Movies

ట్రోల్స్‌కు అలవాటుపడిపోయా!

ట్రోల్స్‌కు అలవాటుపడిపోయా!

సీనియర్‌ కథానాయిక మలైకా అరోరా, యువ హీరో అర్జున్‌ కపూర్‌ ప్రేమాయణం బాలీవుడ్‌ వర్గాలతో పాటు సాధారణ ప్రేక్షకుల్లో కూడా ఆసక్తిని రేకెత్తిస్తుంటుంది. అందుక్కారణం మలైకా అరోరా కంటే అర్జున్‌ కపూర్‌ పన్నెండేండ్లు చిన్నవాడు కావడమే. అర్భాజ్‌ఖాన్‌తో 18 ఏండ్ల సుదీర్ఘ వివాహ బంధాన్ని తెగతెంపులు చేసుకున్న మలైకా అరోరా గత కొన్నేళ్లుగా అర్జున్‌కపూర్‌తో సహజీవనం చేస్తున్నది. తనకంటే చిన్నవాడైన యువకుడితో లివ్‌ఇన్‌ రిలేషన్‌లో ఉందంటూ ఆమెపై సోషల్‌మీడియాలో ట్రోల్స్‌ కూడా వస్తుంటాయి.వీటిపై తాజా ఇంటర్వ్యూలో స్పందించింది మలైకా అరోరా. ‘ఈ విషయంలో నిత్యం జరిగే ట్రోలింగ్‌కు అలవాటుపడిపోయా. సమాజంలో ద్వంద్వ విలువలుంటాయి. పురుషుడు తనకంటే ఇరవై, ముప్పై ఏండ్లు తక్కువ వయసున్న స్త్రీని ప్రేమిస్తున్నా సమాజం అభ్యంతరం చెప్పదు. అదే స్త్రీ తనకంటే పదేళ్లు చిన్నవయసు వాడి ప్రేమలో ఉంటే చులకన భావంతో చూస్తుందిసమాజం ఏమనుకుంటుందో అనే విషయాన్ని పట్టించుకోను. నా కుటుంబం, సన్నిహితులు మాత్రం అర్జున్‌ కపూర్‌తో నా బంధం పట్ల చాలా సంతోషంగా ఉన్నారు. మేమిద్దరం పెళ్లి గురించి ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు’ అని చెప్పింది.