Movies

ప్రియురాలి కోసం వందకోట్లు

Auto Draft

లేటు వయసులో ఘాటు ప్రేమాయణంలో మునిగి తేలుతున్నారు బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు హృతిక్‌ రోషన్‌. ఎనిమిదేళ్ల క్రితం సుజేన్‌ ఖాన్‌ నుంచి విడాకుల తీసుకున్న ఆయన కొంతకాలం సోలోగానే జీవితాన్ని సాగించారు. రెండేళ్ల నుంచి సింగర్‌ సబా ఆజాద్‌తో ప్రేమలో ఉన్నారని బాలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. ముంబయిలో జరిగే సినిమా వేడుకలు, పార్టీల్లో ఈ జంట సందడి చేస్తూ కనిపిస్తున్నారు. రహస్యంగా విదేశాల్లో కూడా షికార్లు చేస్తున్నారని వారి సన్నిహితులు చెబుతున్నారు. తాజాగా ప్రియురాలి కోసం ఏకంగా వందకోట్ల రూపాయల్ని వెచ్చించారు హృతిక్‌ రోషన్‌. ప్రస్తుతం ముంబయిలో విడివిడిగా ఉంటున్న ఈ జంట త్వరలో సహజీవన బంధంలోకి ప్రవేశించబోతున్నారని తెలిసింది. ఇందుకోసం అరేబియా సముద్రానికి అభిముఖంగా ఓ విలాసవంతమైన విల్లాను కొనుకోలు చేశారట హృతిక్‌ రోషన్‌. దీని విలువ వంద కోట్లకు పైగానే ఉంటుందని చెబుతున్నారు. ప్రియురాలితో కలిసి ఉండేందుకు ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించడం బాలీవుడ్‌ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం హృతిక్‌ రోషన్‌ ‘ఫైటర్‌’ చిత్రంలో నటిస్తున్నారు.