వర్జినియాకు చెందిన ప్రముఖ ప్రవాసాంద్రుడు ఉప్పుటూరి రామ చౌదరి స్వగ్రామం గుంటూరు జిల్లా పుల్లడికుంటలో లక్షలాది రూపాయల వ్యయంతో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ జన్మభూమి రుణం తీర్చుకుంటున్నారు గ్రామంలో ఉన్న వృద్ధులను నిరుపేదలను వికలాంగులను పేద విద్యార్థులను రామ్ చౌదరి ఆర్థిక సహాయం అందిస్తూ వారికి అండగా నిలుస్తున్నారు
తల్లిదండ్రులను గౌరవించడంలోనూ వారి పట్ల ఆదరాభిమానాలను వ్యక్తపరచటంలోనూ రామ్ చౌదరి తీసుకుంటున్న చర్యలు ప్రవాసాంధ్ర యువతకు ఆదర్శంగా నిలుస్తోంది తన తల్లిదండ్రులు ఉప్పుటూరి చిన్న రాములు ఉప్పుటూరి సీతామహాలక్ష్మి లను ప్రతినిత్యం వారి బాగోగులను చూడటంతో పాటు గ్రామ అభివృద్ధిలో వారిని కూడా భాగస్వాములను చేశారు గత గురువారం నాడు రామ్ చౌదరి తల్లి ఉప్పుటూరి సీతామహాలక్ష్మి 66వ జన్మదిన వేడుకలు పుల్లటిగుంటలో అంగరంగ వైభవంగా నిర్వహించారు అమెరికాలో ఉంటూనే రామ్ చౌదరి తన తల్లి సీతామహాలక్ష్మి జన్మదిన వేడుకలను భారీగా నిర్వహించారు
గ్రామ ప్రజలందరికీ పసందైన విందు భోజనాన్ని రామ్ చౌదరి ఏర్పాటు చేశారు బాలికలకు సైకిళ్లను విద్యార్థులకు లాప్టాప్ లను పేద మహిళలకు కుట్టు మిషన్లను ఈ సందర్భంగా విరాళంగా అందించారు తానా మాజీ అధ్యక్షులు జయ శేఖర్ తాళ్లూరి తదుపరి అధ్యక్షులు నిరంజన్ శృంగవరపు తానా ఫౌండేషన్ ట్రస్టీలు రవి సామినేని విశ్వనాధ్ నాయన పాటి తదితరులు హాజరై సీతామహాలక్ష్మికి జన్మదిన శుభాకాంక్షలు అందించారు పుల్లటిగుంట గ్రామానికి రామ్ చౌదరి చేస్తున్న సేవలను ప్రశంసించారు