ముంబయి బొద్దుగుమ్మ హన్సిక ఇంట పెళ్లి సందడి షురూ అయ్యింది. ప్రియుడు, తన చిన్ననాటి స్నేహితుడు సోహైల్‌ను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల హన్సిక ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా నటి ఇంట పెళ్లి వేడుకలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ముంబయిలోని హన్సిక నివాసంలో మగళవారం ‘మాతా కీ చౌకీ’ (గౌరీ పూజ) కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. కుటుంబ సభ్యుల సమక్షంలో హన్సిక-సోహైల్ ఈ పూజలో పాల్గొన్నారు. ఈ వేడుకల్లో వధూవరులిద్దరూ సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.