నిఖిల్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న చిత్రం ‘18 పేజెస్’. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకుడు. బన్నీవాస్ నిర్మాత. నిర్మాణానంతర కార్యక్రమాలు తుది దశకు చేరుకొన్నాయి. డిసెంబరు 23న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. నెల 22న ‘నన్నయ రాసిన…’ అనే లిరికల్ వీడియోని విడుదల చేస్తున్నారు. గోపీ సుందర్ సంగీతం అందించారు. ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు సుకుమార్ కథ అందించడం విశేషం. ఆయన ఈ చిత్ర నిర్మాణంలోనూ భాగం పంచుకొన్నారు. ‘‘ఇదో అందమైన ప్రేమ కావ్యం. టైటిల్‌కి తగినట్టే… కథ కూడా ఆసక్తికరంగా సాగుతుంది. యువతరానికి నచ్చే అంశాలు చాలా ఉన్నాయ’’ని దర్శక నిర్మాతలు తెలిపారు.