*భార్య ఇంటికి ఆభరణం!!
(నేడు ప్రపంచ వివాహ దినోత్సవం)
* భరించేది భార్య,
* బ్రతుకు నిచ్చేది భార్య,
* చెలిమి నిచ్చేది భార్య
* చేరదీసేది భార్య
* ఆకాశాన సూర్యుడు లేకపోయినా…
ఇంట్లో భార్య లేకపోయినా…
అక్కడ జగతికి వెలుగుండదు,
ఇక్కడ ఇంటికి వెలుగుండదు.
* భర్త వంశానికి సృష్టికర్త
* మొగుడి అంశానికి మూలకర్త,
*కొంగు తీసి ముందుకేగినా…
* చెంగు తీసి మూతి తుడిచినా…ముడిచినా..
తనకు లేరు ఎవరు సాటి
* ఇల లో తను లేని ఇల్లు… కలలో….
ఊహకందని భావన…
* బిడ్డల నాదరించి…
* పెద్దల సేవలో తరించి
* భర్తని మురిపించి..
మైమరపించి…
* బ్రతుకు మీద ఆశలు పెంచి…
* చెడు ఆలోచనలు త్రుంచి…
* భ్రమరం లా ఎగురుతూ…
* భర్త ను భ్రమల నుండి క్రిందకు దించుతూ…
* కళ్ళు కాయలు కాచేలా…
* భర్త జీవితాన పువ్వులు పూచేలా చేసిన
*జీతం లేని పని మనిషి.
జీవితాన్ని అందించే మన మనిషి …
ఏమిచ్చి తీర్చుకోగలం భార్య రుణం
ఆమెకు భారం కాకుండా ఉండడం తప్ప.
అదే భార్యకు మనమిచ్చే విలువైన ఆభరణం
🌹🌹🌹🌹🌹🌹