Movies

టాలీవుడ్‌ ఎంట్రీకి సిద్ధం

టాలీవుడ్‌ ఎంట్రీకి సిద్ధం

తెలుగు చిత్ర పరిశ్రమలోకి మరో బాలీవుడ్‌ బ్యూటీ అడుగుపెట్టబోతున్నది. వరు ణ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న కొత్త చి త్రంలో మానుషీ చిల్లర్‌ హీరోయిన్‌గా నటించనుందని సమాచారం. భారత వాయు సేన గొప్పదనాన్ని చెప్పే కథతో దర్శకుడు శక్తి ప్రతాప్‌ సింగ్‌ ఈ సినిమాను రూపొందిస్తున్నారు 2017లో ప్రపంచ సుందరి కిరీటం గెల్చుకున్న మానుషీ…అక్షయ్‌ కుమార్‌ హీరోగా నటించిన ‘సామ్రాట్‌ పృథ్వీరాజ్‌’ చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. తన అందం, నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాననే నమ్మకాన్ని వ్యక్తం చేసింది. తొలి సినిమా అపజయం పాలైనా ఆమెకు అవకాశాలు తగ్గలేదు. ప్రస్తుతం ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫ్యామిలీ’, ‘టెహ్రాన్‌’ అనే రెండు చిత్రాల్లో నటిస్తున్నదీ తార.