ప్రకృతి మనకు ఏది అవసరమో అదే అందజేస్తుంది.ప్రకృతి మనకు ఏది అవసరమో అదే అందజేస్తుంది. సీజన్‌కు అనుగుణంగా వివిధ రకాల కూరగాయలు లభిస్తాయి. ముఖ్యంగా చలికాలంలో ఆరోగ్యానికి మేలు చేసే అనేక రకాల కూరగాయలు ఉంటాయి. అందులో ముల్లంగి ఒకటి. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. బీపీ, షుగర్, క్యాన్సర్ వంటి అనేక వ్యాధులకు దివ్య ఔషధంగా పనిచేస్తుంది. ముల్లంగి తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఈ రోజు తెలుసుకుందాంఇలాంటి వ్యాధులు ఉంటే జామపండు తినకూడదు..! క్యాన్సర్ ప్రమాదం ముల్లంగిలో క్యాన్సర్ నిరోధక గుణాలు ఉంటాయి. వీటని తినడం వల్ల క్యాన్సర్ రాకుండా నిరోధించవచ్చు. ముల్లంగి వంటి క్రూసిఫెరస్ కూరగాయలు నీటిలో కలిసినప్పుడు ఐసోథియోసైనేట్‌లుగా విడిపోయే సమ్మేళనాలను కలిగి ఉంటాయి. ఇవి క్యాన్సర్ కణితులను, వాటి పెరుగుదలను నిరోధించడంలో సహాయపడతాయి. మధుమేహాన్ని నియంత్రిస్తాయి చలికాలం తక్కువ నీరు తాగుతున్నారా.. అయితే ప్రమాదంలో పడినట్లే..! ముల్లంగిలో ఉండే గుణాలు రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి. ఇందులో బయోయాక్టివ్ సమ్మేళనాలు కనిపిస్తాయి. ఇది అడిపోనెక్టిన్ అనే హార్మోన్‌ను నియంత్రిస్తుంది. ఈ హార్మోన్ చక్కెర స్థాయిని నియంత్రించడానికి సహాయపడుతుంది. ముల్లంగిలో ఉండే పోషకాలు మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. గుండె, రక్తపోటులో మేలు ముల్లంగిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. ఇది రక్తపోటును నియంత్రించడంలో పనిచేస్తుంది. పొటాషియం గుండె సక్రమంగా పనిచేయడానికి సహాయపడుతుంది. ముల్లంగిలో ఆంథోసైనిన్ ఉంటుంది. ఇది రక్త ప్రసరణ మెరుగుపరుస్తుంది.చలికాలం ఉడకబెట్టిన గుడ్డు తినండి.. శరీరానికి అద్భుత ప్రయోజనాలు..! జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి ముల్లంగి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. ముల్లంగిలో కరిగే, కరగని ఫైబర్స్ ఉంటాయి. ఇవి జీర్ణక్రియకు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఫైబర్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ముల్లంగి తింటే అజీర్తి, మలబద్ధకం దరిచేరవు