యాంకర్ విష్ణుప్రియ ఇప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉంది. ఆమె ఇప్పుడు వరుసగా సినిమాల్లో నటిస్తోంది. గతంలో ఆమె షార్ట్ ఫిలిమ్స్ ద్వారా ఫేమస్ అయిపోయింది. అప్పటి నుంచే మూతి ముద్దులు ఇస్తూ పేరు తెచ్చుకుంది. కానీ అవేమీ కూడా ఆమెకు అనుకున్నంత సక్సెస్ ను తీసుకు రాలేకపోయాయి.
కానీ ఎప్పుడైతే ఆమె సుధీర్ తో కలిసి పోవేపోరా షో చేసిందో అప్పటి నుంచే చాలా ఫేమస్ అయిపోయింది. దెబ్బకు ఆమెకు యాంకర్ గా మంచి పాపులారిటీ వచ్చేసింది. దాంతో ఆమె ఈటీవీలో వచ్చే కొన్ని స్పెషల్ ప్రోగ్రామ్స్ లో కూడా పాల్గొంది. అప్పుడు తన అందాలతో ఆకట్టుకునే ప్రయత్నాలు బాగానే చేసింది.
కానీ ఆ ప్రోగ్రామ్ ఆగిపోవడంతో ఇప్పుడు ఎక్కువగా సినిమాల్లో నటిస్తోంది. రీసెంట్ గానే వాంటెడ్ పండుగాడ్ మూవీలో నటించింది. ఈ క్రమంలోనే ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఇందులో ఆమె మాట్లాడుతూ కాస్టింగ్ కౌచ్ మీద స్పందిచింది. తనకు కూడా కాస్టింగ్ కౌచ్ ఎదరయినట్టు చెప్పుకొచ్చింది.కానీ తాను ఎలాంటి కమిట్ మెంట్లు ఇవ్వలేదని తెలిపింది. కానీ ఇద్దరి ఇష్టంతో జరిగే కమిట్ మెంట్లను తప్పుగా భావించాల్సిన పనిలేదని తెలిపింది. ఇక్కడ ఎవరూ బలవంతం చేయరు కదా.. అలాంటప్పుడు దాన్ని తప్పుగా భావించాల్సిన పనిలేదు. ఏ పని అయినా ఇద్దరికీ ఇష్టం లేకుండా జరగదు కదా అంటూ వివరించింది.