మార్గదర్శి నిబంధనలు అతిక్రమించినట్టు తన వద్ద ఆధారాలున్నాయని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మార్గదర్శి కేసుపై ఏపీ ప్రభుత్వానికి ఆధారాలు ఇస్తా. ప్రభుత్వం నన్ను సంప్రదించలేదు. మార్గదర్శిపై సమాచార హక్కు చట్టం ప్రకారం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రార్‌కు దరఖాస్తు చేశాను. ఇప్పటికీ మార్గదర్శిలో చట్ట వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగుతున్నాయి. రామోజీరావుకి పద్మవిభూషణ్ కాదు భారతరత్న ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం రమ్మంటే స్వాధీనం చేసుకున్న మార్గదర్శి రికార్డులు నేను చూస్తాను. రామోజీరావులా ప్రభుత్వం కూడా నాలుగు శాతం వడ్డీకి ప్రజల నుంచి డిపాజిట్లు సేకరిస్తుందా?. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో అతిపెద్ద చిట్ ఫండ్ కంపెనీ మార్గదర్శి. చిట్ ఫండ్ చట్టాన్ని, రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్దంగా మార్గదర్శి డిపాజిట్లు సేకరిస్తుంది. జగన్ చేసిన తప్పులు రోజూ పత్రికల్లోవస్తున్నాయి. అందువల్లే నేను మాట్లాడటం లేదు’’ అని ఉండవల్లి చెప్పుకొచ్చారు.