అలనాటి అందాల తార శ్రీదేవి, బోనీకపూర్ దంపతుల ముద్దుల కుమార్తె జాన్వీ కపూర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తరచూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను అభిమానులతో షేర్ చేసుకుంటుంటుంది. జాన్వీ తాజాగా ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది. శ్రీదేవి నటిగా తన కెరీర్‌లో బిజీగా ఉన్న టైంలో చెన్నైలోనే ఎక్కువ సమయం గడిపేవారు. ఆ సమయంలో కొనుగోలు చేసిన ఇంటిని తాజాగా జాన్వీ హోమ్‌టూర్ చేసి అభిమానులకు చూపించింది.ఇంద్రభవనం లాంటి ఆ ఇంట్లో ఎక్కువగా పెయింటింగ్సే కనిపించాయి. శ్రీదేవి, బోనీ కపూర్‌కు సంబంధించిన పలు అరుదైన ఫొటోలను సైతం ఈ వీడియోలో జాన్వీ చూపించింది. ఇక ఆ ఇంట్లో తనకు ఇష్టమైన ప్రదేశం, జిమ్, డైనింగ్ హాల్, బెడ్‌రూమ్స్ ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తూ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంది. వోగ్ ఇండిగా యూట్యూబ్ ఛానల్ ద్వారా చెన్నైలోని శ్రీదేవి నివాసాన్ని అభిమానులకు పరిచయం చేసింది. ఇంకెందుకు ఆలస్యం అందమైన ఆ ఇంటిపై మీరూ ఓ లుక్కేయండి.