DailyDose

TNI నేటి నేర వార్తలు

TNI  నేటి నేర వార్తలు

* దేశ రాజధాని న్యూఢిల్లీలో దారుణం చోటుచేసుకున్నది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురిని ఓ యువకుడు దారుణంగా హత్యచేశాడు. బుధవారం తెల్లవారుజామున ఢిల్లీలోని పాలమ్‌ ప్రాంతానికి చెందిన యువకుడు.. తన తండ్రి, ఇద్దరు సోదరీమణులు, నానమ్మను విచక్షణరహితంగా కొట్టి చంపేశాడు. రక్తపు మడుగులో పడిఉన్న వారిని చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
*ఓ భవనంపై విమానం కుప్పకూలింది.ఈ ఘటనలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పొయారు. ఈ ప్రమాదం కొలంబియా దేశంలోని రెండో అతిపెద్ద నగరం మెడెలిన్ లో చోటు చేసుకుంది. ఒలాయా హెర్రెరా విమానాశ్రయం నుంచి ఆరుగురు ప్రయాణికులు, ఇద్దరు సిబ్బందితో బయలుదేరింది ఈ విమానం.. ఇంజిన్‌ వైఫల్యంతో ఓ భవనంపై కుప్పకూలినట్లు అక్కడి అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందినట్లు మెడెలిన్ మేయర్ డేనియల్ క్వింటెరో చెప్పారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పివేశారు.
*ఆదిలాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం పెన్‌గంగ శివారులోని గొల్లగఢ్‌, తాంసి (కే) అటవీప్రాంతంలో పశువుల మందలపై పులులు దాడి చేశాయి. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో తాంసి(కే) అడవిలో పశువులు మేత మేస్తుండగా, ఒక్కసారిగా రెండు పులులు దాడి చేశాయి. అన్నెల స్వామికి చెందిన ఎద్దు ఈ దాడిలో మృతి చెందింది. ఆ పక్కన ఉన్న ఆవుల మందపైనా పులులుపంజా విసరడంతో మడావి శంకర్‌కు చెందిన రెండు ఆవు దూడలు చనిపోయాయి.
*ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో మంగళవారం ఓ కారు బ్యాలెన్స్ తప్పి లోయలో పడిపోవడంతో ఐదుగురు కార్మికులు మరణించారు. లఖింపూర్ ఖేరీ జిల్లాలో 11 మంది కూలీలతో వెళుతున్న జైలో కారులోయలో పడటంతో ఐదుగురు కార్మికులు మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు.షాజహాన్‌పూర్ నుంచి 11 మంది కూలీలతో వెళుతున్న జైలో కారు పాలియా పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే క్రాసింగ్ సమీపంలో బ్యాలెన్స్ తప్పి లోయలోకి బోల్తా పడింది.క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
*హైద‌రాబాద్ న‌గ‌రానికి చెందిన ఓ వ్య‌క్తి ఇంట్లో బంగారం భారీగా మాయ‌మైంది. ప‌ని మ‌నిషే బంగారం దొంగిలించిన‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది. ఆమె నుంచి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.
*ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్‌ ఖేరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఐదుగురు దుర్మరణం పాలవగా.. మరో ఏడుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని.. క్షతగాత్రులను ఆసుప్రతికి తరలించారు. లఖింపూర్‌ ఖేరిలోని పాలియా తహసీల్‌ ప్రాంతంలోని భీరామార్గ్‌లో రోడ్డు పక్కనే ఉన్న గుంత వద్ద ఎస్‌యూవీ బోల్తాపడింది.
*కొలంబియా దేశంలోని నివాస ముదాయంలో ఓ విమానం కుప్పకూలింది. కొలంబియాలోని రెండో అతిపెద్ద నగరం మెడెలిన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు
*బాపట్ల….కొరిశపాడు బస్సులో ప్రయాణిస్తున్న వ్యక్తి మృతి.మృతుడు వద్ద. కోటి రూపాయల విలువగల వజ్రాలు లభ్యం.మృతుడు పవన్ కుమార్ చిత్తూరు జిల్లా కు చెందిన వ్యక్తి గా గుర్తింపు.మృతుడి పవన్ గుంటూరు కి చెందిన బంగారం షాపులో పని చేస్తున్న ట్లు విచారణలో వెల్ల.బంగారం షాపు యజమాని కి వజ్రాలు అప్పగించిన పోలీసులు.
*తిరుపతిలో దారుణం… రోడ్డుపైనే శిశువుకు జన్మనిచ్చిన గర్భిణివైద్యమో నారాయణ అంటున్న తిరుపతి ప్రజలు తిరుపతిలో ప్రభుత్వ వైద్యంలో పూర్తిగా విఫలం అంటున్న స్థానికులుస్పందించని ఆరోగ్య శాఖ మంత్రి, ఇప్పటి వరకు ఎప్పుడు తనిఖీలు నిర్వహించలేదుప్రైవేట్ హాస్పిటల్స్ మాఫియా అయితే దారుణం ఆస్పత్రిలో చేర్చుకొని యాజమాన్యంఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటున్న స్థానికులు.ఓ మహిళ నడిరోడ్డుపై శిశువుకు జన్మనిచ్చిన ఘటన తిరుపతి ప్రసూతి ఆసుపత్రికి కూతవేటు దూరంలో చోటుచేసుకుంది. అక్కడే ఉన్న స్థానికులు ఎటువంటి అపాయం కలుగకుండా ప్రసవించేలా సహాయం చేశారు. రోడ్డుపై బెడ్ షీట్‌ చాటున గర్భిణి ప్రసవించింది. గర్భవతికి తోడుగా అటెండర్ లేకపోవడంతో ఆస్పత్రిలో చేర్చుకోలేదు యాజమాన్యం. అయితే రూల్స్ ప్రకారం అటెండర్ లేకుండా ఆసుపత్రిలో అడ్మిట్ చేసుకోకూడదనే నిబంధనలు ఉన్నట్లు యాజమాన్యం చెబుతోంది. దీంతో ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలంటూ స్థానికులు డిమాండ్ చేస్తున్నారు
*శ్రీసత్యసాయి జిల్లా నల్లమాడ మండలం గోపేపల్లికి చెందిన రైతు ఎం.రామచంద్రప్ప సర్వే రిపోర్టు మరియు స్కెచ్ కోసం అప్పటి డిప్యూటీ సర్వేయర్ గొర్ల వెంకటేశ్వర్లును సంప్రదించారు. అయితే ఆయన డబ్బు డిమాండ్ చేయడంతో 04-08-2015 న లంచంగా రూ. 10 వేలు ఇస్తుండగా అనంతపురం ఏసిబి అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీనిపై అనంతపురం ఏసిబి అధికారులు Cr.No.05/RCT-ATP/2015 కేసు నమోదు చేశారు. అనంతరం ఏసిబి అధికారులు ఛార్జ్ షీట్ ఫైల్ చేసి కర్నూల్ A.C.B ప్రత్యేక కోర్టుకు దాఖలు చేశారు. విచారణ పూర్తి చేసి నేరం రుజువు అయినందున డిప్యూటీ సర్వేయర్ గొర్ల వెంకటేశ్వర్లును దోషిగా నిర్ధారించి అతనికి 2 సంవత్సరాల జైలు శిక్ష, రూ 45 వేలు జరిమానా విధిస్తూ ఈరోజు తీర్పు చెప్పారు. ప్రస్తుతం గొర్ల వెంకటేశ్వర్లు శ్రీ సత్య సాయి జిల్లా, బత్తలపల్లి మండల డిప్యూటీ సర్వేయర్ గా పనిచేస్తున్నారు.
*ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీ చేస్తున్న 11మంది నేతలపై ఆ పార్టీ అధిష్ఠానవర్గం సస్పెన్షన్ వేటు విధించింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో(Delhi Civic Body Polls) బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అధ్యక్షతన నేతల సమావేశం అనంతరం బీజేపీ తిరుగుబాటు అభ్యర్థులను(Rebel Candidates) పార్టీ నుంచి బహిష్కరించింది.(BJP Expels) నగర పేదల కోసం మురికివాడల పునరావాస ప్రాజెక్టు, మోదీ విజయాల గురించి ఎన్నికల్లో ఓటర్లకు చెప్పాలని జేపీనడ్డా బీజేపీ నేతలకు సూచించారు.బీజేపీ తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీల ఉన్న లవలేష్ శర్మ, రీను జైన్, రాజ్ కుమార్ ఖురానా, ధరమ్ వీర్ సింగ్ తదితరులపై బీజేపీ ప్రాథమిక సభ్యత్వం నుంచి ఆరేళ్లపాటు సస్పెండ్ చేసింది.
*ఏలూరు జిల్లా కేంద్రంలోని ధనా బ్యాంక్‌ 2002లో డిపాజిటర్లను మోసం చేసి మూడు కోట్ల మేర కుచ్చటోపీ పెట్టింది. అప్పట్లో సంచలనం రేపిన ఈ ఉదంతంపై 2007లో ధనా బ్యాంక్‌ చైర్మన్‌ సహా 27 మంది సభ్యులపై కేసు దాఖలైంది. ఇన్ని సంవత్సరాల తరువాత ముద్దాయిలకు పదేళ్ల జైలు శిక్ష, జరిమానా విధిస్తూ ఏలూరు ప్రిన్సిపల్‌ డిస్ట్రిక్ట్‌ సెషన్స్‌ జడ్జి చింతలపూడి పురుషోత్తమకుమార్‌ తీర్పు వెల్లడించారు. ఈ కేసుకు సంబంధించి 27 మందిలో ఐదుగురు చనిపోగా కీలక నిందితుడు బ్యాంక్‌ చైర్మన్‌ పరారీలో ఉన్నాడు. 2013 నుంచి నేటి వరకు విచారణ సాగించారు. ప్రత్యేక పీపీ లాల్‌ అజయ్‌ ప్రేమ్‌కుమార్‌ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టి వాదనలు వినిపించారు. నిందితులపై నేరం రుజువు కావడంతో 21 మంది ముద్దాయిలకు పదేళ్ల శిక్ష విధించి కొందరికి 10 వేలు, మరికొంత మందికి ఐదు వేల చొప్పున జరిమానా విధించారు. కాగా, పేదలను మోసం చేసే బ్యాం కులు భయపడే విధంగా న్యాయమూర్తి తీర్పు ఇచ్చారని ఏపీ డైరెక్టర్‌ ఆఫ్‌ ప్రాసిక్యూషన్‌ జేడీ లాల్‌ అజయ్‌ ప్రేమ్‌కుమార్‌ అన్నారు.
* భాజా భ‌జంత్రీలు మోగాల్సిన ఆ ఇంట్లో చావు డ‌ప్పు మోగింది. నిన్న‌టి వ‌ర‌కు పెళ్లి ప‌నులు చ‌క‌చ‌కా ముందుకు కొన‌సాగాయి. కానీ చిన్నారి మృతితో పెళ్లి ప‌నులు ఆగిపోయాయి. కుటుంబ స‌భ్యులంద‌రూ విషాదంలో మునిగిపోయారు.
* ఒక యువకుడు కరోనాతో చనిపోయాడు. అయితే చికిత్స అందించడంలో వైద్యుల నిర్లక్ష్యం వల్ల అతడు మరణించినట్లు యువకుడి కుటుంబం ఆరోపించింది. ఈ నేపథ్యంలో ప్రైవేట్‌ ఆసుపత్రికి చెందిన ఐదుగురు వైద్యులపై కేసు నమోదైంది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన నోయిడాలో ఈ సంఘటన జరిగింది. 2021లో దేశాన్ని వణికించిన కరోనా సెకండ్‌ వేవ్‌లో ఘజియాబాద్‌కు చెందిన 20 ఏళ్ల యువకుడు కరోనా బారిన పడ్డాడు. కుటుంబ సభ్యులు అతడ్ని నోయిడాలోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో అడ్మిట్‌ చేశారు. నెలన్నర రోజుల తర్వాత ఆసుపత్రి చికిత్సా విధానంపై అసంతృప్తితో ఢిల్లీలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆ యువకుడు చనిపోయాడు.
*చైనా(China) దేశంలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. చైనాలోని సెంట్రల్ హెనాన్ ప్రావిన్స్‌లోని అన్యాంగ్ నగరంలో సోమవారం సాయంత్రం ఫ్యాక్టరీలో(Factory) జరిగిన అగ్ని ప్రమాదంలో(Fire) 36 మంది మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. గాయపడిన వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. వెన్‌ఫెంగ్ జిల్లాలోని అన్యాంగ్ సిటీలోని కైక్సిండా ట్రేడింగ్ కో లిమిటెడ్ హైటెక్ జోన్ లో మంటలు చెలరేగాయి.ఈ అగ్నిప్రమాదంలో చిక్కుకున్న వారిలో ఇద్దరు గల్లంతు అయ్యారు. ఈ ఘోర అగ్నిప్రమాదానికి కారణాలు తెలియరాలేదు. 200 మంది సహాయకులు, 60 అగ్నిమాపక వాహనాలు(Firefighters) రంగంలోకి దిగి మంటలను ఆర్పుతున్నాయి.
* అతనో పోలీసు కానిస్టేబుల్‌..! హైదరాబాద్‌ పోలీసు విభాగంలోని పలు ఠాణాల్లో పనిచేశాడు..! కీలకమైన ఎస్సార్‌నగర్‌, గాంధీనగర్‌ పోలీ్‌సస్టేషన్లలో సుదీర్ఘంగా పనిచేసి.. ప్రస్తుతం పశ్చిమ మండలం టాస్క్‌ఫోర్స్‌కు అనుబంధంగా పనిచేస్తున్నాడు..! వృత్తి రీత్యా పోలీసే అయినా.. ప్రవృత్తి మాత్రం దొంగతనాలే..! కరడుగట్టిన స్టూవర్టుపురం ముఠాలో భాగంగా దొంగతనాలు చేయడం ఇతని నేరశైలి. నల్లగొండ పోలీసులు ఇటీవల ఓ దొంగల ముఠాను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఆ ముఠాలో ఈ దొంగపోలీసు పాత్రను చూసి.. దర్యాప్తు అధికారులు ముక్కున వేలేసుకున్నట్లు సమాచారం. కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నా.. దొంగతనాలతో కోట్ల రూపాయల ఆస్తులను కూడబెట్టినట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ కానిస్టేబుల్‌ చలువతో మరికొందరు పోలీసులు కూడా ఆస్తులను భారీగా కూడబెట్టినట్లు సమాచారం.
* శ్రద్ధావాకర్‌ దారుణ హత్య ఘటన మరువక ముందే, ఇదే తరహా మరో కిరాతక ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆజంగఢ్‌ జిల్లాలో జరిగింది. మాజీ ప్రియురాలిని ఓ యువకుడు గొడ్డలితో దారుణంగా చంపి శరీర భాగాలను చెరువు, బావి, వ్యవసాయ క్షేత్రంలో విసిరేశాడు. మృతురాలి శరీర భాగాలను సేకరించిన పోలీసులు ప్రధాన నిందితుడిని అరెస్టు చేశారు. మరో ఎనిమిది మంది కోసం గాలిస్తున్నారు. ఎస్పీ అనురాగ్‌ ఆర్య ప్రకారం.. ఆజంగఢ్‌ జిల్లా అహ్రౌలా పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని పశ్చిమ్‌ పట్టికి చెందిన అనురాధ ప్రజాపతి, ప్రిన్స్‌ యాదవ్‌ ప్రేమించుకున్నారు. రెండేండ్ల క్రితం విడిపోయారు. ప్రిన్స్‌ యాదవ్‌ విదేశాలకు వెళ్లగా.. గత ఫిబ్రవరిలో అనురాధకు వివాహం జరిగింది. ఇటీవల ఇండియాకు తిరిగి వచ్చిన ప్రిన్స్‌యాదవ్‌ అమెను కలిశాడు. వివాహం రద్దు చేసుకొని తనతో వచ్చేయాలని భయపెట్టాడు. ఆమె యాదవ్‌తో వచ్చేందుకు నిరాకరించింది. దీంతో అనురాధను అంతమొందించాలని యాదవ్‌ కుట్ర చేశాడు. దేవాలయం వద్ద కలుసుకొందామని ఈ నెల 10న అనురాధను బయటకు పిలిపించాడు. తన వ్యవసాయ క్షేత్రానికి తీసుకెళ్లి గొంతు కోసి చంపేశాడు. శరీరాన్ని గొడ్డలితో ముక్కలుగా నరికాడు. తలను చెరువులో పడేశాడు. దుస్తులు, కొన్ని శరీర భాగాలను బావిలో, ఇతర ప్రదేశాల్లో విసిరేశాడు. యువతి తల్లిదండ్రులు స్థానిక ఠాణాలో మిస్సింగ్‌ కేసు పెట్టగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ నెల 15న శరీర భాగాలను గుర్తించారు. 19న నిందితుడు ప్రిన్స్‌యాదవ్‌ను అరెస్టు చేసి విచారించగా, నేరం అంగీకరించాడు. ఘటనా స్థలానికి నిందితుడిని తీసుకెళ్లగా, తప్పించుకొనే ప్రయత్నం చేయగా.. పోలీసులు కుడి కాలుపై కాల్చారు. కేసు దర్యాప్తు కొనసాగుతున్నది.
* ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు మృతి చెందారు. ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావుపై కత్తులతో గుత్తి కోయలు దాడికి పాల్పడ్డారు. ప్లాంటేషన్ మొక్కలను నరుకుతుండగా అదికారులు అడ్డుకోవడంతో వారు దాడికి పాల్పడ్డారు. గుత్తికోయల దాడిలో శ్రీనివాసరావుకు తీవ్రగాయాలయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఫారెస్ట్ రేంజర్ శ్రీనివాసరావు మృతి చెందారు. జిల్లాలోని చండ్రుగొండ మండలం బెండలపాడు అటవీప్రాంతంలో ఘటన చోటుచేసుకుంది.
*అల్లూరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతూరు వద్ద జరిగిన ప్రమాదంలో ఆరుగురి మృతిచెందారు. చింతూరు మండలం బొద్దుగూడెం వద్ద జాతీయ రహదారిపై మినీ వ్యాన్‌ను లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో వ్యాన్‌లో ప్రయాణిస్తున్న ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రానికి చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.
*ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ జిల్లాలో మంగళవారం ఓ కారు బ్యాలెన్స్ తప్పి లోయలో పడిపోవడంతో ఐదుగురు కార్మికులు మరణించారు.లఖింపూర్ ఖేరీ జిల్లాలో 11 మంది కూలీలతో వెళుతున్న జైలో కారు (Car)లోయలో పడటంతో ఐదుగురు కార్మికులు మృతి చెందగా, మరో ఏడుగురు గాయపడ్డారు.షాజహాన్‌పూర్ నుంచి 11 మంది కూలీలతో వెళుతున్న జైలో కారు పాలియా పోలీస్ స్టేషన్ పరిధిలోని రైల్వే క్రాసింగ్ సమీపంలో బ్యాలెన్స్ తప్పి లోయలోకి బోల్తా పడింది.క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
* ప్రేమించిన వ్యక్తితో తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించడంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ఎస్‌ఆర్‌ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఎస్‌ఐ ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం ఇందిరానగర్‌కు చెందిన హేమలత(19) ఇంటర్‌ పూర్తి చేసి ఇంట్లో ఉంటోంది. సూర్యాపేట జిల్లాకు చెందిన వరుణ్‌తో రెండు నెలల క్రితం ఫోన్‌లో పరిచయం కాగా, రోజూ వాట్సా్‌పలో చాటింగ్‌ చేసుకుంటున్నారు. అది కాస్తా ప్రేమగా మారింది. ఈ విషయం ఇంట్లో పెద్దలకు తెలియడంతో పది రోజుల క్రితం ఇద్దరి తరఫు వారు మాట్లాడుకుని పెళ్లికి నిర్ణయం తీసుకున్నారు. అయితే వరుణ్‌ పనిపాట లేకుండా జులాయిగా తిరుగుతున్నాడని తెలుసుకున్న యువతి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. దాంతో మనస్తాపం చెందిన హేమలత సోమవారం 12.30 గంటల సమయంలో చీరతో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. తల్లి నాగలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.