హైదరాబాద్: లోయర్ ట్యాంక్ బండ్ వద్ద భారీ పేలుడు ,ఈ ఘటనలో తండ్రీకొడుకులకు తీవ్రగాయాలు అయ్యాయి. క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. పేలుడుతో భారీ శబ్ధం రావడంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు …
*********************
“బీజేపీ 5వ విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ @ కరీంనగర్”
బండి సంజయ్ కామెంట్స్:
కరీంనగర్ నగర్ గడ్డపై గర్జించి, గాండ్రిస్తే… వాళ్ళకి వణుకు పుట్టాలి
నిన్ననే ఢిల్లీలో కార్యాలయం ఓపెన్ చేసినోళ్ళకి మనమేంటో కూడా తెలియాలి కదా…
ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన మీకు రెండు చేతులు జోడించి, ధన్యవాదాలు చెప్తున్నా
ఈ గ్రౌండ్ లో పౌరుషం, ఆవేశం ఉంది
నేను ఇక్కడే పెరిగాను
దుర్గమ్మ అమ్మవారి ఆశీర్వాదం తోనే నేను బతికిన. మీకు సేవ చేసే భాగ్యం కలిగింది
నేను ముందు ఈ డివిజన్ కార్పొరేటర్ ను
2014 లో నాకు ఎమ్మెల్యే గా 47 వేల ఓట్లు ఇచ్చారు
కరీంనగర్ గడ్డ నన్ను ధర్మం కోసం పనిచేయమంది
ధర్మం కోసం యుద్ధం చేయమంది ఈ కరీంనగర్ గడ్డ
హిందూ ధర్మ రక్షణ కోసమే పనిచేస్తున్నా
మీరు గర్వపడేలా… నేను పనిచేస్తున్నా
2018 లో ఎమ్మెల్యే గా నాకు 68 వేల ఓట్లు వచ్చాయి
నేను ఎందుకు ఒడిపోయానో మీకు తెలుసు
ఇంకొకరికి కొమ్ముకాసే అలవాటు నాకు లేదు
నా ధర్మానికి, సమాజానికి తలదించే పని ఎప్పటికీ చేయను
బండి సంజయ్ ఓడిపోతే… కార్యకర్తలు ఏడుస్తున్నారని దేశవ్యాప్తంగా చర్చ జరిగింది
మీ కష్టార్జిత ఫలితమే… నేను కరీంనగర్ ఎంపీగా గెలిచారు
మీ వల్లనే కరీంనగర్ లో పింక్ కలర్ జెండా ను బొందపెట్టి, కాషాయ జెండాను రెపరెపలాడించాం
కరీంనగర్ గడ్డపై, ఎంపీగా లక్ష ఓట్ల మెజారిటీ తో మీరు, మీ బండి సంజయ్ ని గెలిపించారు
కార్యకర్తల కష్టం, ప్రజల అభిమానంతోనే నేను గెలిచా
ఏ లక్ష్యంతో బిజెపి అధిష్టానం నన్ను రాష్ట్ర అధ్యక్షుడిని చేసిందో… దానికి అనుగుణంగానే నేను పనిచేస్తున్నా
కార్యకర్తలతో కలిసి తిరగాలని జాతీయ నాయకత్వం ఆదేశిస్తే… మీ కోసమే పాదయాత్ర చేస్తున్నా
పచ్చ జెండాను బొందపెట్టి, పింక్ జెండాను పీకేసి, కాషాయ జెండా ఎగరేయాలి
2001 లో సింహగర్జన పేరుతో trs పెట్టిన సభకు కూడా… ఇంతమంది రాలేదు
సింహగర్జన పేరుతో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే ఇప్పుడు ఏమైంది?
తెలంగాణ రాష్ట్ర సమితి లో తెలంగాణ ను తీసేసిండు
తెలంగాణ తో బంధం తొలగించుకున్నాడు
కేసీఆర్ పీడ విరగడయింది
తెలంగాణ తల్లికి ద్రోహం చేసిన మూర్ఖుడు కేసీఆర్
BRS పేరుతో దేశాన్ని దోచుకుందామని చూస్తున్నాడు
దందాలు, కబ్జాల పేరుతో… లక్షల కోట్ల రూపాయలు దండుకుంటున్నడు
లిక్కర్, స్యాండ్, గ్రానైట్, డ్రగ్స్… ఇలా అన్ని దందాలు, స్కామ్ లు వాళ్ళవే
తెలంగాణ అభివృద్ధి కి కేసీఆర్ సహకరించడం లేదు
మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వడం లేదు
24 గంటలు మోడీ ని తిడుతూ…ఏపీతో కుమ్మక్కై, సెంటిమెంట్ రగిల్చి, రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నాడు
ఇద్దరు సీఎం లు కలిసి దోచుకోవాలని చూస్తున్నారు
ఏ వర్గం సంతోషంగా లేదు
ఇక్కడ ఎంతమందికి 2bhk లు వచ్చాయి?
కరెంట్ బిల్లులు కట్టలేని పరిస్థితి
తెలంగాణ లో బీజేపీ అధికారంలోకి వస్తే… నిలువ నీడలేని పేదలకు పక్కా ఇండ్లు కట్టించి ఇస్తాం
ఈ 8 ఏళ్లలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య కేవలం 3 లక్షలే
కేసీఆర్ ఎన్ని నోటిఫికేషన్ లు ఇచ్చాడు?
తాజాగా 1.46 వేల ఉద్యోగాలు కేంద్ర సర్కారీ నౌకర్లు మోడీ ఇచ్చారు
విద్యా వ్యవస్థను నాశనం చేసిండు. కనీస సౌకర్యాలు, సిబ్బంది లేరు
ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి
ప్రతినెలా 1వ తేదీన జీతాలు ఇచ్చే ప్రభుత్వం కావాలా..? వద్దా?
రాష్ట్రాన్ని 5 లక్షల కోట్ల అప్పుల కుప్పగా మార్చిండు
మరోసారి కేసీఆర్ కు అధికారం ఇస్తే… ఇంకో 5 లక్షల కోట్ల అప్పు చేస్తాడు
రైతు రుణమాఫీ చేసిండా?
పాదయాత్ర ద్వారానే.. 8 సంవత్సరాలు ఫార్మ్ హౌజ్ లో పండుకున్న కేసీఆర్… బీజేపీ కి భయపడి, బయటికొచ్చిండు
TRS పార్టీ దుకాణం మూసేసి, ఢిల్లీలో BRS దుకాణం తెరిచిండు
BRS అంటే… బంధిపోట్ల రాష్ట్ర సమితి, బార్ & రెస్టారెంట్ సమితి
గుంటనక్కలు అంతా ఏకమయ్యాయి?
మోడీ సింహం…సింగిల్ గానే వస్తారు
5వ విడత పాదయాత్ర మహిషా(బైంసా) లో ప్రారంభించాం
సకినాలు చేస్తున్న నా హిందువుల అప్పాల్లో ఉచ్చ పోసిన లుచ్చా నా కొడుకుల భరతం పడదాం
*************************
టీడీపీ ఎంపీ కనకమేడల స్క్రోలింగ్ పాయింట్లు:15-12-2022
• సంకల్ప సిద్ది కేసు వ్యవహారంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కు ఫిర్యాదు చేసిన టీడీపీ ఎంపి కనకమేడల.
• వివిధ స్కీముల పేరుతో ఏపీ, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాల ప్రజలను కొల్లగొట్టారు
• తక్కువ కాలంలో రెట్టింపు డబ్బులు చెల్లిస్తామని మోసగించి వందల కోట్లు వసూలు చేశారు
• ఈ వ్యవహారంలో వైసీపీకి చెందిన కీలక నేతల హస్తం ఉంది
• వైసీపీ నేతల మోసానికి పేద, మధ్యతరగతికి చెందిన వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి
• పేదల డబ్బు తిరిగి ఇప్పించేందుకు తగు చర్యలు తీసుకోవాలి
• ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపించి నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని విజ్ఞప్తి
************************
◼️ || ఓ దొంగ పోలీస్ వాహనాన్నే ఎత్తుకెళ్లి వారికే షాక్ ఇచ్చాడు || ◼️
ఇప్పుడది వైరల్ న్యూస్ అయిపోయింది. సూర్యాపేట పోలీస్ స్టేషన్ కు చెందిన పెట్రోలింగ్ వాహనాన్ని ఎత్తుకుపోయాడో దొంగ.
సూర్యాపేటలో కొత్త బస్టాండ్ వద్ద పోలీసులు TS 09 PA 0658 నంబరు కలిగిన పెట్రోలింగ్ వాహనాన్ని కొత్త బస్టాండ్ వద్ద నిలిపి పక్కకు వెళ్లారు.
అర్జంట్ పని ఉండడంతో కారుకు తాళం వేయడం మర్చిపోయారు. ఇంకే ముంది అది గమనించిన దొంగ. చక్కగా కారు తాళం తీసుకుని కారుతో సహా అక్కడ నుంచి ఉడాయించాడు.
వేరే కేసు కోసం గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు అటు వెళ్లగా, వాహనాన్ని గుర్తు తెలియని దుండగుడు చోరీ చేశాడు. పోలీసుల కారును ఎవరు టచ్ చేస్తార్లే అనుకున్నారేమో పోలీసులు.
వారి ధీమాకు మనోడు చక్కటి సమాధానం చెప్పినట్లయింది.
కారుకే తాళాన్ని ఉంచడంతో దొంగ పని ఈజీ అయిపోయింది.
బుధవారం (డిసెంబర్ 14,2022) తెల్లవారుజామున తెల్లారితే గురువారం అనగా 5 గంటలకు ఈ ఘటన జరిగింది.
తమ వాహనం కనిపించకపోవడంతో పోలీసులు షాకయ్యారు. వెతకటం మొదలుపెట్టారు.
సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా వాహనం వెళ్లిన దారిని గుర్తించారు. కోదాడ వద్ద నిలిపి ఉంచిన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. కాగా కారు తాళం తీసి ఉండటంతో ఈజీగా కారును చోరీ చేసిన సదరు దొంగ కోదాడకు వచ్చేసరికి కారులోని డీజిల్ అయిపోవటంతో ఆగిపోయింది. దీంతో దొంగ వాహనాన్ని అక్కడే వదిలేశాడు.
కోదాడ వద్ద దుండగుడిని అదుపులోకి తీసుకుని, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేశారు. ఈ ఏడాది నవంబర్ 5న ఒడిశా రాయగఢ్ లో కూడా ఇలాంటి ఘటనే జరిగింది.
పోలీస్ పెట్రోలింగ్ వాహనాన్ని ఒక దుండగుడు అపహరించాడు. ఆ తర్వాత పోలీసులు అతడిని గుర్తించి అరెస్ట్ చేశారు. వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.
*****************బ్రేకింగ్
గుంటూరు జిల్లా
తాడేపల్లి
KLU యూనివర్సిటీలో కొనసాగుతున్న విద్యార్థుల ఆత్మహత్యలు
వడ్డేశ్వరం సన్ రైజ్ అపార్ట్మెంట్ ఎదురుగా ఓ రూమ్ లో KL యూనివర్సిటీలో BBA మూడో సంవత్సరం చదువుతున్న మందపాటి అజయ్ (21) అనే విద్యార్థి ఉరి వేసుకుని ఆత్మహత్య
ఘటన స్థలాన్ని చేరుకొని మృతదేహాన్ని మంగళగిరి మార్చురీకి తరలించిన తాడేపల్లి పోలీసులు
జరిగిన కొంతకాలంగా విద్యార్థులు బలవన్మరణాలు కు పాల్పడుతున్న యూనివర్సిటీ పై ఎలాంటి చర్యలు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తుంది
***********
వైఎంసీఏ వద్ద మద్యం గంజాయి మత్తులో అర్ధరాత్రి హల్చల్ చేసిన యువతి
**
అమూల్య బీరు తాగుతూ గంజాయి సిగరెట్ కాలుస్తుందని అడిగినందుకు త్రీటౌన్ ఏఎస్ఐ పి.వి.వి సత్యనారాయణపై బీర్ బాటిల్ తో దాడి చేసిన అమూల్య అనే యువతి.
ఏఎస్ఐ సత్యనారాయణపై బీర్ బాటిల్ విసరగా గోవింద్ అనే యువకుడు కంటికి బలంగా గాయం.
మూడో పట్నం పోలీస్ స్టేషన్లో అమూల్యపై ఫిర్యాదు ఇచ్చిన గోవింద్.
అమూల్య.. ఏఎస్ఐ సత్యనారాయణపై అసభ్య వ్యాఖ్యలు చేస్తూ కాలుతో తన్నడం చూసిన యువకులు ఆగ్రహం.
ఏఎస్ఐ సత్యనారాయణకి న్యాయం జరగాలి అని అమూల్యపై మూడో పట్టణం పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు ఇచ్చారు.
అమూల్య.. నా ప్రియుడు దుర్గాప్రసాద్ అలియాస్ ఏటీఎం అనే వ్యక్తికి గాని చెప్తే మీ పని అయిపోతాది అని బెదిరింపులు.
పోలీసులైతే మీరేం చేయగలరు నాకు అని అసభ్య వ్యాఖ్యలతో సవాల్ చేసిన అమూల్య.
**************************
📚✍️‘సిఫార్స్ బదిలీ
జాబితాలు సిద్ధం✍️📚!
♦️సీల్డ్ కవర్‌లో పెట్టి డీఈఓలకు అందజేత!
♦️సాధారణ బదిలీలకు ముందు ఇదేం తిరకాసు.. అంటున్న టీచర్లు
అమరావతి: ఉపాధ్యాయుల ‘పైరవీ బదిలీలకు’ సంబంధించిన జాబితాలను పాఠశాల విద్యాశాఖ బుధవారం రాత్రి జిల్లా విద్యాధికారులకు పంపింది. ‘ప్రభుత్వ విచక్షణ బదిలీల’ పేరుతో జరిగే ప్రక్రియకు సంబంధించి టీచర్ల జాబితాను ఏ జిల్లాకు సంబంధించిన వివరాలను ఆ జిల్లా వారికే రహస్యంగా సీల్డ్ కవర్‌లో పెట్టి ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 140 మంది ఉపాధ్యాయులు ఈ జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకుల సిఫార్సులతో వీటిని చేస్తున్నారు. రాజకీయ పలుకుబడి కలిగిన కొందరికి మంచి స్థానాలు కట్టబెట్టేందుకు ప్రభుత్వమే దొడ్డిదారి బదిలీలు నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మొత్తం 140 మందిలో 70 శాతం మంది రాయలసీమ జిల్లాలకు చెందిన వారే ఉన్నారు. ఈ కారణంగా సాధారణ ఉపాధ్యాయులు పట్టణాలు, నగరాలు, మండల కేంద్రాలకు సమీపంలోని స్థానాలను కోల్పోనున్నారు. బదిలీల్లో రాజకీయాలు చేయడం, పలుకుబడి కలిగిన వారికి కోరుకున్న స్థానాలు అప్పగించడాన్ని ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇంతకాలం రహస్యంగా దస్త్రాన్ని కదిపిన పాఠశాల విద్యాశాఖ అధికారులు పోస్టింగ్‌లు ఇచ్చేందుకు డీఈఓలకు జాబితాలను అందించారు.
♦️నేటి నుంచి పోస్టింగ్‌లు
ఒకవైపు సాధారణ బదిలీలకు షెడ్యూల్ ప్రకటించారు. ఎంతోకాలంగా మారుమూల ప్రాంతాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులు మంచి స్థానం కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రభుత్వం సిఫార్సు బదిలీలు చేపట్టడంపై ఉపాధ్యాయ లోకం మండిపడుతోంది. పైరవీ బదిలీలు పొందినవారికి వారు కోరుకున్నచోట గురువారం నుంచి పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు. దీంతో పట్టణాలు, నగరాలు, మండల కేంద్రాలకు సమీపంలోని పాఠశాలల్లోని పోస్టులు చాలా వరకు భర్తీ అయిపోతాయి. ఆ తర్వాత సాధారణ బదిలీలు నిర్వహిస్తారు. అంటే ఎలాంటి రాజకీయ బలం లేనివారు దూరం ప్రాంతాల్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనికితోడు కేటగిరి- 1, 2, 3లోని పోస్టులను బ్లాక్ చేస్తామని ఇప్పటికే అధికారులు ప్రకటించారు. ఈ లెక్కన రాజకీయ అండలేని వారికి కష్టాలు తప్పనట్లే. 2020లో సాధారణ బదిలీలు చేసినప్పుడు 15,000 పోస్టులను బ్లాక్ చేశారు. ఇవన్నీ పట్టణాలు, నగరాలు, మండల కేంద్రాలకు సమీపంలోనే ఉన్నాయి. దీంతో చాలామంది మారుమూల ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. ఇప్పుడు సిఫార్సు బదిలీలు, పోస్టులు బ్లాక్ చేయడం వల్ల కేటగిరి- 3, 4 బడుల్లోనే ఎక్కువమంది పోస్టింగ్‌లు పొందాల్సి ఉంటుంది.
***********************
అమరావతి : జీతాలకోసం ఉద్యోగులు కలెక్టరేట్ల వద్ద ధర్నాలు చేసే పరిస్థితికి తీసుకొచ్చారు .
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి
ఉద్యోగులకు నేటికీ జీతాలు ఇవ్వలేదు .
ప్రభుత్వం ఉద్యోగులపై కక్షసాధింపులకు పాల్పడుతోంది
ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలే ఉద్యోగులకు శాపంగా మారాయి
సలహాదారులు, వాలంటీర్ల ప్రయోజనాలకోసం ఉద్యోగులు ఎందుకు ఇబ్బంది పడాలని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం
: టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబు