135 ఏళ్లనాటి ఓ విస్కీ సీసా (Whisky Bottle), అందులోని లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. స్కాట్లాండ్‌కు (Scotland) చెందిన పీటర్ అనే వ్యక్తి ఇంట్లో మరమ్మత్తు చేస్తుండగా.. ఓ లేఖ ఉన్న విస్కీ బాటిల్ బయటపడింది. ఆ లేఖను బయటకు తీసి చదవగా.. 1887 అక్టోబర్ 6న జేమ్స్, జాన్ గ్రీవ్‌లు రాసిన లేటర్‌గా తెలిసింది. అందులోని సందేశం కూడా షాకింగ్‌గా ఉంది. దాంతో ఇప్పుడు ఈ లేఖ తాలూకు వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.. పీటర్ అలెన్ అనే 50ఏళ్ల వ్యక్తి ఎడిన్‌బర్గ్ ప్రాంతంలోని ఓ ఇంటిలో ప్లంబర్ పనిచేస్తున్నాడు. దానిలో భాగంగా పైపులైన్ గుర్తించేందుకు తవ్వకాలు జరిపాడు. అలా తవ్వుతుండగా.. విస్కీ సీసా ఒకటి బయటడింది. అందులో ఓ లేఖ ఉన్నట్లు గుర్తించాడు. వెంటనే ఆ సీసాను యాజమాని ఎలిద్ స్టింప్సన్ వద్దకు తీసుకెళ్లాడు. ఆమె ఆ బాటిల్‌ను తెరిచేందుకు ప్రయత్నించింది. కానీ ఎంతకు సాధ్యపడలేదు. దాంతో ఆ సీసాను పగులగొట్టి అందులో ఉన్న లేఖను బయటకు తీసి చదివింది.
దీంతో ఆ లేఖ 1887 అక్టోబర్ 6వ తేదీన రాసినదిగా ఆమె గుర్తించింది. జేమ్స్ రిట్చీ, జాన్ గ్రీన్ అనే ఇద్దరు వ్యక్తుల పేరుతో ఆ లేఖపై సంతకాలు ఉన్నాయి. అలాగే ఆ లేఖలో ఇలా వ్రాసి ఉంది.. “జేమ్స్ రిట్చీ మరియు జాన్ గ్రీవ్ ఈ అంతస్తును వేశారు. కానీ వారు విస్కీని తాగలేదు. ఎవరైనా ఈ బాటిల్‌ను కనుగొంటే మన దుమ్ము రోడ్డుపై ఎగిరిపోతోందని అనుకోవచ్చు” అని ఉంది. ఆ తర్వాత ఎలిద్ స్టింప్సన్ ఆ బాటిల్‌తో పాటు అందులోని లేఖను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అంతే.. ఆ పురాతన కాలంనాటి ఇప్పుడు లేఖ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.