పెద్దశేష వాహనంపై శ్రీ వైకుంఠ నారాయణుడి అలంకారంలో సిరులతల్లి- – TNI ఆధ్యాత్మిక వార్తలు
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండవ రోజైన సోమవారం ఉదయం ఏడు తలలు గల పెద్దశేషవాహనంపై శ్రీ వైకుంఠ నారాయణుడి అలంకారంలో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాలు, చెక్కభజనల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు వాహనసేవ కొనసాగింది. అడుగడుగునా భక్తులు కొబ్బరికాయలు, కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని సేవించుకున్నారు.
శ్రీపద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలలో రెండవ వాహనం పెద్దశేషుడు. లక్ష్మీ సహితుడైన శ్రీవారికి దాసుడిగా, సఖుడిగా, శయ్యగా, సింహాసనంగా, ఛత్రంగా సమయోచితంగా సేవలందిస్తాడు. అభయ వరదహస్తయైన శ్రీవారి పట్టమహిషి అలిమేలు మంగకు వాహనమై తన విశేష జ్ఞానబలాలకు తోడైన దాస్యభక్తిని తెలియజేస్తున్నాడు. సర్పరాజైన శేషుని వాహన సేవను తిలకించిన వారికి యోగశక్తి కలుగుతుంది. రాత్రి 7 గంటల నుంచి 9 గంటల వరకు అమ్మవారు హంస వాహనంపై భక్తులకు కనువిందు చేయనున్నారు. వాహనసేవల్లో పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్‌స్వామితో పాటు పలువురు టీటీడీ అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
*గోపాల కృష్ణుడి అలంకారంలో అభయం
తొలిరోజైన ఆదివారం రాత్రి పద్మావతి అమ్మవారు గోపాల కృష్ణుడి అలంకారంలో పిల్లనగ్రోవి ధరించి చిన్న శేష వాహనంపై అభయమిచ్చారు. రాత్రి 7 గంటల నుంచి అమ్మవారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. వాహనం ముందు గజరాజులు నడుస్తుండగా, భక్తజన బృందాలు చెక్కభజనలు, కోలాటాలు , మంగళవాయిద్యాల నడుమ వాహనసేవ కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూరహారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.
1. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ఖజానాకు మరోసారి రికార్డు స్థాయిలో నిత్యాదాయం సమకూరింది. ఆదివారం నృసింహుడిని 60 వేల మందికిగా పైగా భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవటంతో రూ.1,16,13,977 ఆదాయం వచ్చిందని దేవస్థాన ఈవో గీతారెడ్డి తెలిపారు. దర్శన టికెట్ల నుంచి రూ.18.90 లక్షలు, ప్రసాదాల విక్రయం ద్వారా రూ.44.37 లక్షలు, కొండ పైకి వచ్చిన వాహనాల ద్వారా రూ.9.75 లక్షలు, తలనీలాల ద్వారా రూ.1.78 లక్షల ఆదాయం ఖజానాకు చేరాయని ఈవో వెల్లడించారు. ఒక్కరోజే రూ.కోటిపైగా ఆదాయం సమకూరటం ఆలయ చరిత్రలో ఇది రెండోసారి. గత ఆదివారం ఆలయ ఖజానాకు రూ.కోటికు పైగా నిత్యాదాయం సమకూరింది.
2. కాశీలో తమిళ సంగమం ఉత్సవాలు
కాశీలో నేటి నుంచి కాశీ-తమిళ సంగమం ఉత్సవాలు జరగనున్నాయి. తమిళనాడుకు చెందిన ద్రవిడ సంస్కృతి గురించి యూపీలో ప్రదర్శన చేయనున్నారు. తమిళ వంటకాలు అక్కడ గుమగుమలాడనున్నాయి. తమిళ సంగీతం కూడా కాశీలో మారుమోగనున్నది. కాశీ తమిళ సంగమం కోసం రామేశ్వరం నుంచి ప్రత్యేక రైలులో 216 మంది ఇవాళ వారణాసి చేరుకున్నారు. ఆ బృందానికి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ స్వాగతం పలికారు.రామేశ్వరం, కాశీ మధ్య విడదీయరాని బంధం ఉందని, రెండు ప్రాంతాల ప్రజలు తమ మధ్య సంస్కృతి, జ్ఞానాన్ని పంచుకోవచ్చు అని, ఇక్కడ ఉన్న పురాతన సంస్కృతిని నేర్చుకునేందుకు వచ్చినట్లు ఓ వ్యక్తి తెలిపారు. కాశీలో 30 రోజుల పాటు ద్రవిడ సంస్కృతి, సంప్రదాయాల గురించి వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.కాశీ తమిళ సంగమం ఈవెంట్‌లో పాల్గొనేందుకు సుమారు మూడు వేల మంది తమిళనాడు భక్తులు 12 బృందాలుగా కాశీ చేరుకోనున్నారు
3. శ్రీశైలం శ్రీమల్లికార్జున స్వామివారికి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తికమాసం, ఆదివారం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి పూజలు చేస్తున్నారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి.. ఆలయానికి ఎదురుగా ఉన్న గంగాధర మండపం, శివమాడ వీధుల్లో కార్తిక దీపాలు వెలిగిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పడుతున్నది.ఇక కార్తిక మాసోత్సవాల సందర్భంగా ఆలయంలో గర్భాలయం అభిషేకాలు, స్పర్శ దర్శనం తదితర సేవలను అధికారులు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. భక్తుల రద్దీ దృష్ట్యా స్వామి, అమ్మవార్ల అలంకార దర్శనానికి మాత్రమే భక్తులను అనుమతిస్తున్నారు.
4. శ్రీశైలం శ్రీమల్లికార్జున స్వామివారికి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తికమాసం, ఆదివారం కావడంతో భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి పూజలు చేస్తున్నారు. పాతాళగంగలో పుణ్యస్నానాలు ఆచరించి.. ఆలయానికి ఎదురుగా ఉన్న గంగాధర మండపం, శివమాడ వీధుల్లో కార్తిక దీపాలు వెలిగిస్తున్నారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో స్వామివారి దర్శనానికి 4 గంటల సమయం పడుతున్నది.
5. శ్రీశైలం ఉత్తర ముఖద్వారమైన ఉమామహేశ్వర క్షేత్రంలో భక్తులు ఈ శ్వరుడికి ఆదివారం కార్తీక పూజలు నిర్వహించారు. కా ర్తీక మాసం కావడంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి కర్ణాటక, హైదరాబాద్, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా, నల్గొండ వివిధ ప్రాంతా నుంచి శ్రీశైలం వెళ్లే భక్తులు ఉమామహేశ్వరుడ్ని దర్శించుకుని ప్రత్యేక పూ జలు చేశారు. కొండ దిగువన ఉన్న భోగమహేశ్వరం నుంచి మెట్ల మార్గం ద్వారా కాలినడకన కొండపైకి చే రుకుని మొక్కులు తీర్చుకున్నారు. దేవాదాయ శాఖ రెవెన్యూ డిప్యూటీ కలెక్టర్ రమాదేవి ఈశ్వరుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముందుగా ఆమెకు ఆలయ లాంఛనాలతో పూర్ణకుంభంతో ఆలయ ఈవో శ్రీనివాసరా వు, కమిటీ చైర్మన్ కందూరి సుధాకర్‌లు ఘనంగా స్వా గతం పలికారు. ముందుగా పాపనాశిని గుండంలో పు ణ్య స్నానాలు ఆచరించి ఈశ్వరుడికి క్షీరాభిషేకం, అమ్మ వారికి కుంకుమార్చన, గణపతి, అయ్యప్ప స్వాములకు ప్రత్యేక పూజలు చేశారు. ఆలయం ముందు ఉన్న ధ్వజ స్తంభం వద్ద మహిళలు కార్తీక దీపాలు వెలిగించారు. కార్తీక మాసం కావడంతో భక్తులు వ్రతాలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. దాదాపు 1000 మంది భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయా నికి వచ్చిన భక్తుల వాహనాలు దాదాపు రెండు కిలోమీ టర్ల మేర నిలిచిపోయాయి. వాహనాల రాకపోకలకు ఇ బ్బందులు ఏర్పడ్డాయి. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎ లాంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షించారు. అర్చ కుడు వీరయ్య భక్తులకు పూజలు చేయించి చరిత్ర గురించి వివరించారు.
6. రంగనాయక స్వామి ఆలయంలో కార్తీక మాస వన భోజన కార్యక్రమం సందర్భంగా 200 జంటలు పాల్గొని సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించారు. హైదరాబాద్ నుంచి 12 బస్సులలో యాత్రికులు శ్రీరంగాపురం చేరుకున్నారు. ఆలయ ప్రాంతాన్ని ఆలయంలో విగ్రహాలు చూసి సంబురపడ్డారు. ఈ కార్యక్రమంలో బాలాపూర్ ఆర్యవైశ్య సంఘం కార్యదర్శి రామచంద్రమూర్తి, కోశాధికారి సురేష్ గుప్తా, బడంగ్‌పేట్ ఆర్యవైశ్య సంఘం శ్రీనివాస్ గుప్తా, వెంకటేశ్వర్లు గుప్తా తదితరులు పాల్గొన్నారు.
7. సత్యదేవుడి సన్నిధిలో కార్తీకమాసంలో వ్రతం టిక్కెట్ల విక్రయాల ద్వారా రికార్డుస్థాయి ఆదాయం లభించింది. ఇంకా కార్తీకమా సం ముగియడానికి మూడురోజుల వ్యవధి ఉన్నా ఆదివారం నాటికి వ్రతం టిక్కె ట్ల ఆదాయం రూ.7కోట్లకు చేరినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు కార్తీకంలో వ్రతం టిక్కెట్ల విక్రయం ద్వారా సుమారు రూ.6.97కోట్లు ఆదా యం మాత్రమే లభించగా ఆదివారంనాటికి రూ.7కోట్లు లభించినట్టు అధికారులు పేర్కొన్నారు. వ్రతాల సంఖ్య ఈ ఏడాది రికార్డు అధిగమిస్తామని, ఆదివారం నా టికి వ్రతాల సంఖ్య 1,29,209కి చేరగా ఇంకా మూడురోజుల వ్యవధిలో ప్రస్తుతం ఉన్న రికార్డు 1,37,097 వ్రతాల రికార్డును బ్రేక్ అవుతుందని అంటున్నారు
8. కాశీ కి వెళితే…
కాయో పండో వదిలేయాలి అని పెద్దలు అంటారు…అందులో మర్మమేమిటి…?
అసలు శాస్త్రం లో
ఎక్కడ కూడా..
కాశీ కి వెళితే
కాయో, పండో వదిలేయాలి
అని చెప్పలేదు..
శాస్త్రం చెప్పిన విషయాన్ని..
కొందరు తెలిసీ తెలియని విషయ పరిజ్ఞానం తో కొంచం వాళ్లకు అనుకూలంగా మార్చు కున్నారు.
కాశీ క్షేత్రం విషయంలో శాస్త్రము చెప్తున్నది ఏమిటి అంటే…
కాశీ వెళ్లి గంగ లో స్నానం చేసి
“కాయా పేక్ష మరియు ఫలా పేక్ష” ను
గంగలో వదిలి,
ఆ విశ్వనాథ దర్శనం చేసుకొని ఎవరి ఇళ్ళకు వాళ్ళు తిరిగి వెళ్ళాలి అని.
ఇక్కడ…
కాయాపేక్షా,
ఫలాపేక్ష
అన్నారు…
అంటే…
ఈ కాయము పై
(శరీరము పై అపేక్షని ) ,
ఫలా పేక్షా
(కర్మ ఫలము పై అపేక్ష ని)
పూర్తిగా వదులు కొని…
కేవలం నిజమైన భక్తితో ఆ ఈశ్వర చింతన కలిగి ఉండమని పెద్దలు చెప్పారు.
కాలక్రమేణా…
అది కాస్తా
కాయ, పండు
గా మారి పోయింది.
అంతే కానీ…
కాశీ వెళ్లి ఇష్టమైన
కాయ గూరలు,
తిండి పదార్థాలు
గంగ లో వదిలేస్తే…
మనకు వచ్చు భక్తి కానీ,
అందులో నిజమైన
పుణ్యం ఎం ఉంటుంది.
కనుక…
శాస్త్రం నిజంగా
ఎలా చెప్తుందో
అర్థం చేసుకొని…
ఆ క్షేత్ర దర్శనము,
ఆ సంప్రదాయం పాటిస్తే..
నిజమైన ఆధ్యాత్మిక చైతన్యం వస్తుంది…
అంతే కాని
మామిడి పండుని, వంకాయ ని గంగలో వదిలేస్తే వచ్చే ఉపయోగం ఏమి ఉండదు.
కనుక…
ఈసారి మీరు కాశీ వెళితే…
మనకి శత్రువులు అయిన
ఈ శరీరం పై
ఎక్కువ ప్రేమని,
మనం చేసే కర్మల మీద లేనిపోని కర్మఫలం అపేక్ష ని మాత్రమే వదులుకొని…
ఆ విశ్వనాథ దర్శనం చేసి,
నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం కలగాలి అని ప్రార్దిదాం