షార్లెట్ తెలుగు సంఘం(TAGCA) ఆధ్వర్యంలో దసరా-దీపావళి సంబరాలు కొత్త కార్యవర్గం ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. 1000 మందికి పైగా తెలుగువారు హాజరైన వేడుకలు 10గంటల పాటు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఆహ్లాదంగా సాగాయి. యువతకు ప్రశంసా పత్రాలు అందజేశారు. సంగీత విభావరి మనోరంజకంగా సాగింది. గాయని గాయకులు మనో, గీతా మాధురి, శ్రీకృష్ణ, శ్రీకాంత్, శ్రుతి, మెహర్ బ్యాండ్ ప్రదర్శన అతిథులను అలరించాయి. అనంతరం సంగీత బృందాన్ని కార్యవర్గం సత్కరించింది. వేడుకల నిర్వహణకు తోడ్పడిన వారికి కార్యవర్గం ధన్యవాదాలు తెలిపారు.
వైభవంగా షార్లెట్ తెలుగు సంఘం దీపావళి
Related tags :