Fashion

కొన్ని జీవిత సత్యాలు.

కొన్ని జీవిత సత్యాలు.

మనం ప్రారంభాన్ని సరిగ్గా
           ఆరంభిస్తే
ఫలితం దానంతట అదే సరిగ్గా
        వస్తుంది…..!!
      

పుట్టినప్పుడు పేరు ఉండదు.
ఊపిరి మాత్రమే ఉంటుంది.
చచ్చినప్పుడు ఊపిరి ఉండదు
     పేరు మాత్రమే ఉంటుంది.
    ఈ రెండింటి మధ్య ఉన్నదే
              ” జీవితం”
ఊపిరి ఎలాగో నిలుపుకోలేము
కనీసం పేరునైన నిలుపుకుందాం.

     అన్యాయాన్ని ఎదురిస్తే
      నా గొడవకు సంతృప్తి.
      అన్యాయం అంతరిస్తే
     నా గొడవకు ముక్తి, ప్రాప్తి.
అన్యాయాన్ని ఎదురించినవాడే
         నాకు ఆరాధ్యుడు.
 

ఒకరితో మరొకరిని పోల్చడం తప్పు.
సింహం ఎప్పటికీ కుక్కలా విశ్వాసం
చూపలేదు. కుక్క ఎప్పటికీ అడవికి రాజు కాలేదు.కానీ ఎవరి స్థానంలో వారు గొప్పవారు.

   ఆలస్యం చేయడం వల్ల
          సులువైన పని
       కష్టం అవుతుంది
           కష్టమైన పని
      అసాధ్యమవుతుంది.
           

   విజయం ఎప్పుడూ మనం
తీసుకునే ముందస్తు ప్రణాళికపై   
     ఆధారపడి వుంటుంది.
  ముందస్తు ప్రణాళిక లేని పని
  అపజయానికి దారి తీస్తుంది.

గడ్డిపోచలు మాత్రమే నీటిపై
తేలియాడుతుంటాయి
ముత్యాలు కావాలంటే నీటి
లోపలికి మునగక తప్పదు.
                           

ఏదైనా నీవు  చేయగలను 
అనుకుంటే చేయగలవు,
చేయలేను అనుకుంటే
చేయలేవు. నమ్మకంలోని నాణ్యతే నీకు
నాణ్యమైన జీవితాన్ని ఇస్తుంది.

ఇతరులు మీకంటే గొప్పగా పని
  చేస్తున్నారని బాధపడకండి
       రోజూ మిమ్మల్ని మీరు
   గెలిచే ప్రయత్నం చేయండి.
       

      వెనక్కి వెళ్ళి నీగతాన్ని
      మార్చుకోలేకపోవచ్చు.
     కానీ…. ముందుకు వెళ్ళి
నీ భవిష్యత్ ను మార్చుకోవచ్చు.