NRI-NRT

ఇంగ్లండ్‌లో నూత‌నంగా నిర్మించిన గురుద్వార‌ను సంద‌ర్శించిన కింగ్ చార్లెస్‌

ఇంగ్లండ్‌లో నూత‌నంగా నిర్మించిన గురుద్వార‌ను సంద‌ర్శించిన కింగ్ చార్లెస్‌

బ్రిట‌న్ రాజు కింగ్ చార్లెస్ (మూడ‌వ‌) ఇంగ్లండ్‌లోని లుట‌న్‌లో నూత‌నంగా నిర్మించిన గురుద్వార‌ను మంగ‌ళ‌వారం సంద‌ర్శించారు. గురునాన‌క్ గురుద్వారను నిర్మించిన బాధ్యులు, వాలంటీర్ల‌ను కింగ్ చార్లెస్ కలుసుకున్నారు. గురుద్వార‌ను సంద‌ర్శించిన స‌మ‌యంలో కింగ్ చార్లెస్ త‌ల‌కు క‌ర్చీఫ్ చుట్టుకుని క‌నిపించారు.గురుద్వార స‌భ్యులు, వాలంటీర్ల‌ను ప‌లుక‌రిస్తూ ఆ ప్రాంతమంతా క‌లియ‌తిరిగారు. ఇదే ప్రాంతంలో సిక్కుల కోసం న‌డుపుతున్న స్కూల్‌ను న‌డిపే స్ధానికుల‌తో ఆయ‌న సంప్ర‌దింపులు జ‌రిపారు. పంజాబీ, సంప్ర‌దాయ సంగీతం నేర్చుకుంటున్న స్కూల్ చిన్నారుల‌తో ఆయ‌న ముచ్చ‌టించారు. కింగ్ చార్లెస్ గురుద్వార సంద‌ర్శ‌న‌కు సంబంధించిన పొటోల‌ను రాయ‌ల్ ఫ్యామిలీ అధికారిక ఇన్‌స్టాగ్రాం పేజ్‌లో షేర్ చేవారు.నూత‌నంగా నిర్మించిన గురునాన‌క్ గురుద్వార‌ను సంద‌ర్శించిన కింగ్ చార్లెస్ అక్క‌డ వాలంటీర్ల‌ను క‌లిసి ముచ్చ‌టించారు.గురుద్వార‌లోని లుట‌న్ సిక్ సూప్ కిచెన్ స్టాండ్‌ను ప‌రిశీలించారు. ఈ కిచెన్ వారానికి ఏడు రోజులు, సంవ‌త్స‌రానికి 365 రోజుల పాటు వేడివేడి వెజిటేరియ‌న్ మీల్స్‌ను స‌ర్వ్ చేస్తుంద‌ని ఈ పోస్ట్‌కు క్యాప్ష‌న్ ఇచ్చారు. తూర్పు ఇంగ్లండ్ ప్రాంతంలోని బెర్‌ఫోర్డ్‌షైర్‌లో కింగ్ చార్లెస్ తొలి టూర్‌లో భాగంగా గుర‌ద్వార‌ను సంద‌ర్శించారు.