Movies

విశ్వనాథ్‌ను కలిసిన కమల్ హాసన్‌

విశ్వనాథ్‌ను కలిసిన కమల్ హాసన్‌

ఈ ఏడాది విక్రమ్‌ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు విలక్షణ నటుడు కమల్‌హాసన్ (Kamal Haasan)‌. ఎప్పుడూ బిజీ షెడ్యూల్‌తో ఉండే కమల్ హాసన్‌ ఇవాళ లెజెండరీ డైరెక్టర్, కళాతపస్వి కే విశ్వనాథ్‌ (K Viswanath)ను హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిశారు. కమల్ హాసన్ వీల్‌ఛైర్‌లో ఉన్న కే విశ్వనాథ్‌ చేయి పట్టుకుని ఆత్మీయంగా పలుకరిస్తున్న ఫొటో ఇపుడు నెట్టింట్లో ట్రెండింగ్‌ అవుతోంది.

కే విశ్వనాథ్‌, కమల్‌హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన సాగర సంగమం, స్వాతిముత్యం, శుభసంకల్పం చిత్రాలు తెలుగు సినీ పరిశ్రమలో మరుపురాని ఆణిముత్యాల జాబితా టాప్‌లో ఉంటాయి. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో మరో సూపర్‌హిట్‌ సినిమా రావాలని.. అందుకు ఇద్దరూ సహకరించాలంటూ..ఫొటో చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

స్టార్ యాక్టర్ కమల్‌హాసన్ ప్రస్తుతం (Indian 2)లో నటిస్తున్నాడు. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్‌ 2 కొత్త షెడ్యూల్ వచ్చే నెలలో షురూ కానుంది. భారతీయుడు చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న ఇండియన్ 2లో కాజల్ అగర్వాల్‌, రకుల్ ప్రీత్‌సింగ్ సిద్దార్థ్‌, బాబీ సింహా, సముద్రఖని కీలక పాత్రలు పోషిస్తున్నారు.