NRI-NRT

ఘనంగా తెలుగు పీపుల్ ఫౌండేషన్ 14వ వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా తెలుగు పీపుల్ ఫౌండేషన్ 14వ వార్షికోత్సవ వేడుకలు

తెలుగు పీపుల్ ఫౌండేషన్ గత కొన్నేళ్లుగా పేద విద్యార్థులకు అండగా నిలుస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆ సంస్థ 14వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. న్యూజెర్సీలోని జేపీ స్టీవెన్స్ హైస్కూల్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది పాల్గొగన్నారు. ఇదే సమయంలో ఈ సంస్థ పలువురి నుంచి భారీ మొత్తంలో విరాళాలను సేకరించింది. విరాళాల రూపంలో వచ్చిన డబ్బును పేద విద్యార్థుల కోసం ఖర్చు చేయనున్నట్టు వెల్లడించింది.ఈ కార్యక్రమం సందర్భంగా తెలుగు పీపుల్ ఫౌండేషన్ అధ్యక్షుడు కృష్ణ కొత్త మాట్లాడారు. తమ ఫౌండేషన్ ద్వారా ఇంజనీరింగ్, మెడిసిన్, సీఏ వంటి ఉన్నత విద్యను అభ్యసించేందుకు పేద విద్యార్థులకు సహాయం చేస్తున్నట్టు చెప్పారు. ఇప్పటి వరకు 325 మంది పేద విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లను స్పాన్సర్ చేసినట్టు వెల్లడించారు. ఇందులో 125 మంది ప్రభుత్వ పాఠశాలలకు చెందిన వాళ్లే ఉన్నారన్నారు. ఇందులో కొంత మంది విద్యార్థులు మెడిసిన్ చేస్తుండగా.. మరికొందరేమో ఐఐటీల్లో విద్యాభ్యాసం చేస్తున్నట్టు తెలిపారు. మరికొందరు చార్టర్డ్ అకౌంటెన్సీ చదువుతుండగా.. ఓ విద్యార్థి సివిల్ సర్వీసెస్‌కు ప్రిపేర్ అవుతున్నట్టు చెప్పారు.
Untitled-3-5969987cfb
రేపటి రోజున తలెత్తుకుని జీవించడానికి.. ఇప్పుడు తలదించుకొని చదువుకోవాలని ఈ సందర్భంగా విద్యార్థులకు సూచించారు.ఈ కార్యక్రమంలో భాగంగా పలువురు స్పాన్సర్ల నుంచి దాదాపు 1,07,000 డాలర్లను తెలుగు పీపుల్ ఫౌండేషన్ విరాళాల రూపంలో సేకరించింది. ఇదిలా ఉంటే.. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను అలరించాయి. ప్రముఖ మిమక్రీ కళాకారుడు రమేష్, కొరియేగ్రాఫర్లు ప్రజ్ఞ, రిహే, సంగీత దర్శకుడు అనూప్ రూబెన్స్ తమ ప్రతిభతో ఆకట్టుకున్నారు. సంస్థ వ్యవస్థాపకుడు ప్రసాద్ కూనిశెట్టి, కన్వీనర్ అరవింద బోయపాటి, ఫండ్ రైసింగ్, ఫైనాన్స్ డైరెక్టర్ ప్రవీణ్ గూడురు, సీత కొడవటిగంటి, లక్ష్మి మోపర్తి, ఇందిరా శ్రీరామ్ దీక్షిత్, ప్రసాద్ సింహాద్రి, శృతి నండూరి, అరవింద్, శ్రీషా గోరస, నిఖిల్ అయ్యర్, ప్రణవ్, శ్రీధర్ వైద్యనాథ, కార్తీక్ రామసుబ్రమణియన్ తదితరలు పాల్గొన్నారు.