సరిగ్గా 45సంవత్సరాల క్రితం ఇదే రోజు (02.12.1977)న సీతారామాంజనేయ మూవీస్ పై
శ్రీ సాంబశివరావు గారి దర్శకత్వంలో విడుదలైన చిత్రం “మనస్సాక్షి”.ప్రముఖ నవలా రచయిత్రి వాసిరెడ్డి సీతాదేవి గారు రాసిన “ప్రతీకారం”అనే నవల ఆధారంగా రూపొందించబడిన సినిమా “మనస్సాక్షి”..హీరో కృష్ణ,భారతిగా,జగ్గయ్య,కాంతారావు, గిరిబాబు, షావుకారు జానకి,నగేష్,త్యాగరాజు, జ్యోతిలక్ష్మి మొదలగువారునటించిన ఈ సినిమాకి సంగీతమ్ jv రాఘవులుగారు సాహిత్యం ఆత్రేయ సినారె గారు…..ఇందులో “కళ్ళలో ఎన్నెన్ని కలలో,నడిసంద్రంలో నావతీరాల” అనే పాటలు హిట్ అయ్యాయి..ఇది హీరో కృష్ణ గారు నటించిన 132వ సినిమా..