ఉభయతెలుగు రాష్ట్రాల్లో ఈ డిసెంబరు నెలలో దాదాపు మిలియన్ డాలర్ల ఖర్చుతో తానా చైతన్య స్రవంతి పేరుతో పెద్ద ఎత్తున పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధ్యక్షుడు లావు అంజయ్యచౌదరి తెలిపారు. తానా ఫౌండేషన్ ట్రస్టీ సామినేని రవి ఆధ్వర్యంలో ఖమ్మజిల్లా మాటూరుపేటలో నిర్వహించిన తానా చైతన్య స్రవంతి కార్యక్రమానికి అంజయ్యచౌదరి ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు.
జులై మొదటి వారంలో అమెరికాలోని ఫిలడెల్ఫియాలో నిర్వహిస్తున్న తానా మహాసభలకు వీసా ఉన్నవారందరూ తరలిరావాలని ఆయన కొరారు. ఈ కార్యక్రమంలొ 36 మంది విద్యార్ధులకు సైకిళ్ళను, నలుగురు మెరిట్ విద్యార్ధులకు లాప్ టాప్ లను, మరికొందరు విద్యార్ధులకు ఉపకార వేతనాలను అందజేశారు.
ఈ కార్యక్రమంలో తానా తదుపరి అధ్యక్షులు నిరంజ శృంగవరపు, కార్యదర్శి వేమూరి సతీష్, తానా పూర్వ అద్యక్షుడు జయశేఖర్ తాళ్ళూరి, ఫౌండేషన్ ట్రస్టీ విశ్వనథ్ నాయనపాటి స్థానిక ప్రముఖులు డా.వాసిరెడ్డి రామనాథం, నెలూరు రవి, సామినేని నాగేశ్వరరావు, మల్లాది వాసు తదితరులు పాల్గొన్నారు. మాటూరు, మాటూరుపేట గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో తానా నేతలకు స్వాగతం పలికారు. మాటూరుపేట గ్రామానికి సామినేని రవి అందిస్తూన్న సేవలను గ్రామ ప్రజలు కొనియాడారు.