NRI-NRT

కరోనా అనంతరం.. పాస్పోర్టులకు డిమాండ్ బాగా పెరిగింది

కరోనా అనంతరం.. పాస్పోర్టులకు డిమాండ్ బాగా పెరిగింది

విజయవాడ

శ్రీనివాసరావు.. రీజనల్ పాస్ పోర్ట్ ఆఫీసర్

పాస్ పోర్ట్ లకు ప్రజల రద్దీ బాగా పెరిగింది

తత్కాల్, జనరల్ పద్దతి లో పాస్ పోర్ట్ ల జారీ లో జాప్యం జరుగుతుంది

ఇక నుంచి శనివారం కూడా పాస్ పోర్ట్ కార్యాలయాలు పని చేస్తాయి

ఇప్పటికే గత రెండు శనివారాలు పాస్ పోర్ట్ ల దరఖాస్తులు వెరిఫికేషన్ చేశాం

ఈనెల 17, 24 తేదీల్లో వచ్చే శనివారం కూడా పాస్ పోర్ట్ కార్యాలయాలు పని చేస్తాయి

తత్కాల్, జనరల్ పద్దతి లో పాస్ పోర్ట్ వెరిఫికేషన్ ఉంటుంది

అవసరమైన అన్ని పత్రాలు తో దరఖాస్తు చేసుకోచ్చు

సరైన పత్రాలు లేకుండా ఎవరూ రావద్దు

దీని వల్ల అత్యవసరం అయిన వారికి ఇబ్బంది కలుగుతుంది

కరోనా ఆంక్షలు తొలగింపు తో విదేశాలకు ప్రయాణాలు పెరిగాయి

విద్య, ఉద్యోగాలకు సంబంధించి అనేక మంది విదేశాలకు వెళుతున్నారు

విజయవాడ పాస్ పోర్ట్ కార్యాలయం లోనే రోజుకు 600 వరకు ఇస్తున్నాం

రీజనల్ పరిధిలో రోజుకు రెండు వేల మందికి పైగా పిలుస్తున్నాం

దళారులను నమ్మి ఎవరూ మోస పోవద్దు

మా కార్యాలయాల్లోనే అన్ని రకాల పౌర సేవలు అందుబాటులో ఉంచాం