*లోన్ యాప్ ద్వారా వేధింపులకు పాల్పడుతున్న ముఠాకు సహకరిస్తున్న అంతర్ రాష్ట్ర మోసగాడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ మీడియాతో మాట్లాడుతూ ఉత్తర ప్రదేశ్‌కు చెందిన అంతర్ రాష్ట్ర లోన్ యాప్ కమీషన్ ఏజెంట్ జలాల్ ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. బద్వేల్‌లో మోహన్ అనే వ్యక్తి ఫిర్యాదు ద్వారా పోలీసులు గుట్టురట్టు చేశారన్నారు. జలాల్ ఖాన్ 14 రాష్ట్రాలలో సైబర్ క్రైమ్ నేరాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందని, 7 బ్యాంక్ అకౌంట్‌లను గుర్తించి రూ. 2.05 కోట్ల నగదు సీజ్ చేసినట్లు చెప్పారు. మరో ముగ్గురు లోన్ యాప్ నిర్వాహకుల కోసం ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. లోన్ యాప్, సైబర్ క్రైమ్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అన్బురాజన్ సూచించారు
*కాంగ్రెస్ రాజస్థాన్ ఇన్‌చార్జి ( పదవికి ఆ పార్టీ సీనియర్ నేత అజయ్ మాకెన్ రాజీనామా చేశారు. ఇటీవల రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు మద్దతుగా తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలపై ఇంతవరకూ పార్టీ అధిష్ఠానం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ఆయన అసంతృప్తితో ఉన్నారని, ఆ కారణంగానే ఆయన పార్టీ పదవికి రాజీనామా చేశారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ఆయన లేఖ రాసినట్టు చెబుతున్నారు.
*రాజధాని అమరావతి రైతుల పాదయాత్రపై హైకోర్టులో దాఖలైన మధ్యంతర దరఖాస్తులు, రిట్ అప్పీల్‌ను బుధవారం విచారించిన హైకోర్టు కొట్టివేసింది. పాదయాత్రపై సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పులో… పార్టీలు కాని వారు వేస్తే అనుమతించబోమని న్యాయస్థానం స్పష్టం చేసింది. థర్డ్ పార్టీ పిటీషన్ వేయడం న్యాయబద్దం కాదని పేర్కొంది. రైతాంగ సమాఖ్య తరపున పాదయాత్రలో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని పిటీషనర్‌లు కోరారు. మధ్యంతర దరఖాస్తులను కొట్టివేయడంతో… రిట్ అప్పీల్‌కు కూడా విచారణ అర్హత లేదని హైకోర్టు పేర్కొంది.
*సంగారెడ్డి: జిల్లాలోని అమీన్‌పూర్ కేఎస్ఆర్ కాలనీకి చెందిన సాయిపవన్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అదృశ్యం కలకలం రేపుతోంది. ఆన్‌లైన్ ద్వారా రూ.10 లక్షలు ఇన్వస్ట్‌మెంట్ చేసి సాయిపవన్ నష్టపోయాడు. కుటుంబ సభ్యులకు విషయం తెలిసి మందలించడంతో ఎవ్వరికీ చెప్పకుండా ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
*తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం కోసం రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్‌లో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా ముందుగా ఆయన కాగజ్‌నగర్ రూరల్ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం వెంట మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్నారు. వీరికి ఎస్పీఎం క్రీడా మైదానంలో ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, జెడ్పీ చైర్‌పర్సన్ కోవ లక్ష్మి, వైస్ చైర్మన్ కోనేరు కృష్ణారావు, ఏఎంసీ చైర్మన్ కాసం శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్, జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా ఎస్పీ సురేష్ కుమార్ ఘనస్వాగతం పలికారు.
*గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన తమ అభ్యర్థి కంచన్ జరీవాలా మంగళవారం నుంచి కనిపించడంలేదని ఆమ్ ఆద్మీ పార్టీ తెలిపింది. కంచన్ జరీవాలాను బీజేపీ కిడ్నాప్ చేసినట్లు ఆప్ నేత మనీశ్ సిసోడియా ఆరోపించారు. సూరత్ ఈస్ట్ నియోజకవర్గం నుంచి కంచన్ జరీవాలా ఆప్ తరపున పోటీ చేయనున్నారు. గుజరాత్ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతో బీజేపీ తమ అభ్యర్థులను ఎత్తుకెళ్లుతున్నట్లు ఆయన ఆరోపించారు. నిన్నటి నుంచి కంచన్‌తో పాటు ఆయన కుటుంబసభ్యులు మిస్సింగ్‌లో ఉన్నారన్నారు. నామినేషన్ పేపర్లు దాఖలు చేసేందుకు ఆఫీసు నుంచి బయటకు వచ్చిన కంచన్‌ను బీజేపీ గుండాలు ఎత్తుకెళ్లినట్లు డిప్యూటీ సీఎం సిసోడియా ఆరోపించారు.
*పెట్రోల్ ట్యాంకర్ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగింది. క్షతగాత్రుల్లో కొందరు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడంతో మొత్తం మృతుల సంఖ్య 11కు చేరింది. గత నెల 29న 22 వేల లీటర్ల పెట్రోల్‌తో వెళ్తున్న ట్యాంకర్ మిజోరం రాష్ట్రం ఐజ్వాల్ జిల్లాలోని తురియల్ ఎయిర్‌ఫీల్డ్ వద్ద ప్రమాదానికి గురైంది.
*జగిత్యాలలోని చల్‌గల్ పండ్ల మార్కెట్‌ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌కుమార్.. వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి కోరారు. నియోజకవర్గంలోని పలు సమస్యలపై విన్నవించేందుకు ఇవాళ ఎమ్మెల్యే సంజయ్‌కుమార్.. వ్యవసాయ శాఖ కార్యాలయానికి వెళ్లి మంత్రి నిరంజన్‌రెడ్డిని కలిశారు.
*పేదలకు అందవలసిన రేషన్ బియ్యం పక్కదారిన పడుతుంది. కొందరు రేషన్ బియ్యాన్ని సేకరించి ఇతర రాష్ట్రాలకు అధిక ధరకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. తాజాగా సంగా రెడ్డి జిల్లా కోహీర్ రైల్వే గేటు సమీపంలో బుధవారం అక్రమంగా రవాణా చేస్తున్న రేషన్ బియ్యాన్ని పోలీసులు, పౌర సరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు.
*త్వరలోనే నియోజకవర్గాలవారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. మంగళవారం తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో 98% రెవెన్యూ సమస్యలు పరిష్కారమయ్యాయన్నారు. అతి త్వరలోనే తాను జిల్లా కలెక్టర్ల సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నానని, దీనికి ముందే రాష్ట్ర మంత్రిమండలి సమావేశాన్ని కూడా ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇంకా ఎక్కడైనా రెవెన్యూ సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే నిర్దిష్టమైన ఆదేశాలను కలెక్టర్లకు ఇస్తామన్నారు.
*పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రితో చర్చించామని ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఏపీలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్ర నిధులు అవసరమని షెకావత్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికే ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్లి ఏపీకి రావలసిన నిధులపై కేంద్రంతో చర్చించారన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం ఏపీకి ఎప్పుడూ ఉంటుందని భావిస్తున్నానన్నారు.
*అమరావతి భూముల కొనుగోలుపై సిట్ ఏర్పాటుపై సుప్రీంలో విచారణ ప్రారంభమైంది. టీడీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను సమీక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఏపీ ప్రభుత్వ నిర్ణయాన్ని టీడీపీ నేతలు ఆలపాటి రాజా, వర్ల రామయ్య తదితరులు హైకోర్టులో సవాలు చేశారు. సిట్ ఏర్పాటుపై స్టే విధిస్తూ గత ఏడాది సెప్టెంబర్ 15న హైకోర్టు తీర్పును వెలువరించింది. హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంలో సవాలు చేసింది. న్యాయమూర్తులు ఎంఆర్‌షా, ఎంఎం సుందరేశ్‌లతో కూడిన ధర్మాసనం ముందు విచారణ ప్రారంభమైంది.
*జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగనన్న కాలనీలకు వెళ్లే అర్హత లేదని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ… ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఏ ప్రభుత్వంలో అయినా పవన్ ఇలాంటి కాలనీలు చూశారా అని ప్రశ్నించారు. సీఎం జగన్ ఎవరికి లబ్ధి చేకూరుస్తున్నారో పవన్ తెలుసుకోవాలన్నారు. తెలంగాణా వాళ్ల కోసం ఆలోచించాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యమన్నారు. అభివృద్ధికి ఉపయోగపడే వారు.. మోదీనా.. అమిత్ షానా తమకు అనవసం.. రాష్ట్ర అభివృద్దే ముఖ్యమని తెలిపారు. చంద్రబాబు రాష్ట్రం మొత్తాన్ని కొల్లగొట్టారని ఆరోపించారు. అభివద్ది, సంక్షేమ నినాదంతో ముందుకు వెళ్తామని చెప్పారు. 2024లో జగనా.. చంద్రబాబా తేలుతుందని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు
*ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఫేస్ బుక్ సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. ప్రధాని పర్యటనకు రెండు రోజుల ముందే ఖాతా సేవలు స్తంభించాయి. హ్యాకింగ్ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వ్యక్తిగతంగా అవహేళనకు గురి చేసే విధంగా రాతలు ఉన్నాయి. తాజా పరిణామాలను నివేదిక రూపంలో సైబర్ క్రైమ్ పోలీసులకు బీజేపీ నాయకులు ఫిర్యాదు చేయనున్నారు.
*రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మతంతో సంబంధం లేకుండా భారతదేశంలోని ప్రజలందరూ హిందువులే అని ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు.ఛత్తీస్‌గఢ్‌లోని సుర్జుగాలోని అంబికాపూర్‌లో జరిగిన బహిరంగ సభలో భగవత్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘భారత ప్రజలందరూ హిందువులే. భారతదేశాన్ని తన మాతృభూమిగా భావించేవాడు హిందువు. అది ఏ మతాన్ని అనుసరించే వ్యక్తి అయినా, ఎలాంటి దుస్తులు ధరించే వ్యక్తి అయినా. ఇది నిజం సంఘ్ ఈ సత్యాన్ని చెబుతోంది. వందల సంవత్సరాలుగా మనం ఐక్యంగా ఉండడమే దీనికి కారణం’’ అని భగవత్ చెప్పారు.‘
*మూడు దశాబ్దాలకు పైగా ఓడరేవుల నిర్మాణం, సరకుల తరలింపు (లాజిస్టిక్స్) రంగంలో విశిష్ట సేవలందిస్తున్న తిరువారూరు జిల్లా మూ-వానల్లూరు వెట్టికాడు గ్రామానికి చెందిన మెరైన్ ఇంజనీరింగ్ నిపుణుడు ఎన్నరసు కరునేశన్‌ను రాష్ట్ర ప్రభుత్వం వావుసి అవార్డుకు ఎంపిక చేసింది. వావుసి 150వ జయంతి వేడుకల సందర్భంగా ఆయన పేరుతో నౌకా వాణిజ్య రంగంలో విశిష్టసేవలందించే వ్యక్తులకు అవార్డులను అందజేయనున్నట్లు ప్రకటించింది. ఆ మేరకు సచివాలయంలో మంగళవారం జరిగిన ఏర్పాటైన ప్రత్యేక కార్యక్రమంలో ఎన్నరసు కరునేశన్‌కు ఈ అవార్డును ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ప్రదానం చేశారు. ఈ అవార్డు కింద రూ.5లక్షల నగదు, ప్రశంసా పత్రాన్ని ఆయన అందజేశారు.
*ఆలందూర్ ప్రాంతం ముంపునకు గురికావడంతో అప్పటి ముఖ్యమంత్రి పళనిస్వామి బాధ్యత వహించాలని మంత్రి టీఎం అన్బరసన్ ఆరోపించారు. నగరంలో మంగళవారం మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ, తిరువళ్లువర్‌నగర్, గణేశ్‌నగర్ కాల్వలు ఎత్తుగా నిర్మించకపోవడంతోనే ఈ ప్రాంతం ముంపునకు గురైందన్నారు. అప్పట్లో ప్రతిపక్ష పార్టీగా పలుమార్లు అన్నాడీఎంకే ప్రభుత్వానికి సూచించినా ఫలితం లేదన్నారు. తాను మూడూ రోజులుగా ఈ ప్రాంతంలోనే ఉంటూ సహాయక చర్యలు పర్యవేక్షిస్తున్నానని, రూ.120 కోట్లతో పోరూర్ నుంచి వర్షపు నీరు వెళ్లేలా చర్యలు చేపట్టినట్లు మంత్రి తెలిపారు.
*చెన్నై – మైసూరు(Chennai – Mysore) నగరాల మధ్య ఈ నెల 11న ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన వందేభారత్ రైలులో ప్రయాణీకుల రద్దీ రోజురోజుకూ పెరుగుతోంది. గంటకు 160 కి.మీల వేగంతో నడిచే సామర్థ్యం కలిగిన ఈ రైలును ప్రస్తుతం గంటకు 110 కి.మీల వేగంతో నడుపుతున్నారు. అత్యంత ఆధునిక సదుపాయాలు కూడా ఉండటంతో ఈ రైలులో ప్రయాణించేందుకు ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. ఈ రైలులో ప్రయాణికులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, బిస్కెట్లు, టీ, కాఫీ కూడా అందిస్తున్నారు. ఈ రైలులో మొత్తం 1280 మంది ప్రయాణించేందుకు సీట్లున్నాయి. ప్రస్తుతం సుమారు 1000 సీట్లకు టికెట్లు అమ్ముడవుతున్నాయని రైల్వే శాఖ ఉన్నతాధికారులు తెలిపారు. బెంగళూరు, మైసూరు నగరాలకు విహారయాత్రగా వెళ్ళాలనుకునేవారు కూడా వందేభారత్(Vande Bharat) రైలులో అధికంగా ప్రయాణిస్తున్నారని తెలిపారు. ఈ కొత్త రైలు సర్వీసుకు నాలుగు రోజుల్లోనే ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించడం సంతోషదాయకంగా ఉందన్నారు.
*రానున్న శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్(Congress) టికెట్ల కోసం భారీగా డిమాండ్ నెలకొనడంతో ఆశావహుల వినతి మేరకు గడువును పెంచుతున్నట్లు కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ప్రకటించారు. గత పదిరోజుల వ్యవధిలో 1100 మంది రూ.5వేల రుసుం చెల్లించి దరఖాస్తులు కొనుగోలు చేయగా వీరిలో 500 మంది నిర్దేశిత డిపాజిట్ రూ.2లక్షలు చెల్లించారు. కేపీసీసీ గత ఏడాది టికెట్ల దరఖాస్తు కోసమే ప్రత్యేక నియమావళిని రూపొందించింది. ప్రస్తుత ఏడాదినుంచే అమలు చేస్తున్నట్టు కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ప్రకటించిన సంగతి విదితమే. ఇంతవరకు 40 మంది సిట్టింగ్‌లు మాత్రమే మళ్లీ టికెట్ కోసం దరఖాస్తులు అందచేశారు. ఇంకా 20 మందికిపైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులైతే రూ.2 లక్షలు, ఎస్సీ ఎస్టీలైతే రూ.లక్ష డిపాజిట్ చెల్లించాల్సి ఉంది. ఒకే కుటుంబానికి ఒకే టికెట్ అనే సిద్ధాంతానికి అనుగుణంగా దరఖాస్తుల విషయంలోనూ అనుసరిస్తున్నారు. ఆశావహుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఈనెల 21 వరకు గడువును పొడిగిస్తూ కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్(DK Sivakumar) ప్రకటించారు. డిసెంబరు నాటికి దరఖాస్తుల పరిశీలన పూర్తి చేయనున్నారు. అనంతరం జనవరిలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ పరిశీలనకు ఈ జాబితాను పంపించనున్నారు. చివరి క్షణంలో ఇతర పార్టీల నుంచి వలసవచ్చే సీనియర్ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు గ్రీన్ కార్డ్ ఎంట్రీ పేరిట కొత్త వెసులుబాటును కేపీసీసీ టికెట్ల కేటాయింపులో కల్పించనున్న సంగతి విదితమే.
*ప్రియురాలు, జీవిత సహచరి అయిన శ్రద్ధావాకర్ ను ప్రియుడే దారుణంగా హత్య చేసిన నేపథ్యంలో మాజీ ఐపీఎస్ అధికారిణి,పుదుచ్చేరి మాజీ లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ ఆడపిల్లల తల్లిదండ్రులకు తాజాగా సలహా ఇచ్చారు. కుమార్తె శ్రద్ధా తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పినా ఆమె తల్లిదండ్రులు కుమార్తెను ట్రాక్ చేయాల్సి ఉండేదని కిరణ్ బేడీ చెప్పారు.
*పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రితో చర్చించామని ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఏపీలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్ర నిధులు అవసరమని షెకావత్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికే ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్లి ఏపీకి రావలసిన నిధులపై కేంద్రంతో చర్చించారన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం ఏపీకి ఎప్పుడూ ఉంటుందని భావిస్తున్నానన్నారు.
*ఆక్వా రైతుల పాలిట విలన్ జగన్ మోహన్ రెడ్డి
అని టీడీపీ శాసనమండలి సభ్యులు మంతెన సత్యనారాయణరాజు విమర్శించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ… వైసీపీ సర్కార్ అసమర్థతతో ఆక్వా రంగం సంక్షోభంలో పడిందారు. కిలో రొయ్యల ఉత్పత్తి వ్యయం రూ.300.. అమ్మకం మాత్రం రూ.180 అని తెలిపారు. భారతీ సిమెంట్, సాక్షి పేపర్ ఒక రూపాయి నష్టానికి అమ్ముతారా అని ప్రశ్నించారు. ఆక్వా రైతులు మాత్రం ఎందుకు నష్టానికి అమ్ముకోవాలని నిలదీశారు. ఆక్వా రైతులకు రూ.1.50కే యూనిట్ విద్యుత్ ఇస్తామని రూ.5.30 చొప్పున వసూలు చేస్తున్నారని మంతెన సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు.
*పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రితో చర్చించామని ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి తెలిపారు. ఏపీలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్ర నిధులు అవసరమని షెకావత్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కేంద్రం నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉందన్నారు. ముఖ్యమంత్రి ఇప్పటికే ఎన్నోసార్లు ఢిల్లీ వెళ్లి ఏపీకి రావలసిన నిధులపై కేంద్రంతో చర్చించారన్నారు. కేంద్ర ప్రభుత్వ సహకారం ఏపీకి ఎప్పుడూ ఉంటుందని భావిస్తున్నానన్నారు.
*జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు జగనన్న కాలనీలకు వెళ్లే అర్హత లేదని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ… ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఏ ప్రభుత్వంలో అయినా పవన్ ఇలాంటి కాలనీలు చూశారా అని ప్రశ్నించారు. సీఎం జగన్ ఎవరికి లబ్ధి చేకూరుస్తున్నారో పవన్ తెలుసుకోవాలన్నారు. తెలంగాణా వాళ్ల కోసం ఆలోచించాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే ముఖ్యమన్నారు. అభివృద్ధికి ఉపయోగపడే వారు.. మోదీనా.. అమిత్ షానా తమకు అనవసం.. రాష్ట్ర అభివృద్దే ముఖ్యమని తెలిపారు. చంద్రబాబు రాష్ట్రం మొత్తాన్ని కొల్లగొట్టారని ఆరోపించారు. అభివద్ది, సంక్షేమ నినాదంతో ముందుకు వెళ్తామని చెప్పారు. 2024లో జగనా.. చంద్రబాబా తేలుతుందని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు.
*తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులును పోలీసులు అడ్డుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న మైనార్టీ కుటుంబాన్ని పరామర్శించేందుకు కాల్వ శ్రీనివాసులు బొమ్మనహల్ మండలం, ఉంతకల్లుకు వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కల్యాణదుర్గం ఇన్‌చార్జ్ డీఎస్పీ ప్రసాద్‌రెడ్డి, కాల్వ శ్రీనివాసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో బొమ్మనహల్, కణేకల్లులో టీడీపీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల కణేకల్ పోలీసుల తీరుతో మైనార్టీ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది.
*పులివెందులలో కృష్ణమోహన్ అనే వీఆర్ఓపై పెద్ద మస్తాన్ అనే వ్యక్తి కత్తితో దాడికి పాల్పడ్డాడు. తహసీల్దార్ కార్యాలయంలోనే దస్తగిరి అనే వ్యక్తి విఆర్‌ఓపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. పులివెందుల నగిరిగుట్టలోని ఓ స్థల వివాదాన్ని పరిష్కరించలేదనే కారణంగా దస్తగిరి దాడికి పాల్పడినట్టు తెలుస్తోంది. గాయపడిన వీఆర్‌ఓను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ నిర్వహిస్తున్నారు.
*మొబైల్ షాప్ వ్యాపారం మాటున అక్రమంగా సిమ్‌కార్డులు పొంది ఇతరులకు సరఫరా చేస్తున్న ఓ వ్యక్తిని సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్, ఫలక్‌నుమా పోలీసులు సంయుక్తంగా పట్టుకున్నారు. పాతనగరంలోని వట్టేపల్లి ప్రాంతంలో జూబిలీ మొబైల్ షాపు నిర్వాహకుడు ఎం.ఏ. బారి (25) సిమ్‌కార్డు కోసం తన వద్దకు వచ్చే కస్టమర్ల ఫొటోలు, వారి గుర్తింపు పత్రాల జిరాక్స్ కాపీలతో నకిలీ సిమ్‌కార్డులు తీసుకుని, వాటిని ఇతరులకు విక్రయించేవాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి బారి వద్ద సిమ్‌కార్డు కొనుగోలు చేశాడు. కాగా, అతడి ఐడీ కార్డు జిరాక్స్ కాపీలు, ఫొటోలు తీసుకున్నాడు. సాంకేతిక సమస్యల కారణంగా ఫొటోలు ఎక్కువగా తీసుకున్నట్లు చెప్పాడు. బాధితుడు మరో సిమ్ కార్డు తీసుకోడానికి బీఎ్‌సఎన్‌ఎల్ కార్యాలయానికి వెళ్లగా అప్పటికే మరో మూడు సిమ్ కార్డులు రిజిస్టర్ అయి ఉన్నాయని తెలుసుకున్నాడు. మొబైల్ షాపు యజమాని వద్దకు వెళ్లి నిలదీయగా నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారు బారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో సిమ్‌కార్డులు ఇతరులకు ఇచ్చినట్లు ఒప్పుకున్నాడు. అతడి నుంచి 50 బీఎ్‌సఎన్‌ఎల్ సిమ్‌కార్డులు, ఓ ఫోన్‌ను టాస్క్‌ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం నిందితుడిని ఫలక్‌నుమా పోలీసులకు అప్పగించారు.
*ఏపీ శాప్ అధికారుల తీరు వివాదాలకు కేంద్రంగా మారింది. కబడ్డీ క్రీడాకారులకు ఏపీ శాప్ శాపంగా మారింది. రేపు ఉత్తరాఖండ్‌లో జరుగనున్న జూనియర్ జాతీయ కబడ్డీ టోర్నమెంట్స్‌కు ఏపీ తరుపున క్రీడాకారులను హైకోర్టు ఎంపిక చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో శాప్ అధికారులు దిగివచ్చారు. రేపు టోర్నమెంట్ జరుగనుండగా… ఈరోజు సెలక్షన్‌పై వివాదం చోటు చేసుకుంది.
*పెనుమూరు తాసిల్దార్ రమణిని చిత్తూరు కలెక్టరేట్ లో రిపోర్ట్ చేసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ ఆదేశాలు…!
*చిత్తూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో గత రాత్రి స్వల్పంగా కంపించిన భూమి పది సెకన్ల పాటు భూమి కంపించడంతో భయభ్రాంతులకు గురైన ఇళ్ల నుంచి బయటకు వచ్చి పరుగులు తీసిన జనం ముఖ్యంగా పలమనేరు, గంటఊరు, గంగవరం, కీలపట్ల, బండమీద జరావారిపల్లి తదితర ప్రాంతాల్లో కనిపించిన ప్రకంపనలు 15 నిమిషాల వ్యవధిలో మూడుసార్లు కంపించిన భూమికాగా, గతంలోనూ జిల్లాలోని పలు ప్రాంతాల్లో భూమి కంపించింది. భూకంపం కారణంగా అప్పట్లో ఈడిగపల్లి, చిలకావారిపల్లి, షికారు, గూడవారిపల్లిలో ఇళ్లకు పగుళ్లు ఏర్పడ్డాయి. అయితే, ఈసారి మాత్రం ఎవరికీ ఎలాంటి నష్టం సంభవించలేదు
*కర్ణాటక లోని కలబురగి జిల్లా సేదమ్ టౌన్‌లో సోమవారం రాత్రి దారుణ హత్యా ఘటన చోటుచేసుకుంది. బీజేపీ నేత మల్లికార్జున ముత్యాల ను గుర్తు తెలియని వ్యక్తులు దారణంగా నరికి చంపారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. సంఘటన వివరాల ప్రకారం, 64 ఏళ్ల మల్లికార్జున ముత్యాల తన ఎలక్ట్రానిక్ షాపులో నిద్రిస్తుండగా ఈ ఘటన జరిగింది. దుండగులు ఆయనను దారుణంగా హత్య చేసి, శరీరంలోని ముఖ్య భాగాలను ముక్కలుగా కత్తిరించారు. దుకాణంలోని వస్తువులు కానీ, సొమ్ము కానీ ఎక్కడివక్కడే ఉండటంతో ఇది దొంగతనం కోసం జరిగిన ప్రయత్నం కాకపోవచ్చని చెబుతున్నారు.
*కాకినాడలో ఘోర రోడ్డు ప్రమాదం (road accident) జరిగింది. గండేపల్లి మండలం మల్లేపల్లిలో వద్ద ఆగివున్న లారీని టాటా మ్యాజిక్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా..మరో 9 మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు దగ్గర్లో ఉన్న ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటన తాడేపల్లిగూడెం నుంచి విశాఖ వెళ్తుండగా చోటు చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సివుంది.
*మహాత్మాగాంధీ చంపిన హంతకుడు నాథూరాం గాడ్సే వర్థంతి జరిపిన కర్ణిసేన కొత్త వివాదం రేపింది.మహారాష్ట్రలోని పన్వేల్ నగరంలో కర్ణి సేన మంగళవారం నాథూరామ్ గాడ్సే శౌర్య దివస్‌గా పాటించింది.మహాత్మా గాంధీ హంతకుడైన నాథూరామ్ గాడ్సే వర్ధంతిని శౌర్య దివస్‌గా కర్ణి సేన నిర్వహించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
* దేశవ్యాప్తంగా సంచలనం రేపిన శ్రద్ధావాకర్ దారుణ హత్య కేసులో రోజుకో కొత్త విషయం వెలుగుచూస్తోంది. శ్రద్ధాను అత్యంత పాశవికంగా కత్తితో కోసి హతమారుస్తున్నపుడు ఆమె ప్రియుడు అఫ్తాబ్ అమీన్ పూనావాలా( స్వల్పంగా గాయపడ్డాడని పోలీసుల తాజా దర్యాప్తులో తేలింది.గాయంతో నిందితుడు ఆఫ్తాబ్ అమీన్ మే నెలలో తన అపెక్స్ హాస్పిటల్ కు రావడంతో అతనికి తాను చికిత్స చేశానని డాక్టర్(Doctor) అనిల్ కుమార్ చెప్పారు. తన వద్దకు ఆఫ్తాబ్ చికిత్స కోసం వచ్చినపుడు అతను చాలా దూకుడుగా కనిపించాడని, తాను గాయం ఎలా అయిందని అడిగినప్పుడు పండ్లు కోస్తుండగా గాయపడ్డానని చెప్పాడు. లోతైన గాయం కాకుండా ఉపరితలంపై అయిన గాయంతో తనకు ఎలాంటి సందేహం కలగలేదని డాక్టర్ కుమార్ చెప్పారు.
*‘పార్టీ మారాలని నా బిడ్డ కవితనే బీజేపీ వాళ్లు అడిగారు. ఇంతకంటే ఘోరం ఉంటుందా!? పార్టీ మారాలంటూ ఢిల్లీలో ఆప్ మంత్రి సిసోడియాను ఏకంగా ఈడీ అధికారులే అడిగారు. మీ ఫోన్లపై నిఘా ఉంది. ‘పార్టీ మారతారా!?’ అని ఫోను చేసి ఎవరైనా అడిగితే.. ‘చెప్పుతో కొడతా’ అనాలి. రాష్ట్రంలో మూడున్నర కోట్ల మంది ప్రజలు ఉంటే.. వారిలో 60 లక్షల సభ్యత్వం కలిగిన పార్టీలో దర్జాగా ఉన్నామని ధైర్యంగా ఉండాలి’’ అని పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నిర్దేశించారు. ముందస్తు ఎన్నికలు ఉండవని, షెడ్యూలు ప్రకారం వచ్చే ఏడాది డిసెంబరులోనే ఎన్నికలు ఉంటాయని స్పష్టత ఇచ్చారు.
*ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ కేసును దర్యాప్తు చేయొచ్చని హైకోర్టు డివిజన్ బెంచ్ స్పష్టం చేసింది.
*కేజీబీవీలో పని చేస్తున్న కాంట్రాక్టు ఉపాధ్యా యులను, ఉద్యోగులను రెగ్యూలర్ చేసి కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేయాలని తెలంగాణ ప్రోగ్రేసీవ్ టీచర్స్ ఫెడరేషన్(టీపీటీఎఫ్) పిలుపు మేరకు కేజీబీవీ ఉపాధ్యాయులు, సిబ్బంది నిరసన తెలిపారు.
*ఎన్టీఆర్ సాగర్‌లో మంగళవారం 3.78 లక్షల చేపపిల్లలతో పాటు 1.70 లక్షల రొయ్య పిల్లలను జారవిడిచారు. ఈ సందర్భంగా జిల్లా మత్స్యశాఖాధికారి సాంబశివరావు మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 260 చెరువుల్లో 1.37 కోట్ల చేప పిల్లలను వదలడం లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఇప్పటి వరకు 90 శాతం పూర్తయిందని తెలిపారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ శ్రీనివాస్, ఆర్‌ఎస్‌ఎస్ అధ్యక్షుడు శంకర్‌గౌడ్, నాయకులు రాజయ్య, మల్లేష్, మత్స్యకారులు మల్లేష్, రమేష్, సతీష్, భీమయ్య, రాజేశం తదితరులు పాల్గొన్నారు.
*రాబోయే 16 నెలల్లో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు సంభవిస్తాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP state president Annamalai) జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ఆస్తి, గృహ పన్ను, విద్యుత్ చార్జీలు, పాల ధరల పెంపు తదితరాలకు నిరసనగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఈరోడ్ జిల్లా అంధియూర్‌లో చేపట్టిన ధర్నాకు నేతృత్వం వహించిన అన్నామలై మాట్లాడుతూ… డీఎంకే అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రతిరోజూ ఏదో ఒక వస్తువు ధరలు పెం చుతున్నారన్నారు. ముఖ్యమంత్రి స్టాలిన్ ‘మేనియా’ అనే వ్యాధితో బాధపడుతూ ప్రకటనల కోసమే రోజూ ఫొటో లు దిగు తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారని ఆరోపించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో తమ కూటమి నుంచి 26 మంది ఎంపీలు పార్లమెంటుకు వెళ్లనున్నారని జోస్యం చెప్పారు. ప్రజా వ్యతిరేక విధానాలను డీఎంకే ప్రభుత్వం విడనాడాలని అన్నామలై హితవు పలికారు.
*డబ్బు సంపాదన కోసం పథకం ప్రకారమే డీఎంకే ప్రభుత్వం వర్షపు నీటి కాలువల నిర్మాణపనుల్లో జాప్యం చేస్తోందని సినీనటి, బీజేపీ నాయకురాలు ఖుష్బూ ఆరోపించారు. అడయార్ బీఎస్ఎన్‌ఎల్ కార్యాలయం సమీపంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కరాటే త్యాగరాజన్ ఆధ్వర్యంలో జరిగిన ఆందోళనలో పాల్గొన్న ఖుష్బూ మాట్లాడుతూ.. వర్షాలకు ముందే వర్షపునీటి కాలువల నిర్మాణం ఎందుకు చేపట్టలేదని ప్రశ్నించారు. డీఎంకే వారికి డబ్బులు మాత్రమే కావాలని, ముఖ్యమంత్రి(Chief Minister) ఇంటికి సూట్‌కేసుల్లో డబ్బు వెళుతోందని, ఈ విషయం చెప్పినందుకు తనపై కేసు నమోదుచేసినా పర్వాలేదని ఖుష్బూ వ్యాఖ్యానించారు.
*త్వరలోనే నియోజకవర్గాలవారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ వెల్లడించారు. మంగళవారం తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్ విస్తృతస్థాయి సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో 98% రెవెన్యూ సమస్యలు పరిష్కారమయ్యాయన్నారు. అతి త్వరలోనే తాను జిల్లా కలెక్టర్ల సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నానని, దీనికి ముందే రాష్ట్ర మంత్రిమండలి సమావేశాన్ని కూడా ఏర్పాటుచేస్తామని వెల్లడించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఇంకా ఎక్కడైనా రెవెన్యూ సంబంధిత సమస్యలు ఏమైనా ఉంటే నిర్దిష్టమైన ఆదేశాలను కలెక్టర్లకు ఇస్తామన్నారు. ఇప్పటికే మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి తదితరుల నేతృత్వంలోని కమిటీ రెవెన్యూ సమస్యలపై అధ్యయనం చేసిందని, 98 శాతం రెవెన్యూ సమస్యలు ధరణి రావడంతో పరిష్కారమయ్యాయని అన్నా రు
*: బీజేపీ, మోదీ సర్కారుకు గవర్నర్లు పావులుగా మారారని సీపీఎం జనరల్ సెక్రటరీ సీతారాం ఏచూరి ఆరోపించారు. బీజేపీయేతర పాలిత రాష్ర్టాల్లోని విశ్వవిద్యాలయాల్లో జోక్యం చేసుకొనేలా, బీజేపీ-ఆరెస్సెస్ ఎజెండా అమలు చేసేలా గవర్నర్ల కార్యాలయాలు మారిపోయాయని విమర్శించారు. ఇండియాను ఫాసిస్టు హిందుత్వ దేశంగా మార్చే కుట్రలో ఇది భాగమని తెలిపారు.
*వాట్సాప్ ఇండియా అధిపతి అభిజిత్ బోస్ రాజీనామా చేశారు. అలాగే మెటా పబ్లిక్ పాలసీ అధిపతి రాజీవ్ అగర్వాల్ సైతం తప్పుకున్నట్టు మంగళవారం సామాజిక మాధ్యమ దిగ్గజం మెటా తెలియజేసింది. అయితే ప్రపంచవ్యాప్తంగా 11వేల మందిని తొలగిస్తున్నట్టు మెటా ప్రకటించిన వారం రోజుల్లోపే ఈ రాజీనామాలు జరగడం అత్యంత ప్రాధాన్యాన్ని సంతరించుకున్నాయి.
*ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ను మంగళవారం యునైటెడ్ ఇవాంజిలిస్ట్స్ అండ్ క్రిస్టియన్స్ అసోసియేషన్ తెలంగాణ అధ్యక్షుడు డాక్టర్ రాచపూడి ప్రదీప్ శ్యామ్, ప్రధాన కార్యదర్శి కల్లోజి రవికుమార్ కలిశారు. క్రిస్మస్ వేడుకలకు మం త్రిని ఆహ్వానించారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల పట్ల సంతోషం వ్యక్తం చేశారు.
* అన్నమయ్య: జిల్లాలోని మదనపల్లి చంద్ర కాలనీలో టూటౌన్ పోలీసులు దాడులు నిర్వహించారు. దాడుల్లో భాగంగా వ్యభిచార గృహంపై పోలీసులు నిఘాపెట్టారు. అయితే ఈ దాడుల్లో నిర్వాహకురాలితోపాటు ఇద్దరు విటులను పోలీసులు అరెస్టు చేశారు. పక్కా సమాచారంతో ఆ వ్యభిచార గృహంపై దాడి జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఇంకా ఎంతమంది ఈ కోవకు చెందినవారిగా ఉన్నారో పోలీసులు ఆరా తీస్తున్నారు.
* టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణకు సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్ కేసులో 160 సీఆర్‌పీసీ కింద నోటీసులు జారీ చేశారు. అధికారులు ఇచ్చిన నోటీసులను నారాయణ హైకోర్టులో సవాల్ చేశారు. నారాయణ శస్త్ర చికిత్స చేయించుకున్నారని న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ న్యాయస్థానం దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన హైకోర్టు.. హైదరాబాద్, కూకట్‌పల్లిలోని నారాయణ నివాసంలో ఆయనను ప్రశ్నించాలంటూ ఏపీ సీఐడీ అధికారులను న్యాయస్థానం ఆదేశించింది.
* గుజరాత్‌లోని సూరత్ నగరంలోని పాండేసర ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్ ఫ్లాట్‌లో నిషేధిత మెఫోడ్రోన్ అనే మత్తు మందు దాచినట్లు అందిన సమాచారం మేరకు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దాడి జరిపారు. 24 ఏండ్ల ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడి ఫ్లాట్ నుంచి 1.796 కిలోల మెఫోడ్రోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.1.80 కోట్లుగా ఉంటుందని పోలీసులు తెలిపారు. అతడినపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. రెండు రోజుల క్రితమే సూరత్ పోలీసులు కేజీ బంగారం బిస్కెట్లతోపాటు రూ.68 లక్షల నగదుతో ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. గుజరాత్‌లో డ్రగ్స్ పెరిగిపోతున్నదన్న వార్తలకు ఈ అరెస్ట్ బలం చేకూరుస్తున్నది.