న్యాయం సంపన్నులకు రాజకీయ నాయకులకు మాత్రమే జరుగుతుంది
అధికారులు వారి కోసం పోటీ పడి నిద్ర లేకుండా పని చేస్తారు
శిక్షలు పేద మధ్యతరగతి ప్రజలకే పడుతాయి,డబ్బు ఉన్న వారికి రాజకీయ నాయకులకు శిక్ష లు పడటం అరుదు
సంపన్నుల రాజకీయ నాయకుల కేసులు విచారణకు రావడానికే ఇరవై నుండి ముప్పై సంవత్సరాలు పట్టవచ్చు అప్పటికి నేరానికి సంబంధించిన ఆధారాలు అన్ని కనుమరుగై పోతాయి కేసులు కొట్టి వేయబడుతాయి
దేశం లో ఉన్న 99% సంపన్నులు 99% రాజకీయ నాయకులు ఆర్థిక నేరస్థులే
వీరి చేతిలో మోసపోయిన పేద మధ్యతరగతి ప్రజలకు న్యాయం జరిగిన సందర్బాలు లేవు,
పేద మధ్య తరగతి ప్రజలకు న్యాయం చేయాలన్న ఆలోచన కూడా అధికారులకు ప్రభుత్వాలకు ఉండదు
ఒక సంపన్నడు పెద్ద మొత్తం లో ఆర్థిక నేరం చేస్తున్న విషయము అధికారులకు తెలిసే జరుగుతుంది
ఆర్థిక నేరం చేసి సంపాదించిన డబ్బు విచ్చల విడిగా ఎన్నికలలో ఖర్చు పెట్టడం ఎన్నికల కోసమే అక్రమ సంపాదనకు తెగబడటం రాజకీయ నాయకులకు అలవాటు అయింది
రాజకీయాలలో డబ్బున్న వారు కొందరు అవకాశాలు సృష్టించుకున్నారు
డబ్బు లేని మేధావులు సంఘ సేవకులు కొందరు రాజకీయాలలో రానించ లేక పోతున్నారు
పైసలు ఉన్న వారికి పదవులు ఎమ్మెల్యే ఎంపీ టిక్కెట్స్ అన్ని రాజకీయ పార్టీలు కేటాయిస్తున్నాయి
రాజకీయ పార్టీల ఆస్థులు రాజకీయ నాయకుల ఆస్థులు ఎట్లా పెరిగిపోతున్నయో గమనిస్తే
అన్ని రంగాలలో వీరి దోపిడీ ఎంతగా ఉన్నదో తెలుస్తుంది,ఇలా దోచుకున్న దొంగలకు అభిమానులు యెక్కువ దోoగలైన రాజకీయ నాయకులకు అండగా అనుచరులు
అవినీతి నిరోధక సంవస్థలు నామికే వాస్తే గా పని చేస్తున్నాయి
రాజకీయ నాయకులు మరి కొందరు సంపన్నులు చేసే ఆర్థిక నేరాలు 99% కనీసం పోలీస్ స్టేషన్ కు కూడా పోవు కోర్టు గడప తొక్కడం అరుదు బాధిత ప్రత్యర్థులు గట్టిగా ఉన్నప్పుడు ప్రభుత్వాలు రాజకీయంగా అణిచి వేయాలి అనుకున్నప్పుడు మాత్రమే కోర్టు దాక వెళతాయి
చట్టాలను కటినంగా అమలు చేయక పోతే నేరస్థులకు శిక్ష పడదు,బాధితులకు న్యాయం జరగదు,కోర్టులు కూడా పెరగాలి
ఓటర్లు డబ్బులు పంచే రాజకీయ నాయకులు దోపిడీ దొంగలు అని గమనించి వారికి ఓటు వేయకూడదు…