తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో నాలుగో రోజు బుధవారం అమ్మవారు రాజమన్నార్ అలంకారంలో చర్నాకోలు, దండం ధరించి కల్పవృక్ష వాహనంపై భక్తులను కటాక్షించారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు ఆలయ నాలుగు మాడ వీధుల్లో భక్తులకు అభయమిచ్చారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకు వాహనసేవ సాగింది.అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారికి మొక్కులు చెల్లించారు. మధ్యాహ్నం 12.30 గంటల నుంచి శ్రీకృష్ణస్వామి మండపంలో అమ్మవారికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. పసుపు, చందనం, పాలు, పెరుగు, తేనె, పన్నీరు, వివిధ రకాల ఫలాలతో అభిషేకం జరిపారు. అనంతరం అమ్మవారికి విశేషంగా అలంకారం చేశారు. సాయంత్రం 5.30 నుంచి 6 గంటల వరకు ఊంజల్‌సేవ జరగనుంది.అలాగే రాత్రి 7 నుంచి 9 గంటల వరకు పద్మావతి అమ్మవారు హనుమంత వాహనంపై భక్తులను కటాక్షించనున్నారు. వాహనసేవల్లో పెద్ద జీయ్యంగార్, చిన్న జీయ్యంగార్, ఈవో ఏవీ ధర్మారెడ్డి దంపతులు, చంద్రగిరి ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దంపతులు, జేఈవో వీరబ్రహ్మం దంపతులు, ఆలయ డెప్యూటీ ఈవో లోకనాథం, ఆగమ సలహాదారులు శ్రీనివాసచార్యులు, విఎస్వోలు మనోహర్, బాలిరెడ్డి, ఏఈవో ప్రభాకర్ రెడ్డి, ఆలయ అర్చకులు బాబు స్వామి, సూపరిండెంట్ మధు, ఆర్జితం ఇన్స్పెక్టర్ దాము పాల్గొన్నారు.
1. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కొండపై ఉన్న 29 కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి. వీరికి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. నిన్న స్వామివారిని 70,163 మంది భక్తులు స్వామివారిని దర్శించుకోగా 31,489 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 5.22 కోట్లు వచ్చిందని వివరించారు.
2. అయ్యప్ప భక్తులకు శుభవార్త
అయ్యప్ప స్వామి భక్తులకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్-బీసీఏఎస్ శుభవార్త చెప్పింది. విమాన ప్రయాణం చేసే అయ్యప్ప భక్తులకు వెసులుబాటు కల్పించింది. అయ్యప్ప స్వామి భక్తులకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్-బీసీఏఎస్ శుభవార్త చెప్పింది. విమాన ప్రయాణం చేసే అయ్యప్ప భక్తులకు వెసులుబాటు కల్పించింది. విమాన ప్రయాణం చేసే అయ్యప్ప భక్తులు ఇకపై ఇరుముడిని క్యాబిన్ లగేజీలో తీసుకువెళ్లేందుకు అనుమతించింది. అన్ని తనిఖీల తర్వాత… అయ్యప్ప భక్తులు తీసుకెళ్లే ఇరుముడిని క్యాబిన్లోకి అనుమతించాలని అన్ని విమానాశ్రయాల సెక్యురిటీ సిబ్బందికి బీసీఏఎస్ మార్గదర్శకాలు ఇచ్చింది. వచ్చే ఏడాది జనవరి 20 వరకూ విమానాల్లో శబరిమల వెళ్లే భక్తులకు వెసులుబాటు కల్పిస్తూ… ఉత్తర్వులు జారీ చేసింది. మండలం, మకరజ్యోతి దీక్షలు పూర్తయ్యే వరకూ అవకాశం కల్పిస్తూ… బీసీఏఎస్ డైరక్టర్ జనరల్ ఉత్తర్వులు ఇచ్చారు
3. తిరుచానూరు శ్రీ మహాలక్ష్మి తాయార్ హంస వాహన వైభవం
తిరుచానూరు శ్రీ అలమేలు మంగ తాయార్ కార్తీక బ్రహ్మోత్సవాలు లో హంస వాహనం మీద అలమేలు మంగ నాంచియార్ నీ దర్శనం .హంస లో గొప్ప గుణం ఉంది పాలను ,నీరును వేరు చేస్తుంది అలానే మనం కూడా మంచిని మాత్రమే గ్రహించి చెడు నీ విడవాలి అని మనకు హంస వాహనం పైన అలమేలు మంగమ్మ దర్శనం ఇస్తున్నారు వీణ నాంచియార్ విద్యా లక్ష్మి గా అలమేలు మంగమ్మ తల్లి దర్శన భాగ్యం ఇస్తున్నారు
4. అయ్యప్ప దర్శన వేళలు మార్పు
కొవిడ్ కారణంగా గత రెండేళ్లుగా పరిమిత స్లాట్లతో భక్తులను అయ్యప్ప దర్శనానికి అనుమతించిన ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డ్ (టీడీబీ) అధికారులు ఈ సీజన్ (మండల పూజ, మకరవిళక్కు)కు ఆ నిబంధనలను సడలించారు. గతంలో తెల్లవారు జామున 3 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి అర్ధరాత్రి వరకు దర్శనాలను అనుమతించేవారు. రద్దీ నేపథ్యంలో సాయంత్రం దర్శనాలను మధ్యాహ్నం 3 గంటల నుంచి అనుమతిస్తారు.
5. విమానాల్లో ఇరుముడికి అనుమతి
అయ్యప్ప భక్తులకు శుభవార్త! మండల దీక్షను పూర్తిచేసుకుని, ఇరుముడితో శబరిమలకు వెళ్లే భక్తులకు విమానాశ్రయాల్లో సెక్యూరిటీ తనిఖీల వద్ద ఎదురవుతున్న ఇబ్బందులకు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (బీసీఏఎస్) పరిష్కారాన్ని చూపింది. ఈ మేరకు బీసీఏఎస్ డైరెక్టర్ జనరల్ జుల్ఫికర్ హసన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. గత నెలలో జారీ చేసిన నిషేధాజ్ఞల జాబితాలో కొబ్బరికాయలను కూడా చేర్చారు. దీంతో ఇరుముడిలో నెయ్యి నింపిన టెంకాయలను తీసుకువెళ్లేందుకు సెక్యూరిటీ ఇబ్బందులు ఎదురయ్యేవి. టెంకాయను తీసేయాలని సీఐఎ్‌సఎఫ్ అధికారులు తేల్చిచెప్పడంతో భక్తులు మనస్తాపం చెందారు. ఈ విషయంపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ), ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ), పౌర విమానయాన శాఖకు భక్తుల నుంచి ఫిర్యాదుల పరంపర కొనసాగింది. ఈ నేపథ్యంలో బీసీఏఎస్ డీజీ ఇరుముడిని క్యాబిన్లోకి అనుమతిస్తూ సడలింపులిచ్చారు. ఈ ఉత్తర్వులు మకర విళక్కు సీజన్ (జనవరి 20) వరకు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు. కాగా, భక్తుల ఇబ్బందులను కాకినాడకు చెందిన బీజేపీ నేత బెంగళూరు ఎయిర్‌పోర్టు సీఈవోకు తెలియజేయడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం.