*డీఈడీ కాలేజీల గుర్తింపు రద్దుపై హైకోర్టు లో ఏపీ సర్కార్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఏపీలో డీఈడీ కాలేజీల గుర్తింపు రద్దుచేస్తూ ఇచ్చిన జీవోను హైకోర్టు కొట్టేసింది. 318 డీఈడీ కాలేజీల గుర్తింపు రద్దుచేస్తూ ఏపీ సర్కార్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. కాలేజీల గుర్తింపు రద్దుపై హైకోర్టును యాజమాన్యాలు ఆశ్రయించారు. అయితే ఏపీ ప్రభుత్వ ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. ఎన్సీటీఈ భవిష్యత్‌లో ఫ్రెష్ నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీనిపై కాలేజీల యాజమాన్యాలు సకాలంలో రిప్లై ఇవ్వాలని హైకోర్టు సూచించింది. అలాగే డీఈడీ కాలేజీలన్నీ గుర్తింపు పొందినట్టేనని హైకోర్టు పేర్కొంది.
* ఆలమూరు లే ఔట్లో మంత్రి జోగి రమేష్ కు వింత అనుభవం ఎదురైంది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే ఎవరంటూ వరలక్ష్మి అనే లబ్దిదారురాలిని మంత్రి ప్రశ్నించారు. దీంతో ఆమె జగనన్న అంటూ సమాధానమిచ్చింది. మరోసారి జోగి రమేష్ అడిగినా ఆమె జగనన్న అంటూ అదే సమాధానమిచ్చింది. ఈ నేపథ్యంలో ఏడీసీసీ బ్యాంక్ చైర్ పర్సన్ లిఖిత జోక్యం చేసుకుని స్థానిక ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి అంటూ వరలక్ష్మి అనే లబ్దిదారుకి చెప్పారు.
* జార్ఖండ్‌లో అక్రమ మైనింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మరోసారి చిక్కుల్లో పడ్డారు. ఈడీ విచారణను ఒకరోజు ముందుకు జరపాలని ఆయన చేసుకున్న విజ్ఞప్తిని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) తిరస్కరించింది. ఈనెల 17వ తేదీన విచారణకు హాజరుకావాలని సోరెన్‌కు పంపిన సమన్లలో ఈడీ ఆదేశించగా, తనకు ఆరోజు రాజకీయ, అధికారిక కార్యక్రమాలు ఉన్నందున 16వ తేదీన విచారణకు హాజరయ్యేందుకు అనుమతించాలని ఆయన ఈడీని కోరారు. అయితే, ఇన్విస్టిగేషన్ సంబంధించిన కారణాలను ప్రస్తావిస్తూ ఆయన విజ్ఞప్తిని ఈడీ తోసిపుచ్చింది.
*బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ , కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపువచ్చింది. దీంతో వారు ఇరువురు హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈరోజు మధ్యాహ్నం బీజేపీ అగ్రనేతలతో ఈటల, రాజగోపాల్‌రెడ్డి భేటీకానున్నారు. మోదీ సభ తర్వాత ఈటల, రాజగోపాల్‌కు హైకమాండ్ నుంచి పిలుపు రావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా.. మరో బీజేపీ నేత డీకే అరుణ ఇప్పటికే ఢిల్లీలో ఉన్న విషయం తెలిసిందే.
*సినీనటుడు, నిర్మాత, మాజీ ఎంపీ, ఘట్టమనేని కృష్ణ మృతి పట్ల రాజ్యసభ సభ్యులు, టీడీపీ రాజ్యసభ లీడర్ కనకమెడల రవింద్ర కుమార్, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత జయదేవ్ గల్లా , విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని నాని శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడు కింజరాపు రామ్మోహన్ నాయుడు నంతాపం తెలియజేశారు. తెలుగు సినీ పరిశ్రమలో మంచి మనిషిగా, నిర్మాతల హీరోగా, సూపర్‌స్టార్‌గా పిలిపించుకున్నారన్నారు. ఆయన మరణం దిగ్భ్రాంతికి గురిచేసిందని తెలిపారు. నటుడిగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా, తెలుగు సినిమాకు తొలి సాంకేతికతను అద్దిన సాహస నిర్మాత కృష్ణ అని కొనియాడారు. విలక్షణ నటునిగా పేరున్న కృష్ణ మృతి సినీ రంగానికి తీరని లోటన్నారు. కృష్ణ మరణంతో ఒక అద్భుత సినీశకం ముగిసినట్లయిందని ఆవేదనం చెందారు. ఇటీవలే తల్లిని, ఇప్పుడు తండ్రిని కూడా కోల్పోయిన మహేష్ బాబు కు ఇది తీరని వేదనగా తెలిపారు. ఈ బాధ నుంచి త్వరగా కోలుకునే మనోధైర్యాన్ని ఆయనకు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ.. వారి కుటుంబ సభ్యులకు టీడీపీ నేతలు ప్రగాఢ సానుభూతిని తెలియేశారు
*బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ , కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ హైకమాండ్నుం చి పిలుపువచ్చింది. దీంతో వారు ఇరువురు హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈరోజు మధ్యాహ్నం బీజేపీ అగ్రనేతలతో ఈటల, రాజగోపాల్‌రెడ్డి భేటీకానున్నారు. మోదీ సభ తర్వాత ఈటల, రాజగోపాల్‌కు హైకమాండ్ నుంచి పిలుపు రావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా.. మరో బీజేపీ నేత డీకే అరుణ ఇప్పటికే ఢిల్లీలో ఉన్న విషయం తెలిసిందే.
*రాష్ట్రంలో 8 కొత్త మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ క్లాసులను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. మంగళవారం ప్రగతిభవన్‌లో వర్చువల్‌గా సీఎం క్లాసులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… తెలంగాణ చరిత్రలో ఇది కొత్త అధ్యాయమన్నారు. తెలంగాణ దేశానికే మార్గదర్శకంగా మారుతోందని తెలిపారు. 8 కొత్త మెడికల్ కాలేజీలను ప్రారంభించుకోవడం గర్వకారణమన్నారు. గతంలో 850 సీట్లు ఉండేవి.. ఇప్పుడు 2,790 సీట్లకు పెరిగాయని అన్నారు. ఎంబీబీఎస్ సీట్లు నాలుగు రెట్లు పెరిగాయన్నారు. 33 జిల్లాల్లో మెడికల్, నర్సింగ్ కాలేజీలను నిర్మిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలో వైద్య రంగాన్ని పటిష్టం చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.
*భారతీయ సాహిత్య రంగానికి ప్రతిష్టాత్మ కమైన కేంద్ర సాహిత్య అకాడమీ బాల సాహి త్య పురస్కారాన్ని రచయిత, కవి, అను వాదకుడు, ఎన్బీటీ సహాయ సంపాదకుడు డాక్టర్ పత్తిపాక మోహన్ అందుకున్నారు. సోమవారం సాయంత్రం న్యూ ఽఢిల్లీలోని త్రివేణి కళా సంఘం ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో సాహిత్య అకాడమీ అధ్యక్షుడు చంద్రశేఖర్ కంబార్, వైస్ ప్రెసిడెంట్ మాధవ్‌కౌశిక్, కార్యదర్శి శ్రీనివాసరావు, హిందీ రచయిత ప్రకాశ్మను పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా సిరిసిల్ల జిల్లా రచయితల సంఘంతోపాటు కవులు, రచయితలు అభినందనలు తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు కేంద్ర సాహిత్య అకాడమీ నుంచి కవిత్వంలో డాక్టర్ సి.నారాయణరెడ్డి, అనువాదంలో డాక్టర్ నలిమెల భాస్కర్, ఇప్పుడు బాల సాహిత్యంలో డాక్టర్ పత్తిపాక మోహన్ పురస్కారం అందుకున్నారు.
*మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కాన్వాయ్‌పై దాడికి నిరసనగా టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో ఎమ్మెల్యే కాన్వాయ్‌పై ఆదివారం దాడి జరుగగా మండలంలోని వివిధ గ్రామాల నాయకులు సోమవారం బైక్‌ర్యాలీగా బయట్దేరి మండల కేంద్రానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జడ్పీవైస్ చైర్మన్ సిద్దం వేణు, ఎంపీపీ వుట్కూరి వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే నిరంతరం కృషి చేస్తున్నారని, ఆయనపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఏఎంసీ చైర్మన్ మామిడి సంజీవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహరెడ్డి, మాజీ ఎంపీపీ గుడిసె అయిలయ్య, నాయకులు కేవీఎన్‌రెడ్డి, ముత్యం అమర్, సిద్దం శ్రీనివాస్, ఉడుతల వెంకన్న, నాయిని రమేష్, రాజశేఖర్‌గౌడ్, మ్యాకల శ్రీనివాస్, దమ్మని లక్ష్మణ్, అంజయ్య, రమేష్, రాజేశం, అనిల్‌కుమార్, రమేష్ పాల్గొన్నారు.
*రాష్ట్రంలోని ఎనిమిది కొత్త జిల్లాలో నిర్మించిన మెడికల్ కాలేజీలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. ప్రగతి భవన్ నుంచి ఆయా కాలేజీలకు సీఎం ప్రారంభోత్సవం చేశారు. మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్‌కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డిలో కొత్తగా నిర్మించిన కాలేజీలను ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎస్ సోమేశ్‌కుమార్, పలువురు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
*రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడేవాడే వాళ్లు, ఆలోచించే పార్టీ అంటూ ఏదీ లేదని కాంగ్రెస్ నేత సాకే శైలజానాథ్ పేర్కొన్నారు. ఎంతసేపు నరేంద్రమోదీని ప్రసన్నం చేసుకోవడమే ఏకైక అజెండాతో వైసీపీ పని చేస్తోందన్నారు. టీడీపీ, జనసేన, వైసీపీకి గానీ మోదీని విమర్శించే ధైర్యం కూడా చేయడం లేదన్నారు. కేంద్రానికి సంబంధించి బీజేపీ, జనసేన వాళ్ళకి తెలియని సమాచారమంతా వైసీపీ దగ్గర ఉంటుందన్నారు. విశాఖపట్నం మీద వాలిన విజయసాయిరెడ్డి దగ్గర మరింత సమాచారం ఉంటుందని సాకే శైలజానాథ్ పేర్కొన్నారు. ఓ రహస్య ఎజెండాతో వెళుతూ… మరో ఎజెండా బహిరంగంగా మన ముందు పెడుతున్నారన్నారు. ఏపీకి మేలు జరగాలంటే బీజేపీ దుర్మార్గాన్ని అడ్డుకోవాలని సాకే శైలజానాథ్ పేర్కొన్నారు
*జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ మండిపడ్డారు. హైదరాబాద్‌లో ఉంటూ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదల పక్షాన కొనుగోలు చేసిన లే అవుట్‌పై మాట్లాడటానికి సిగ్గుగా లేదా అని ప్రశ్నించారు. ఎక్కడో ఉంటూ ఆంధ్రప్రదేశ్ ప్రజల మనసులు గాయపరచవద్దన్నారు. పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వారానికో పది రోజులకో వచ్చే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని జోగి రమేష్ ఎద్దేవా చేశారు. పవన్‌కు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఎక్కడైనా ఒక్క రూపాయి అవినీతి జరిగినట్లు నిరూపించాలని జోగి రమేష్ సవాల్ విసిరారు. మీరు ఎంత తాపత్రాయ పడినప్పటికీ జగన్ ప్రభుత్వాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కదలించలేరన్నారు.
*హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ , కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీ హైకమాండ్ )నుంచి పిలుపువచ్చింది. దీంతో వారు ఇరువురు హుటాహుటిన ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ఈరోజు మధ్యాహ్నం బీజేపీ అగ్రనేతలతో ఈటల, రాజగోపాల్‌రెడ్డి భేటీకానున్నారు. మోదీ సభ తర్వాత ఈటల, రాజగోపాల్‌కు హైకమాండ్ నుంచి పిలుపు రావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కాగా.. మరో బీజేపీ నేత డీకే అరుణ (DK Aruna) ఇప్పటికే ఢిల్లీలో ఉన్న విషయం తెలిసిందే.
*క్రిస్మస్ వేడుకలపై సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మంగళవారం తన క్యాంప్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా క్రైస్తవ కుటుంబాలకు నాణ్యమైన దుస్తులు పంపిణీ చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా క్రిస్టియన్లలోని అతి బీద కుటుంబాలకు 2.25 లక్షల చీరలు పంపిణీ చేయాలని సూచించారు.డిసెంబర్ మొదటి వారంలో క్రిస్మస్ వేడుకలకు సంబంధించిన సమావేశాలు ఏర్పాటు చేయాలని, ఈ సందర్భంగా దుస్తులు పంపిణీ చేయాలని TSCO అధికారులను మంత్రి ఆదేశించారు.
*ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో ధాన్యం కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇదేరోజు గత సంవత్సరం కంటే 83వేల మెట్రిక్ టన్నులు అధికంగా ధాన్యం సేకరణ చేశామని వెల్లడించారు. వానాకాలం ధాన్యం కొనుగోళ్లపై మంగళవారం హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్ లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు .
*సినీనటుడు కృష్ణ పార్థివదేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్‌కు సూచనలు చేశారు.కృష్ణ అంత్యక్రియలు బుధవారం మధ్యాహ్నం నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అభిమానుల సందర్శనార్థం ఇవాళ సాయంత్రం కృష్ణ భౌతికకాయాన్ని గచ్చిబౌలి స్టేడియానికి తరలించనున్నారు. అనంతరం అక్కడి నుంచి రేపు ఉదయం పద్మాలయ స్టూడియోస్‌కు తరలిస్తారు. కొన్ని ఆచార కార్యక్రమాలు పూర్తయ్యాక.. మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు పూర్తి చేయనున్నట్లు కృష్ణ సోదరుడు, నిర్మాత ఘట్టమనేని ఆదిశేషగిరి రావు తెలిపారు.దివంగత సినీ నటుడు కృష్ణ పార్థివ దేహానికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరపాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శ్రీ సోమేశ్ కుమార్ ను సీఎం ఆదేశించారు.
*కృష్ణా: జిల్లాలోని గుడివాడలో స్వర్గీయ సూపర్ స్టార్ కృష్ణ సంతాప కార్యక్రమాలను అభిమానులు నిర్వహించారు. నెహ్రూ చౌక్ సెంటర్లో కృష్ణ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు. కృష్ణ మరణంతో అభిమానులు కన్నీటి పర్యంతమవుతున్నారు. కళాకారులకు పుట్టినిల్లు అయిన గుడివాడలో సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని అభిమానులు తెలిపారు. నెలల వ్యవధిలో మహేష్ బాబు కుటుంబంలో మూడు విషాదకర సంఘటనలు చోటు చేసుకోవడం తీవ్ర బాధాకరమని అభిమానులు ఆవేదన చెందారు.
*తిరువూరు రూరల్ మండలం, కోకిలంపాడు గ్రామంలో క్షుద్ర పూజలు చేస్తున్నారంటూ ఓ కుటుంబంపై దాడి జరిగింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిన్న రాత్రి తమ ఇంటిపై నిమ్మకాయలు వేశారని, క్షుద్రపూజలు చేస్తున్నారనే అనుమానంతో కోమటి నరసింహారావు కుటుంబసభ్యులు ఆ కుటుంబంపై దాడి చేశారు. ఈ ఘటనలో గాయపడిన వ్యక్తులను తిరువూరు ప్రభుత్వ ఏరియా హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పూర్తి సమాచారం అందవలసి ఉంది.
*ఏలూరు: జిల్లాలోని అశోక్‌నగర్ శ్మశానవాటికలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ నిర్మాణాలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఫ్లాష్ సంస్థ శ్మశానవాటికలో అంబులెన్స్‌లు, శవపేటికలు ఉంచుతోంది. అయితే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ అధికారులు నిర్మాణాలను తొలగించింది. అనవసర ఆరోపణలతో నిర్మాణాలను తొలగించడం సరికాదని నిర్వాహకులు ఆవేదన చెందారు. అధికారుల తీరుపై సేవా సంస్థ నిర్వాహకులు మండిపడుతున్నారు. నిర్మాణాల తొలగింపుపై విపక్షాలు నిరసనకు దిగగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
*టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తును సీబీఐకి ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. హైదరాబాద్ నగర పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) ఆధ్వర్యంలోనే దర్యాప్తు కొనసాగించాలని హైకోర్టు సీజే ధర్మాసనం ఆదేశించింది. దర్యాప్తు పారదర్శకంగా జరగాలని ఆదేశించింది. మీడియా, రాజకీయ నాయకులకు దర్యాప్తు వివరాలు వెల్లడించొద్దని సూచించింది. దర్యాప్తు పురోగతి నివేదికను ఈ నెల 29న సమర్పించాలని కోర్టు ఆదేశించింది. సీబీఐతో కేసు విచారణ జరిపించాలని భాజపా నేత ప్రేమేందర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.
*డ్రగ్స్ కట్టడికి తెలంగాణ పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో డ్రగ్స్‌ను నివారించేందుకు పోలీసులు నిరంతరం తనిఖీలు నిర్వహిస్తున్నారు. తాజాగా జరిపిన తనిఖీల్లో మరో డ్రగ్స్ ముఠాను నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అధికారులు అరెస్టు చేశారు.బెంగళూరు కేంద్రంగా నడుస్తున్న డ్రగ్స్ అక్రమ రవాణా ముఠాలో ఇద్దరిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సూడాన్ జాతీయుడితో పాటు మరో డ్రగ్ పెడ్లర్‌ను అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ ఇద్దరు నిందితుల నుంచి రూ. 2 లక్షల విలువ చేసే ఎండీఎంఏ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను ఫలక్‌నూమా పోలీసు స్టేషన్లో మీడియా ముందు ప్రవేశపెట్టారు.
*ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన టీఆర్ఎస్ఎల్పీ, పార్లమెంటరీ పార్టీ సమావేశం ప్రారంభమైంది. తెలంగాణభవన్‌లో జరుగుతున్న ఈ సమావేశానికి టీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరయ్యారు. రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిణామాలతో పాటు పలు అంశాలపై చర్చిస్తున్నారు.
* గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికల కోలాహలం నెలకొన్నది. అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్, ఆమ్ఆద్మీ పార్టీ మధ్య అక్కడ త్రిముఖ పోరు జరగనున్నది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు వ్యూహ, ప్రతివ్యూహాలకు పదునుపెడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఒకడుగు ముందుకేసి తన ప్రచార ప్రణాళికను సిద్ధం చేసుకుంది.గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం 40 మంది ప్రముఖుల పేర్లతో కూడిన స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించింది. అందులో పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకాగాంధీ, కాంగ్రెస్ ముఖ్యమంత్రులు అశోక్ గెహ్లాట్, భూపేశ్ బఘేల్, సీనియర్ నాయకులు సచిన్ పైలెట్, జిగ్నేశ్ మెవానీ, దిగ్విజయ్‌సింగ్, కమల్‌నాథ్ తదితరుల పేర్లు ఉన్నాయి.
* ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం రోజున హైదరాబాద్‌కు వెళ్లనున్నారు. సినీనటుడు, స్టార్ హీరో మహేశ్‌బాబు తండ్రి సూపర్‌స్టార్ కృష్ణ పార్థివ దేహానికి నివాళులర్పించనున్నారు. బుధవారం సాయంత్రం 4 గంటలకు మహాప్రస్థానంలో కృష్ణ అంత్యక్రియలు నిర్వహించనున్నారు.ఇదిలా ఉంటే, కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న కృష్ణ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు.
*సంగారెడ్డి: జిల్లాలో మెడికల్ కాలేజి ప్రారంభం సందర్భంగా ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ సంబరాల్లో అపశృతి చోటు చేసుకుంది. సంగారెడ్డి చౌరస్తా సమీపంలో బైక్ ర్యాలీ సందర్భంగా ఆటోలో టసాసులు ఉంచారు. అయితే ఓ బాణసంచా కాల్చగా ఆటోలో పడింది. దీంతో ఆటో పూర్తిగా దగ్ధమైంది. బాణసంచా పేలిన ఘటనలో చేనేత అభివృద్ధి సంస్థ ఛైర్మన్ చింతా ప్రభాకర్ కాలికి గాయాలయ్యాయి. అలాగే ఓ వ్యక్తికి మంటలు అంటుకుని తీవ్రంగా గాయపడ్డారు. చింతాప్రభాకర్తో పాటు గాయపడిన వారిని సంగారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు
* మునుగోడు ఉప ఎన్నికలో ధర్మం వైపు నిలిచి టీఆర్ఎస్కు పట్టం కట్టిన నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి మరోమారు కృతజ్ఞతలు తెలిపారు. త్వరలో వివిధ శాఖల మంత్రులు నిర్వహించనున్న సమీక్షా సమావేశంలో నియోజకవర్గ సమగ్రాభివృద్ధికి ప్రణాళికలు రూపొందించనున్నట్లు తెలిపారు. ఉప ఎన్నికలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చి ప్రజల రుణం తీర్చుకుంటానని పేర్కొన్నారు.
ఇటీవల ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆయన సోమవారం తొలిసారి మునుగోడు నియోజకవర్గానికి రాగా, చౌటుప్పల్ నుంచి చండూరు
* ఉత్తరాఖండ్ ప్రభుత్వం కమీషన్ సర్కార్‌గా మారిపోయిందని ఆ రాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ ఎంపీ తీరత్ సింగ్ రావత్ సొంత
ప్రభుత్వంపైనే సంచలన ఆరోపణలు చేశారు. ఏ పని చేయాలన్నా కమీషన్ అడుగుతున్నారని విమర్శించారు. ‘ఉత్తరప్రదేశ్ నుంచి మేం విడిపోకముందు అక్కడ 20 శాతం కమీషన్ ఉండేది. వేరే రాష్ట్రంగా మారాక ఈ సమస్య ఉండదని అనుకున్నా. కానీ, ఇప్పుడు ఉత్తరాఖండ్‌లోనూ 20 శాతం కమీషన్ కొనసాగుతున్నది’ అని ఆయన మాట్లాడిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నది. ఉత్తరాఖండ్‌ను పాలిస్తున్నది బీజేపీయే. ఆ పార్టీకి చెందిన ఎంపీయే సంచలన వ్యాఖ్యలు చేయటం దేశ రాజకీయాల్లో తీవ్ర దుమారాన్ని లేపింది. వెంటనే ముఖ్యమంత్రి, మంత్రులు రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అటు.. బీజేపీ పాలిత కర్ణాటకలోనూ కమీషన్రాజ్పై ప్రతిపక్షాలు, కాంట్రాక్టర్లు మండిపడిన సంగతి తెలిసిందే. ఆ రాష్ట్రంలో ఏకంగా 40 శాతం కమీషన్ ఇవ్వాలని ప్రభుత్వ పెద్దల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని పలువురు బాధితులు పేర్కొనటం గమనార్హం.
* మధుమేహం ప్రమాద ఘంటికలు మోగిస్తున్నది. ఈ వ్యాధి బారిన పడుతున్నవారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో పాటు మరణాల సంఖ్య కూడా భారీగా ఉండటం ఆందోళన కలిగిస్తున్నది. ఈ నేపథ్యంలో డయాబెటిస్‌పై సరైన అవగాహన కల్పించాలని సోమవారం ‘ప్రపంచ డయాబెటిస్ దినం’ సందర్భంగా డబ్ల్యూహెచ్‌వో పిలుపునిచ్చింది.
* ఆరాంఘర్ చౌరస్తా – శంషాబాద్ ఎయిర్ పోర్ట్ మార్గంలో రోడ్డు అభివృద్ధి, విస్తరణ పనులను మరింత వేగవంతం చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం హైదారాబాద్‌లోని బీఆర్కేఆర్ భవన్లో ఆర్అండ్బీ, ట్రాన్స్‌కో, రెవెన్యూ, ఎండోమెంట్స్, వక్ఫ్‌బోర్డు తదితర శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. రూ.283 కోట్ల వ్యయంతో 10 కిలోమీటర్ల మేర ఆరు లైన్ల రోడ్డు విస్తరణ, రెండు సర్వీస్ రోడ్ల పనులు చేపట్టారు. వీటితోపాటు, వ్యవసాయ విశ్వవిద్యాలయం, సాతంరాయి, ఎయిర్ పోర్ట్ ప్రవేశ మార్గాల వద్ద అండర్ పాస్‌లు, గగన్ పహాడ్ వద్ద ఫ్లై ఓవర్, శంషాబాద్ టౌన్లో ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణ పనులు పురోగతిలో ఉన్నాయి. ఇందులో భాగంగా సీఎం కేసీఆర్ ఆదేశాలతో రోడ్డు విస్తరణ పనుల పురోగతిపై సీఎస్ చర్చించారు.
* సూపర్ స్టార్ కృష్ణ 1961లో వచ్చిన కులగోత్రాలు సినిమాతో నటనా ప్రస్థానాన్ని ప్రారంభించారు. పదండి ముందుకు, పరువు ప్రతిష్ట సినిమాల్లో చిన్న పాత్రలతో యాక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టారు. ఆ తర్వాత 1965లో తేనె మనసులు చిత్రంలో హీరోగా అవకాశం దక్కింది. ఐదు దశాబ్దాల సినీ కెరీర్లో 370కి పైగా చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించి..సూపర్ స్టార్‌గా, నటశేఖరుడిగా చెరగని ముద్రవేసుకున్నారు. గూఢచారి 116తో కృష్ణ కెరీర్‌కు గట్టి పునాదిలాంటి. ఒకే ఏడాది అత్యధిక చిత్రాల్లో నటించిన కృష్ణ. తెలుగునాట విశేషాదరణ పొందిన హీరో ఆయన. 1983లో విజయవాడలో ఆరు చిత్రాలు శతదినోత్సవం జరుపుకున్నాయి. ఆయన నటించిన 20 చిత్రాలు డబ్ అయ్యాయి. మరో పదో చిత్రాలు హిందీలోకి డబ్ అయ్యాయి.
*పోలవరం సాగునీటి ప్రాజెక్టును బ్యారేజీ స్థాయికి కుదించేసి, సార్వత్రిక ఎన్నికల నాటికి దానిని మమ అనిపించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం సిద్ధమవుతున్నదా?స్పిల్‌వే, స్పిల్‌చానల్, దిగువ కాఫర్ డ్యామ్ ఎత్తును 31 మీటర్లకు పెంచేసి .. పోలవరం పూర్తయిందనిపించే యోచనలో సర్కారు ఉన్నదా? 41.15 మీటర్ల కాంటూరుకే ప్రాజెక్టును పరిమితం చేయాలంటూ కేంద్రానికి రాష్ట్ర జల వనరుల శాఖ రాసిన లేఖను ఉదహరిస్తూ, సాగునీటిరంగ నిపుణులు ఇప్పుడు ఇవే సందేహాలు వెలిబుచ్చుతున్నారు. పోలవరంపై సాంకేతికంగా నెలకొన్న సమస్యలు ఎప్పటికి పరిష్కారమవుతాయో చెప్పలేని స్థితి ఉంది. ఈ లేఖను బట్టి ప్రాజెక్టు ఎత్తును తగ్గించి నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అప్పుడు కేవలం 91 టీఎంసీల నిల్వకే పోలవరం ప్రాజెక్టు పరిమితమవుతుంది. ఇదే జరిగితే ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా నిలవాల్సిన ప్రాజెక్టు.. మినీ బ్యారేజీగా మిగిలిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ తర్వాత .. నీటి నిల్వను పెంచుతూ పోవాలనుకుంటే ..భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టడం దుస్సాధ్యమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం సాగు నీటి ప్రాజెక్టు పనులు టీడీపీ హయాంలో మొదలయినప్పుడు గరిష్ఠ నీటిమట్టం 45.72 మీటర్లు. నిల్వ సామర్థ్యం 194.60 టీఎంసీలు. దీనికి భిన్నంగా జగన్ ప్రభుత్వం ఎత్తును తగ్గించేయనున్నదన్న ప్రచారం జోరందుకుంది.
*రొయ్యల ధరల పతనంపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ఆక్వా సాగుదారులకు ఊరటనివ్వలేదు. ధరలు పడిపోయినప్పుడు మార్కెట్లో జోక్యం చేసుకుని, ధరల స్థిరీకరణ నిధితో ఆదుకోవాల్సిన సర్కార్… ఒక ధర నిర్ణయించి, చేతులు దులుపుకుందని ఆక్వా సాగుదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయ, ఉద్యాన పంటలకు మద్దతు ధర రానప్పుడు ధరల స్థిరీకరణ నిధిత ఆదుకుంటామని జగన్ సర్కారు ప్రకటించింది. వాటి మాదిరి ఆక్వా ఉత్పత్తులకు ధరల స్థిరీకరణ నిధి లేదా? అని రొయ్యల రైతులు ప్రశ్నిస్తున్నారు.
*పోలవరం సాగునీటి ప్రాజెక్టును బ్యారేజీ స్థాయికి కుదించేసి, సార్వత్రిక ఎన్నికల నాటికి దానిని మమ అనిపించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వం సిద్ధమవుతున్నదా?స్పిల్‌వే, స్పిల్‌చానల్, దిగువ కాఫర్ డ్యామ్ ఎత్తును 31 మీటర్లకు పెంచేసి .. పోలవరం పూర్తయిందనిపించే యోచనలో సర్కారు ఉన్నదా? 41.15 మీటర్ల కాంటూరుకే ప్రాజెక్టును పరిమితం చేయాలంటూ కేంద్రానికి రాష్ట్ర జల వనరుల శాఖ రాసిన లేఖను ఉదహరిస్తూ, సాగునీటిరంగ నిపుణులు ఇప్పుడు ఇవే సందేహాలు వెలిబుచ్చుతున్నారు. పోలవరంపై సాంకేతికంగా నెలకొన్న సమస్యలు ఎప్పటికి పరిష్కారమవుతాయో చెప్పలేని స్థితి ఉంది. ఈ లేఖను బట్టి ప్రాజెక్టు ఎత్తును తగ్గించి నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తోంది. అప్పుడు కేవలం 91 టీఎంసీల నిల్వకే పోలవరం ప్రాజెక్టు పరిమితమవుతుంది. ఇదే జరిగితే ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా నిలవాల్సిన ప్రాజెక్టు.. మినీ బ్యారేజీగా మిగిలిపోతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆ తర్వాత .. నీటి నిల్వను పెంచుతూ పోవాలనుకుంటే ..భూసేకరణ, సహాయ పునరావాస కార్యక్రమాలు చేపట్టడం దుస్సాధ్యమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలవరం సాగు నీటి ప్రాజెక్టు పనులు టీడీపీ హయాంలో మొదలయినప్పుడు గరిష్ఠ నీటిమట్టం 45.72 మీటర్లు. నిల్వ సామర్థ్యం 194.60 టీఎంసీలు. దీనికి భిన్నంగా జగన్ ప్రభుత్వం ఎత్తును తగ్గించేయనున్నదన్న ప్రచారం జోరందుకుంది.
*ఈ ఏడాది డిగ్రీ అడ్మిషన్లు రికార్డు స్థాయిలో జరిగాయని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గతేడాది ఇంటర్మీడియట్ పరీక్ష రాసిన వారిలో 3,37,987 మంది ఉత్తీర్ణత సాధించగా, వారిలో 3,15,600 మంది (93.38శాతం) వివిధ ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశాలు పొందారని వివరించారు. డిగ్రీ అడ్మిషన్లపై ఉన్నత విద్యాశాఖ అధికారులతో సోమవారం సాయంత్రం మంత్రి సమీక్షించారు. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు పడిపోయాయంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. ఇంటర్ ఉత్తీర్ణత సాధించిన వారిలో 22 వేల మంది విద్యార్థులు ఉన్నత విద్యలో ప్రవేశాలు పొందలేదని తెలిపారు. 2018-19లో 79.63 శాతం, 2019-20లో 88.19శాతం మంది ఉన్నత విద్య కోర్సుల్లో ప్రవేశం పొందారన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ ఇంజినీరింగ్‌లో 1.2 లక్షల మంది, ఫార్మసీలో 12 వేల మంది, వ్యవసాయం, ఆక్వా కల్చర్ కోర్సుల్లో 5,000 మంది, మెడికల్, నర్సింగ్ కోర్సుల్లో 15 వేల మంది అడ్మిషన్లు పొందినట్లు వివరించారు.
* తెలంగాణ హైకోర్టులో ఉండిపోయిన కేసు ఫైళ్లను ఏపీకి తీసుకొచ్చే విషయంలో ఏపీ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఉమ్మడి హైకోర్టు విభజన జరిగిన తరువాత ఏపీకి చెందిన వందల ఫైళ్లు తెలంగాణ హైకోర్టులోనే ఉండిపోయాయని, దీంతో కేసుల విచారణ సాధ్యపడడం లేదని పలువురు న్యాయవాదలు తమ దృష్టికి తీసుకొస్తున్నారని ధర్మాసనం గుర్తు చేసింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇరు రాష్ట్రాల హైకోర్టు రిజిస్ట్రార్ జనరళ్లు సమావేశం కావాలని సూచించింది. ‘‘ఏపీకి చెందిన ఎన్ని ఫైళ్లు తెలంగాణ హైకోర్టులో మిగిలిపోయాయి? వాటిని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ఏమి చర్యలు తీసుకుంటున్నారు? తదితర వివరాలతో నివేదిక సమర్పించాలి’’ అని ఇరు రాష్ట్రాల ఆర్జేలను ఆదేశించారు. విచారణను ఈ నెల 30కి వాయిదా వేశారు. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం సోమవారం ఆదేశాలిచ్చింది.
* డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీని సోమవారం రీహేబిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఆర్సీఐ) సభ్యులు సందర్శించారు. వర్సిటీలోని స్పెషల్ బీఈడీ (రెండేళ్ల కాల వ్యవధి) కోర్సుకు ఆర్సీఐ గుర్తింపు కొనసాగించేందుకు ఈ కమిటీ పరిశీలించింది. త్రివేండ్రం (కేరళ)కు చెందిన వి.ఝాన్సీ, వెంకటేష్‌లతో కూడిన బృందం వర్సిటీలో కోర్సు నిర్వహణకు కావల్సిన మౌలిక వసతులపై ఆరా తీశారు. గ్రంథాలయం, హాస్టల్ గదులు, ల్యాబ్‌లను పరిశీలించారు. అధ్యాపకుల విద్యార్హతలను, వారి నైపుణ్యాలను తనిఖీ చేశారు. వర్సిటీలో స్పెషల్ బీఈడీ కోర్సు నిర్వహణపై కమిటీ సభ్యులు సంతృప్తి వ్యక్తంచేశారు. వర్సిటీలో 2009లో ప్రారం భించిన ఈ కోర్సునకు 2021 సంవత్సరం వరకు ఆర్సీఐ గుర్తింపు వరకు ఉంది. దీంతో ఈ కోర్సు గుర్తింపు కొనసాగింపునకు ఆర్సీఐకు వర్సిటీ అధికారులు దరఖాస్తు చేసిన మేరకు కమిటీ సందర్శించింది. వర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ సీహెచ్ ఎ.రాజేంద్రప్రసాద్, బోధనా సిబ్బంది డాక్టర్ ఎన్.శ్రీనివాస్, డాక్టర్ హనుమంతు సుబ్రమణ్యం, డాక్టర్ జేఎల్ సంధ్యారాణి, ఎన్వీ స్వామినాయుడు పాల్గొన్నారు.
*పెండింగ్ అర్జీలను త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ శ్రీకేష్ బి.లఠ్క ర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. జడ్పీ సమావేశ మందిరంలో సోమవా రం నిర్వహించిన స్పందనలో జేసీ ఎం.నవీన్‌తో కలిసి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న అర్జీలపై శాఖల వారీగా చర్చించారు. అర్జీల పరిష్కారంలో అధికారులే క్షేత్రస్థాయి పరిశీలన చేయాలని ఆదేశించారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపై 246 అర్జీలు అందా యి. కార్యక్రమంలో డీఆర్వో ఎం.రాజేశ్వరి, ఉప కలెక్టర్ జి.జయదేవి, ఇతర శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు. సుమారు రెండేళ్ల కిందట తన భర్త పిడు గుపడి చనిపోయాడని, ఇంతవరకూ ప్రభుత్వం ఎటువంటి సాయం అందించలేదని సరుబుజ్జిలి మండలం వీరమల్లిపేట గ్రామానికి చెందిన మల్లిబోయిన లక్ష్మి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు కలెక్టర్‌కు వినతి పత్రం అందించింది.
*జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రికి వైసీపీ నాయకుడు, కాంట్రాక్టర్ ముర్రా అమర్నాథ్రెడ్డి సోమవారం ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ పుల్లయ్యకు ఐసీయూ బెడ్, వీల్‌ఛైర్ వితరణ చేశారు. వైసీపీ రాష్ట్ర యువజన కార్యదర్శి మల్కిరెడ్డి హనుమంతరెడ్డి సమక్షంలో ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో ముర్రా ఆదినారాయణరెడ్డి, బొమ్మేపల్లె సర్పంచ్ రామనాథరెడ్డి, ప్రతా్‌పరెడ్డి, ప్రభుత్వ ఆస్పత్రి ఫార్మసిస్ట్ దస్తగిరి, సిబ్బంది పాల్గొన్నారు.
*‘ఎమ్మెల్యేల కొనుగోలు కేసు’లో తమకు రిమాండ్ విధించడాన్ని సవాలు చేస్తూ నిందితులు రామచంద్రభారతి, నందకుమార్, సింహయాజీ దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను సుప్రీంకోర్టు 21వ తేదీకి వాయిదా వేసింది. ఈ పిటిషన్లు సోమవారం జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ విక్రమ్‌నాథ్‌తో కూడిన ద్విసభ్య ధర్మాసనం ముందుకు విచారణకు వచ్చాయి. అయితే, నిందితుల బెయిల్ పిటిషన్లపై కింది కోర్టు సోమవారమే తీర్పు ఇవ్వనుందని, విచారణను శుక్రవారానికి వాయిదా వేయాలని వారి తరఫు న్యాయవాది కోర్టుకు విజ్ఞప్తి చేశారు. దీంతో తదుపరి విచారణను 21కి వాయిదా వేస్తున్నట్లు ధర్మాసనం తెలిపింది.
* గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వెళ్లనున్నారు. ఈ నెల 22 నుంచి ఆయన గుజరాత్లో పర్యటించనున్నారు. జోడో యాత్రకు తాత్కాలిక విరామం ఇవ్వనున్నారు. గుజరాత్లో 27 ఏళ్ల బీజేపీ అధికారానికి గండికొట్టి ఈసారైనా సత్తా చాటాలనే సంకల్పంతో కాంగ్రెస్ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ క్రమంలో రాహుల్ ప్రచారానికి మరింత జోష్ తీసుకురావాలని భావిస్తున్నారు.
*రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర మహారాష్ట్రలో కొనసాగుతోంది. సోమవారం హింగోలీ జిల్లా కలమ్నూరి ప్రాంతంలో పాదయాత్ర చేశారు. నెహ్రూ 133వ జయంతిని పురస్కరించుకుని ఆయన రచించిన ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ మరాఠీ వెర్షన్‌ను పుస్తకాలను 600 మందికి పంపిణీ చేశారు.
*అశోక్‌నగర్ శ్మశానవాటికలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఫ్లాష్ స్వచ్ఛంద సంస్థ నిర్మాణాలను మున్సిపల్ సిబ్బంది తొలగించారు. ఫ్లాష్ సంస్థ శ్మశానవాటికలో అంబులెన్స్‌లు, శవపేటికలు ఉంచుతోంది. అయితే అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ అధికారులు నిర్మాణాలను తొలగించింది. అనవసర ఆరోపణలతో నిర్మాణాలను తొలగించడం సరికాదని నిర్వాహకులు ఆవేదన చెందారు. అధికారుల తీరుపై సేవా సంస్థ నిర్వాహకులు మండిపడుతున్నారు. నిర్మాణాల తొలగింపుపై విపక్షాలు నిరసనకు దిగగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
*జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసేందుకు కేంద్రం కుట్రలు పన్నుతుందని తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, కేరళ గ్రామీణాభివృద్ధి మంత్రి ఎంబీ రాజేశ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకం పై కేంద్ర వైఖరికి నిరసనగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ‘ గ్రామీణ ఉపాధి హామీ చట్టం అమలు – సవాళ్లు ’అనే అంశం పై హైదరాబాద్ రవీంద్ర భారతిలో మంగళవారం సెమినార్ నిర్వహించారు.