స్వాతంత్య్రభారతంలో లంచాల అక్రమార్కుల భరతంపట్టే ‘భారతీయుడు తాత’గా కమల్‌హాసన్ (Kamal Haasan) అద్భుతంగా నటించారు. కన్నకొడుకే లంచగొండి అని తెలిసినా అతడిని మట్టుబెట్టడానికి వెనుకాడని పాత్రలో ఆయన నటన మెప్పించింది. ప్రస్తుతం సమాజంలో నెలకొన్న తీవ్రమైన సమస్యపై పోరాటం చేసేందుకు మళ్లీ సేనాపతి భారతదేశానికి వస్తే? ఏం చేస్తాడన్న ఇతివృత్తంతో తాజాగా సినిమాను శంకర్ తీస్తున్నారు. ‘‘భారతీయుడు’ చూసిన అనుభూతినే ‘ఇండియన్2’ (Indian 2) కూడా ఇస్తుంది. తొలి భాగంలో స్వాతంత్య్రానికి పూర్వం ఏం జరిగిందో చూపించారు. తాజా చిత్రంలో స్వాతంత్య్రానంతరం ఏ జరిగింది? అప్పట్లో సేనాపతికి ఎదురైన సమస్యలు ఏంటి? వాటిపై ఎలా పోరాటం చేశాడు? అన్నది చూపించబోతున్నారు. మొదటి చిత్రంలో తండ్రీ-కొడుకుల మధ్య జరిగే సంఘర్షణను ఆవిష్కరించారు. రెండో భాగంలో సేనాపతి తండ్రిని కూడా చూస్తాం’’ అంటూ ఆసక్తికర విషయాన్ని జయమోహన్ వెల్లడించారు.
స్వాతంత్ర్యం అనంతరం సేనాపతి పోరాటం!
Related tags :