిన మహిళను రక్షించడానికి దూకిన వారు కూడా నీళ్లలో మునిగి మరణించారు. ఈ దుర్ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మరణించారని కుత్బుల్లాపూర్ వెస్ట్ ఎస్పీ సౌరభ్ తెలిపారు.పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు కచ్ వెస్ట్ ఎస్పీ సౌరభ్ సింగ్ తెలిపారు.
*వారిద్దరూ ప్రేమించుకున్నారు.. పెళ్లి చేసుకుందామనుకున్నారు.. ఇద్దరి మతాలు వేరు కావడంతో పెద్దలు అంగీకరించలేదు. ఇంట్లోంచి పారిపోయి.. సహజీవనం చేస్తున్నారు. అంతలోనే ఇద్దరి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయి. అవి కాస్తా తీవ్ర రూపం దాల్చాయి. అంతే.. అతనిలోని మృగాడు నిద్ర లేచాడు. ప్రేయురాలిని అత్యంత కిరాతకంగా చంపేశాడు. అంతేకాదు.. ఆమె శరీరాన్ని 35 ముక్కలు చేశాడు. వాటిని 18 రోజుల పాటు వేర్వేరు ప్రాంతాల్లో విసిరేశాడు! ఒళ్లు గగుర్పొడిచే ఈ పాశవిక ఘటన ఢిల్లీలో చోటుచేసుకుంది. ఆర్నెల్ల తర్వాత ఈ దారుణ హత్య గురించి బాహ్యప్రపంచానికి తెలియడం గమనార్హం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రద్ధా వాకర్ (26), అఫ్తాబ్ అమీన్ పూనావాలా (28) ముంబైలోని ఓ కాల్సెంటర్లో పనిచేసేవారు. ఒకే సంస్థలో పనిచేస్తున్న వీరి మధ్య పరిచయం కాస్తా ప్రేమగా మారింది. మతాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి అంగీకరించలేదు. దీంతో వారిద్దరూ ముంబై నుంచి దక్షిణ ఢిల్లీలోని మెహ్రౌలీ ప్రాంతానికి వచ్చేసి సహజీవనం చేస్తున్నారు. ఈ క్రమంలో పెళ్లి విషయమై ఇద్దరి మధ్యా తరచూ గొడవలు జరిగాయి. మే నెల మధ్యలో ఓ రోజు ఘర్షణ పెరిగి పెద్దదైంది. అఫ్తాబ్ ఆమెను చంపేశాడు..
*మిజోరంలోని ఓ క్వారీలో ఘోర ప్రమాదం జరిగింది. దక్షిణ మిజోరాంలోని హ్నాథియాల్ గ్రామంలో సోమవారం సాయంత్రం ఒక రాతి క్వారీ కూలిపోవడంతో (Quarry Collapses)పలువురు కార్మికులు చిక్కుకుపోయారు. క్వారీ కూలిన ప్రాంతంలో పలువురు కూలీలు(Labourers) పని చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. శిథిలాల లోపల చిక్కుకున్న వారి సంఖ్య ఇంకా నిర్ధారించలేదు. అయితే 12 మందికి పైగా కూలీలు చిక్కుకున్నట్లు తెలుస్తోంది. శిథిలాల తొలగింపునకు కొంత సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
*కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా లో విషాదం చోటు చేసుకుంది. పత్తి పంట వద్దకు వెళ్లిన రైతుపై పులి దాడి చేయడంతో ఓ రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలంలోని గోందాపూర్ గ్రామంలో ఫారెస్టు, పంచాయతీ అధికారులు, గ్రామానికి చెందిన కమిటీ సభ్యులు, పలువురు రైతులు పోడు భూముల సర్వే కోసం వెళ్లారు.
* విజన్ డ్రగ్స్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించింది. కెమికల్ ట్యాంకర్ పేలి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. దేవరపల్లి మండలం గౌరీపట్నంలో ప్రమాదం చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. అక్కడి ప్రమాదాన్ని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. మృతుల కుటుంబీకులు, బంధువులు కన్నీరుమున్నీరుగా రోదిస్తున్నారు