Movies

నా మనసు గాల్లో తేలుతోంది

Auto Draft

‘యశోదపై చూపిస్తున్న ప్రేమ, ఆదరణకు ధన్యవాదాలు. మీరిచ్చే ప్రశంసలు, మద్దతు గమనిస్తున్నాను. ఇదే నాకు లభించిన గొప్ప బహుమతి. సినిమాకు వస్తున్న స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉంద’’న్నారు సమంత. ఆమె నటించిన ‘యశోద’ ఇటీవలే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా సోషల్‌ మీడియా ద్వారా ఓ భావోద్వేగమైన సందేశం అందించారు సమంత. ప్రేక్షకుల్ని, అభిమానుల్ని ఉద్దేశించి సమంత ఈ ట్వీట్‌ చేశారు. ‘‘యశోద చిత్రాన్ని ప్రదర్శిస్తున్న థియేటర్లలో మీ సంబరాలు చూశాను. సినిమా గురించి మీరు చెప్పిన మాటలు విన్నాను. దీని వెనుక మా చిత్రబృందం అహర్నిశలూ పడిన శ్రమ ఉంది. ఇప్పుడు నా మనసు గాల్లో తేలుతున్నట్టుంది. ఈ సినిమాకి పనిచేసిన వారందరికీ, నాపై, ఈ కథపై నమ్మకం ఉంచిన నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్‌ గారికీ కృతజ్ఞతలు’’ అంటూ ట్వీట్‌ చేశారు.