Movies

విజయ్‌కి ఫోన్‌ చేసి చెప్పాను!

విజయ్‌కి ఫోన్‌ చేసి చెప్పాను!

బాలీవుడ్‌ యువ నాయిక జాన్వీకపూర్‌కు దక్షిణాది సినీరంగమంటే అమితమైన గౌరవం. తన తల్లి, దివంగత అందాలతార శ్రీదేవి దక్షిణాది నుంచి కెరీర్‌ను మొదలుపెట్టి జాతీయస్థాయిలో స్టార్‌డమ్‌ను సంపాదించుకుందని, తాను సౌత్‌ అమ్మాయిననే భావిస్తానని చాలా సందర్భాల్లో చెప్పింది జాన్వీకపూర్‌. తెలుగు, తమిళ ఇండస్ట్రీల నుంచి తగిన స్క్రిప్ట్‌ కోసం ఎదురుచూస్తున్నానని అనేక ఇంటర్వ్యూల్లో పేర్కొంది. తాజాగా తమిళంలో ఎంట్రీ గురించి ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించిందీ భామ.కోలీవుడ్‌లో విజయ్‌ సేతుపతి తన అభిమాన నటుడని, ఆయనతో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని చెప్పింది. ఆమె మాట్లాడుతూ ‘ఇటీవలే విజయ్‌ సేతుపతికి ఫోన్‌ చేసి నా మనసులోని మాటను బయటపెట్టా. ఆయన చాలా ఆనందం వ్యక్తం చేశారు. మంచి కథ కుదిరితే త్వరలో తమిళ అరంగేట్రం ఉంటుంది’ అని జాన్వీకపూర్‌ తెలిపింది. జాన్వీకపూర్‌ కథానాయికగా నటించిన ‘మిలీ’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన విజయం సాధించలేకపోయినా..జాన్వీ నటనకు ప్రశంసలొచ్చాయి.