లెజెండరీ నటుడు కమల్ హాసన్ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జ్వరంతోపాటు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న ఆయన బుధవారం సాయంత్రం చెన్నైలోని పొరూరు రామచంద్ర దవాఖానలో (SRMC) చేరారు. చికిత్స అనంతరం వైద్యులు కమల్‌ను డిశ్చార్జ్ చేశారు. అయితే కొన్నిరోజులపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్లు తెలిసింది.కాగా, బుధవారం ఉదయం హైదరాబాద్‌కు వచ్చిన కమల్ హాసన్.. అగ్ర దర్శకుడు, తన గురువు కే విశ్వనాథ్ ఇంటికి వెళ్లారు. ఆయన ఆశ్వీరాదం తీసుకున్నారు. వారిద్దరి ఇలయికలో సాగర సంగమం, శుభ సంకల్పం వంటి క్లాసికల్ హిట్ సినిమాలు వచ్చాయి.