NRI-NRT

కువైట్‌లో 12 వేల మంది భారత ఇంజినీర్ల ఉద్యోగాలు ఔట్‌!

కువైట్‌లో 12 వేల మంది భారత ఇంజినీర్ల ఉద్యోగాలు ఔట్‌!

కువైట్‌లో పనిచేస్తున్న దాదాపు 12వేల మంది భారత ఇంజినీర్లు ఉద్యోగం కోల్పోయే ప్రమాదం ఉన్నది. ఎన్‌బీఏ అక్రెడిటేషన్‌ లేని భారత కాలేజీల్లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసిన వారికి కువైట్‌ సొసైటీ ఆఫ్‌ ఇంజినీర్స్‌(కేఎస్‌ఈ) నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) ఇవ్వకపోవడమే ఇందుకు కారణం. కువైట్‌లో పనిచేస్తున్న ఇంజినీర్లకు రెసిడెన్సీ రెన్యువల్‌కు కేఎస్‌ఈ ఎన్వోసీ తప్పనిసరి.అయితే ఇంతకుముందు గుర్తింపు ఉన్న కాలేజీలకు ఇప్పుడు లేదని ఇంజినీర్లు చెబుతున్నారు. ఈ విషయాన్ని భారత ఎంబసీ దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని ఇండియన్‌ ఇంజినీర్స్‌ ఫోరం ఆవేదన వ్యక్తం చేసింది. ఐఏసీటీఈ అనుబంధ కాలేజీలు, ఐఐటీలు, ఎన్‌ఐటీలు అందించే ఇంజినీరింగ్‌ డిగ్రీలకు ఎన్‌బీఐ గుర్తింపు అక్కర్లేదని భారత ప్రభుత్వం కువైట్‌కు వివరించాలని కోరింది.