DailyDose

TNI నేటి నేర వార్తలు

TNI  నేటి నేర వార్తలు

* నివాస ప్రాంతంలో చిరుతపులి సంచరిస్తున్నది. అది ఇప్పటికే ముగ్గురిపై దాడి చేసింది. దీంతో ఆ ప్రాంత వాసులు భయాందోళన చెందుతున్నారు. మహారాష్ట్ర రాజధాని ముంబై సమీపంలో ఈ సంఘటన జరిగింది. కళ్యాణ్ ప్రాంతంలోని నివాసిత బిల్డింగ్‌లలో చిరుత పులి తిరుగుతున్నది. చించ్‌పాడలోని నవరంగ్ సొసైటీ బిల్డింగ్‌ మొదటి అంతస్తులో చిరుతను చూసి అక్కడి నివాసితులు భయాందోళన చెందారు. సహాయం కోసం వారు కేకలు వేశారు. కాగా, కొందరు హెచ్చరించినప్పటికీ పట్టించుకోకుండా ఒక వ్యక్తి ఆ భవనంలోకి వెళ్లాడు. దీంతో అతడిపై ఆ చిరుత దాడి చేసింది. స్థానికులు కొందరు కర్రలతో దానిని తరిమారు. దీంతో ఆ చిరుత పక్కనే ఉన్న మరో బిల్డింగ్‌లోకి దూకింది. దీంతో ఆ భవనంలోని నివాసితులు భయాందోళన చెందుతున్నారు. ఆ చిరుత ఇప్పటి వరకు ముగ్గురిపై దాడి చేసింది.

* కడప జిల్లాలోని ఇడుపులపాయ త్రిపుల్‌ ఐటీ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య కలకలం సృష్టిస్తుంది. ఇంటర్‌ మొదటి సంవత్సరం చదువుతున్న ఈశ్వర్‌ అనే విద్యార్థి కళాశాలలోని హాస్టల్‌ గదిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలతో ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. విద్యార్థి వద్ద సూసైడ్‌ నోట్‌ స్వాధీనం చేసుకున్న ట్రిపుల్‌ ఐటీ అధికారులు పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

* ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు ఇవాళ లుథియానాలో ఉన్న ప్ర‌ముఖ జ్యువెలరి షాపుల్లో సోదాలు నిర్వ‌హించారు. నిక్క‌మ్మ‌ల్ జ్వ‌ల‌ర్స్‌, స‌ర్దార్ జ్వ‌ల‌ర్స్‌, మ‌ణి రాజ‌మ్ బ‌ల్వంత్ రాయ్ జ్యువెలరి షాపుల్లో ఐటీశాఖ ఆఫీస‌ర్లు త‌నిఖీలు చేప‌డుతున్నారు. షోరూమ్‌ల‌తో పాటు ఇండ్ల‌ల్లోనూ దాడులు జ‌రుగుతున్న‌ట్లు తెలుస్తోంది. పోలీసుల స‌హ‌కారంతో ఆదాయ‌ప‌న్ను శాఖ అధికారులు ఈ త‌నిఖీలు చేస్తున్నారు. ఐటీశాఖ సోదాలు జరుగుతున్న‌ట్లు తెలియ‌గానే న‌గ‌రంలో భ‌యాందోళ‌న‌లు మొద‌ల‌య్యాయి. అనేక షోరూమ్‌ల‌ను తెర‌వ‌లేదు. మొబైల్ ఫోన్ల‌ను కూడా స్విచాఫ్ చేశారు.

*కాకినాడ జిల్లా తుని పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత పోల్నాటి శేషగిరిరావుపై దాడిచేసిన నిందితుడు చంద్రశేఖర్‌ను అరెస్టు చేసినట్టు అడిషనల్‌ ఎస్పీ పి.శ్రీనివాస్‌ బుధవారం తెలిపారు. ఆయన కథనం ప్రకారం విశాఖపట్నం ఆరిలోవ పెద గదిలి ప్రాంతానికి చెందిన కప్పా అభిరామ్‌ అనే వ్యక్తి వివిధ ప్రాంతాల్లో పూజలు చేస్తూ ఉండేవాడు. అదే ప్రాంతానికి చెందిన అగ్రహారపు చంద్రశేఖర్‌ అతని వద్ద శిష్యుడిగా కొనసాగుతున్నాడు. తుని ప్రాంతంలోనూ పూజలు చేసే ఇతనికి… పోల్నాటి శేషగిరిరావు అనే వ్యక్తిపై దాడి చేయాలని, అందుకు డబ్బులు ఇస్తానని అభిరామ్‌ చెప్పాడు. అంగీకరించిన చంద్రశేఖర్‌ స్నేహితులతో కలిసి శేషగిరిరావు కదలికలను కొంతకాలంగా గమనిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ ఉదయం చంద్రశేఖర్‌ మోటారు సైకిల్‌పై శేషగిరిరావు ఇంటికి వచ్చి భిక్షం అడుగుతూ కత్తితో చేతిని నరికాడు.

* దేశరాజధాని ఢిల్లీలోని పాలం ప్రాంతంలో (Delhi palam Area) ఒకే కుటుంబంలోని నలుగురు కత్తిపోట్లతో దారుణ హత్యకు గురయ్యారు. కన్న కొడుకే కాలయముడై తన తండ్రి, తల్లి, అమ్మమ్మ, సోదరిని పొట్టనపెట్టుకున్నాడు. ఆ తర్వాత పారిపోయే ప్రయత్నం చేయగా పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. మంగళవారం రాత్రి చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన తీవ్ర సంచలనమైంది.
*కాకినాడ జిల్లా తుని పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్‌ నేత పోల్నాటి శేషగిరిరావుపై దాడిచేసిన నిందితుడు చంద్రశేఖర్‌ను అరెస్టు చేసినట్టు అడిషనల్‌ ఎస్పీ పి.శ్రీనివాస్‌ బుధవారం తెలిపారు.

*దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన దారుణమైన శ్రద్ధా వాకర్ హత్య కేసు మరవక ముందే అలాంటిదే మరో దారుణ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని(Uttar Pradesh) సీతాపూర్‌లో వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మహిళ మృతదేహాన్ని హంతకులు ముక్కలుగా నరికి సుదూరప్రాంతంలో పడేశారు.(Chops Body Into Pieces)ఉత్తరప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లాలోని రాంపూర్ కలాన్ ఏరియా పోలీస్ స్టేషన్ పరిధిలోని గులారిహాలో జ్యోతి అలియాస్ స్నేహ అనే మహిళ మృతదేహాన్ని నవంబర్ 8వతేదీన పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఇద్దరు ప్రధాన నిందితులు పంకజ్ మౌర్య,దుర్జన్ పాసిని అరెస్టు చేశారు.

*పంజాబ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. తనపై ఓ బాలుడు అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక(Minor Girl)…అనంతరం ఆసుపత్రిలో ఓ పండంటి బాబుకు జన్మనిచ్చిన ఉదంతం పంజాబ్ రాష్ట్రంలోని చండీఘడ్ నగర పరిధిలోని జిరాక్ పూర్ ప్రాంతంలో వెలుగుచూసింది.(Zirakpur Case) బాధిత బాలిక బుధవారం జిరాక్‌పూర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత ఓ యువకుడిపై పోలీసులు కేసు(Case Registered) నమోదు చేశారు.(Girl Delivers Baby)నిందితుడు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వ్యక్తి. మూలాల ప్రకారం నిందితుడు కూడా మైనర్ అని, అయితే అతని అరెస్టు తర్వాత మాత్రమే స్పష్టత వస్తుందని పోలీసులు చెప్పారు.