ముందస్తు క్యాన్సర్ పరీక్షలు (స్క్రీనింగ్) అనగానే మామోగ్రామ్, కొలనోస్కోపీ ముందుగా గుర్తుకొస్తాయి. రొమ్ము, పెద్దపేగు క్యాన్సర్ ఆనవాళ్లను తొలిదశలోనే గుర్తించటానికివి తోడ్పడతాయి. అయితే ఊపిరితిత్తి క్యాన్సర్ ముందస్తు పరీక్షలతోనూ మంచి ఫలితం కనిపిస్తున్నట్టు ఇంగ్లండ్ అనుభవాలు చెబుతున్నాయి. అక్కడ కొన్నిచోట్ల పొగతాగే అలవాటు మానేసిన 55-74 ఏళ్ల వయసువారికి ఈ పరీక్షలను నిర్వహించారు. వీటితో నయం చేయగలిగే స్థితిలో ఉన్న ఊపిరితిత్తి క్యాన్సర్లను 80% వరకు గుర్తించగలిగారు. ఇంతకుముందు ఇలాంటి క్యాన్సర్లలో 30 శాతమే గుర్తించేవారు. ఇది గొప్ప మేలి మలుపని డాక్టర్లు చెబుతున్నారు. ఊపిరితిత్తి క్యాన్సర్‌లో విడవకుండా దగ్గు, ఛాతీ ఇన్‌ఫెక్షన్, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. అయితే తొలిదశలో ఇలాంటివేవీ ఉండవు. స్కానింగ్ ద్వారా ఈ దశలోనే క్యాన్సర్ ఆనవాళ్లను పోల్చుకునే వీలుండటం విశేషం.
ఊపిరితిత్తుల క్యాన్సర్ ముందే పసిగట్టండి
Related tags :