46 సంవత్సరాల ఘనచరిత్ర కలిగిన డెట్రాయిట్ తెలుగు సంఘం(DTA) 2022 దీపావళి వేడుకలు ఘనంగా నిర్వహించారు. నూతన అధ్యక్షుడిగా దుగ్గిరాల కిరణ్ బాధ్యతలు చేపట్టారు. సభ్యుల సహకారంతో సాంస్కృతిక, విద్యా, క్రీడా, సేవా కార్యక్రమాలతో స్థానిక ప్రవాసులకు సంస్థను చేరువ చేయడంతో పాటు బలోపేతం చేసేందుకు కార్యవర్గాన్ని కలుపుకుని ముందరకు వెళ్తానని కిరణ్ పేర్కొన్నారు. DTA ప్రతిష్టామకంగా అందజేసే వడ్లమూడి వెంకటరత్నం పురస్కారాన్ని అయితా నాగేందర్, విశిష్ట సేవా పురస్కారాన్ని మంతెన వెంకట్, సోము అమరేశ్వర్ ప్రసాద్‌లకు అందజేశారు. పంత్ర సునీల్, 2023 తానా సభల సమన్వయకర్త పొట్లూరి రవిలు వేడుక నిర్వహణకు సహకరించారు. అక్కిరెడ్డి కుసుమ కళ్యాణి సాంస్కృతిక కార్యక్రమాలు పర్యవేక్షించారు. కార్యక్రమంలో తానా అధ్యక్షుడు లావు అంజయ్య, గోగినేని శ్రీనివాస్, కోనేరు శ్రీన్వీఅస్, పెద్దిబోయిన జోగేశ్వరరావు, బచ్చు సుధీర్, రమణ ముదిగంటి, యక్కా వెంకట్, అంచె హర్ష, మన్నే నీలిమ, బొప్పన ద్వారకా ప్రసాద్, కొడాలి నరేన్, ప్రభల జగదీష్, ఈదర మోహన్, ఆత్మకూరి సంతోష్, గడ్డం శుభ్రత, తొట్టెంపూడి రాజా, ప్రణీత్ నాని, ఒమ్మి ఉమా మహేష్ యాదవ్, గెద్ది లవకుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఘనంగా DTA దీపావళి. అధ్యక్షుడిగా దుగ్గిరాల కిరణ్ ప్రమాణస్వీకారం
Related tags :