DailyDose

TNI నేటి నేర వార్తలు

TNI  నేటి నేర వార్తలు

గుంటూరు జిల్లా

తాడేపల్లి

కొలనుకొండ వద్ద జాతీయ రహదారి పై నుంచి సర్వీస్ రోడ్డు లోకి తిరగబడ్డ లారీ

డ్రైవరు మరియు క్లీనర్ కు గాయాలు

మొక్కల లోడుతో సాగర్ మీదుగా తెలంగాణ వెళ్తున్న లారీ

స్కూటర్ ను ఢీకొట్టి హైవే పై నుండి దూసుకెళ్లి తిరగబడ్డ లారీ

స్కూటర్ పై వెళుతున్న వ్యక్తి కి తీవ్ర గాయాలు హస్పిటల్ కు తరలింపు..

లారీ డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం తో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది

తూర్పుగోదావరి జిల్లా :

ఏలూరు కి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, బిజెపి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గారపాటి తపన చౌదరి కి తృటి లో తప్పిన ప్రమాదం.

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గామన్ బ్రిడ్జి సమీపంలో కొవ్వూరు వైపు ప్రయాణిస్తున్న కాలేజీ బస్ కి గుర్తు తెలియని వ్యక్తి అడ్డు రావడంతో నెమ్మదిగా ఆగిన కాలేజీ బస్సు.

స్కూల్ బస్సు వెనుక ఉన్న తపన చౌదరి టయోటా కారు నిలుపుదల చేయడంతో వెనుక నుండి క్వారీ లారీ బలంగా ఢీకొనడంతో బస్సుకి లారీకి మధ్య నుజ్జు అయిన కారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కొవ్వూరు పట్టణ పోలీసులు

ఏలూరు జిల్లా – నూజివీడు

వివాహిత ఐశ్వర్య మిస్సింగ్ కేసును చేదించిన నూజివీడు పోలీసులు

రెడ్డిగూడెం మండలం కూనపురాజుపర్వ గ్రామానికి చెందిన వివాహిత ఐశ్వర్య మూడో తేదీ నుండి కనపడని వైనం

భర్తకు తెలియకుండా ప్రియుడుతో కలిసి జగ్గయ్యపేటలో ఉన్న ఐశ్వర్యను సాంకేతిక పరిజ్ఞానంతో తీసుకువచ్చిన పోలీసులు

కేసును చేదించి వివాహిత ఐశ్వర్యను తన తండ్రికి అప్పజెప్పిన డీఎస్పీ అశోక్ కుమార్ గౌడ్

ఐశ్వర్య మిస్సింగ్ కేసు విచారిస్తున్న తరుణంలో ఆమె బంధువులు పోలీస్ స్టేషన్లోకి చొచ్చుకు వచ్చి భర్తను అప్పగించాలంటూ దురుసుగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకున్న పోలీసులు..

దాడి చేసిన నలుగురు మరియు మరి కొంతమందిపై ఐపిసి 353 సెక్షన్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు.

సీసీ కెమెరాలు ఆధారంగా ప్రతి ఒక్కరిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తాం… డిఎస్పి అశోక్ కుమార్ గౌడ్.

నంద్యాల జిల్లా
మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్,
MINISTRY OF HOME AFFAIRS NOTIFCATION
1.పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా ( PFI) మరియు దాని అనుబంధ సంస్థలు,
2.రిహాబ్ ఇండియా ఫౌండేషన్ (RIF) ,
3.క్యాంపస్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (CFI),
4.అల్ ఇండియా ఇమామ్స్ కౌన్సిల్ (AIIC),
5.నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ (NCHRO)
6.నేషనల్ ఉమెన్స్ ఫ్రంట్, జూనియర్ ఫ్రంట్,
7.ఎంపవర్ ఇండియా ఫౌండేషన్,
8. రిహాబ్ ఇండియా ఫౌండేషన్ (RIF) కేరళ.
పైన తెలిపినటువంటి సంస్థలను చట్టవిరుద్ధ కార్యకలాపాల సంస్థలుగా కేంద్ర ప్రబుత్వం గుర్తించింది. అన్లా ఫుల్ యాక్టివిటీ, ప్రివెన్షన్ యాక్ట్ 1967 ప్రకారం( Unlawful Activities (Prevention) యాక్ట్ 1967) కేంద్ర ప్రభుత్వం తేదీ 27 సెప్టెంబర్ 2022 న నిషేధం విధించింది. ఇటువంటి సంస్థల యొక్క కార్యకలాపాలు ఎవరైనా నిర్వహించిన, ప్రోత్సహించిన చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోబడతాయి అని నంద్యాల జిల్లా ఎస్పి శ్రీ కె రఘువీర్ రెడ్డి IPS., గారు ఒక ప్రకటనలో తెలిపారు

ఈ రోజు బందరు కలెక్టర్ కార్యాలయంలో ఓ మహిళ ఆవేదన…పొలం కబ్జా చేశారు అంటూ కలెక్టర్ కార్యాలయం ఎదుట బైఠాయించి న్యాయం కోసం పోరాడుతున్న మాజీ కాలేజ్ వైస్ ప్రిన్సిపాల్

వైఎస్ విజయమ్మ గారిని ఇంటి నుంచి బయటకు రాకుండా అడ్డుకున్న పోలీస్ లు

పార్టీ కార్యాలయం ముందు రోడ్డు పై వైఎస్ షర్మిల గారు చేస్తున్న దీక్ష కు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న విజయమ్మ గారిని అడ్డుకున్న పోలీస్ లు