NRI-NRT

టాంపాలో ఎన్‌టీఆర్ శతజయంతి

టాంపాలో ఎన్‌టీఆర్ శతజయంతి

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రంలోని టాంపా నగరంలో NRITDP ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు నిర్వహించారు. జాతీయ తెదేపా నిర్దేశంలో ఏడాది పొడవునా అమెరికా అంతటా ఎన్‌టీఆర్ శతజయంతి నిర్వహించాలనే కార్యక్రమంలో భాగంగా ఫ్లోరిడాలో కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని ఆహుతులు పేర్కొన్నారు. తెలుగుజాతి కీర్తిని ప్రపంచ నలుమూలలా ఖ్యాతిని చాటిన వ్యక్తి ఎన్టీ రామారావు అని వక్తలు కొనియాడారు. ఎన్నారై తెదేపా అమెరికా సమన్వయకర్త కోమటి జయరాం, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, ఎన్టీఆర్ ట్రస్ట్ డైరెక్టర్ మన్నవ మోహనకృష్ణ, తానా మాజీ అధ్యక్షులు వేమన సతిష్, నాట్స్ మాజీ ఛైర్మన్ గుత్తికొండ శ్రీనివాస్, మిర్చి యార్డ్ మాజీ ఛైర్మన్ మన్నవ సుబ్బారావు, తదితరులు పాల్గొన్నారు. NRITDP టాంపా కమిటీ కార్యవర్గాన్ని ప్రకటించి సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
టాంపాలో ఎన్‌టీఆర్ శతజయంతి - NTR Centennial Birthday In Tampa Florida By NRI TDP