మలేషియాలో ఇవాళ జాతీయ ఎన్నికలు జరుగుతున్నాయి. గత కొన్నేళ్ల నుంచి ఆ దేశంలో రాజకీయ అస్థిరత నెలకొన్న విషయం తెలిసిందే. ఇవాళ భారీ సంఖ్యలో ప్రజలు పోలింగ్ బూత్‌లకు వెళ్తున్నారు. ద్రవ్యోల్బణం, వాతావరణ మార్పులు ఈసారి ఎన్నికల్లో కీలక అంశాలు కానున్నాయి.ప్రధాని ఇస్మాయిల్ సాబ్రి యాకూబ్ మరో సారి అధికారాన్ని చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కరోనా మహమ్మారిని సరిగా హ్యాండిల్ చేయలేకపోయినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ప్రతిపక్ష నేత అన్వర్ ఇబ్రహీం గట్టి పోటీ ఇవ్వనున్నారు.పార్లమెంట్ ఎన్నికల్లో 97 ఏళ్ల మాజీ ప్రధాని మహతీర్ మొహమ్మద్ కూడా పోటీపడుతున్నారు. ఇటీవల ఆయన గుండె సంబంధిత చికిత్స కూడా తీసుకున్నారు. 2018లో రెండోసారి ప్రధాని అయిన తర్వాత రెండేళ్లకే మహతీర్‌ను గద్దె నుంచి దింపారు. లాంగ్‌కావి రిసార్ట్ ఐలాండ్ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు.మలేషియా పార్లమెంట్‌లో మొత్తం 222 సీట్లు ఉన్నాయి. వాటి కోసం దాదాపు వెయ్యికి మందిపైగా పోటీపడుతున్నారు. 15వ జనరల్ ఎలక్షన్‌లో ఎవరు గెలుస్తారో ఇప్పుడే చెప్పలేని పరిస్థితి నెలకొన్నది.