పరమేశ్వరుడు ఆమెకు అనుపమాన సౌందర్యాన్ని ప్రసాదించాడు. పెదాలు విచ్చుకుంటే.. మల్లెచెండు నవ్వినట్టే. ఇక, చూపు సూదంటురాయి! అందుకే అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్నది అనుపమ పరమేశ్వరన్. ఉంగరాల జుట్టుతో ఆమె సౌందర్యం రెట్టింపు అయ్యింది. ఆ ఒక్క కారణంతోనే బ్రహ్మచారులు ఎంగేజ్‌మెంట్ రింగ్‌తో ఆ కర్లింగ్ కాంతామణి చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు.
ఇటీవల ‘18 పేజెస్’ సినిమా ప్రమోషన్‌లో భాగంగా.. ఇలా నీలి రంగు చీరలో తళుక్కుమంది అనుపమ. బ్లూ అండ్ క్రీమ్ కాంబినేషన్‌లో నిండుగా ఉన్న చీరకు అదే రంగు స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో సింపుల్‌లుక్ వచ్చింది. లైట్‌వెయిట్ కాటన్‌ను ఏరికోరి ఎంచుకున్నట్టుంది. బెంగాల్ జమ్దానీ వీవ్ మహత్తుతో చీరకట్టుకు హుందాతనం తోడైంది. పూలంచు డిజైన్ బావుంది. చెవులకు పెద్దపెద్ద చాంద్‌బాలీ జుంకాలు, ముక్కుకు ముక్కెర, నుదుట బొట్టుతో క్లాసీగా మెరిసిపోయింది అనుపమ.. పరువాల బొమ్మ