Sports

మా విడాకుల గోల మీకెందుకు?

మా విడాకుల గోల మీకెందుకు?

భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జా (Sania Mirza), పాకిస్థాన్‌ క్రికెటర్‌ షోయబ్‌ మాలిక్(Shoaib Malik) విడాకులు(Divorce) తీసుకోబోతున్నారంటూ గత కొద్ది రోజులగా వార్తలు గుప్పుమంటున్నాయి. ఈ నేపథ్యంలో షోయబ్‌ మాలిక్‌ ఓ న్యూస్‌ ఏజెన్సీతో మాట్లాడుతూ..విడాకుల అంశం తమ వ్యక్తిగతమని అన్నాడు. దీనిని ఇక్కడితో వదిలేయాలని కోరాడు. ఈ అంశంపై ఎలాంటి ప్రశ్నలు అడగొద్దని మీడియాకు విజ్ఞప్తి చేశాడు. విడాకులపై లేవనెత్తుతున్న ప్రశ్నలకు సానియా మీర్జా కూడా ఎలాంటి సమాధానం చెప్పబోదని పేర్కొన్నాడు.