NRI-NRT

‘థ్యాంక్స్ గివింగ్ బ్యాక్’కు చక్కటి స్పందన

Auto Draft

‘భాషే రమ్యం.. సేవే గమ్యం’ నినాదంతో ముందుకు వెళ్తున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం (నాట్స్) తాజాగా చికాగోలో నిర్వహించిన థ్యాంక్స్ గివింగ్ బ్యాక్ కార్యక్రమానికి చక్కటి స్పందన లభించింది. చికాగో నాట్స్ విభాగం చేపట్టిన ఈ కార్యక్రమంలో దాదాపు 100 మంది విద్యార్థులు ‘మేముసైతం సమాజ హితం కోసం’ అంటూ ముందుకొచ్చారు. థ్యాంక్స్ గివింగ్ బ్యాక్ ద్వారా దస్తులు, బూట్లు సేకరించారు. ఇలా సేకరించిన వాటిని చికాగో శివారులోని అరోరాలో ఉన్న హెస్డ్ హౌస్ హోమ్ లెస్ షెల్టర్‌కు అందించారు.

చికాగో నాట్స్ నాయకులు శ్రీహరీశ్ జమ్ము, నరేంద్ర కడియాల, వీర తక్కెళ్లపాటి ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషించారు. నాట్స్ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు మూర్తి కొప్పాక, శ్రీనివాస్ అరసాడ, శ్రీనివాస్ బొప్పన, రవి శ్రీకాకుళం ఈ కార్యక్రమానికి అలాగే చికాగో నాయకులకు దిశా నిర్దేశం చేశారు. వీరితో పాటు నాట్స్ ఈసీ సభ్యులు మదన్ పాములపాటి వైస్ ప్రెసిడెంట్(సర్వీసెస్), కృష్ణ నిమ్మలగడ్డ, లక్ష్మి బొజ్జ, బిందు వీధులముడి, రోజా శీలంశెట్టి, భారతీ పుట్టా తదితరులు తమ వంతు సహకారం అందించారు.