Politics

మంత్రి కాకాని కేసులో విచారణ మొదలు పెట్టిన సిబిఐ

మంత్రి కాకాని కేసులో విచారణ మొదలు పెట్టిన సిబిఐ

— నెల్లూరు నాల్గవ మున్సిపల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఫైళ్లు గల్లంతు పై దర్యాప్తు చేపట్టిన చెన్నై సిబిఐ

— చెన్నై సిబిఐ అడిషనల్ ఎస్పీ టి.ఆనంద్ కృష్ణ,సిఐ టి.రాజ శేఖర్ లు నెల్లూరు రాక.

— మంత్రి కాకాణి కేసులో విచారణ చేపట్టిన చెన్నై సిబిఐ అధికా రులు.

— పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లోని పోలీసు గెస్ట్ హౌస్ లో కొందరు పోలీసు అధికారుల వివరాలు సేకరించే పనిలో సీబీఐ అధికారులు.

నెల్లూరు జిల్లా కోర్టులో క్రితం ఫైళ్లు చోరీ జరిగిన వ్యవహారంపై చెన్నై సిబిఐ రంగంలోకి దిగింది. ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి కేసు వ్యవహారానికి చెందిన ఫైళ్లు నాలుగో మున్సిపల్ స్టేట్ కోర్టులో చోరీకి గురయ్యాయి. ఈ కేసు పై అనేక అనుమానాలు ఉన్నాయంటూ జిల్లా జడ్జి యామిని ఏపీ ధర్మసానానికి నివేదించింది. దానిపై స్పందించిన ఏపీ ధర్మాసనం ఈ కేసును సిబిఐ దర్యాప్తు చేయాలంటూ ఆదేశాలు జారీచేసింది. దీంతో ఈ కేసును చెన్నై సిబిఐ విభాగం దర్యాప్తు చేపట్టింది. ఇవాళ చెన్నై సిబిఐ ఎడిషనల్ ఎస్పీ ఆనంద కృష్ణ, సిఐ. టి. రాజశేఖర్లు జిల్లాకు చేరుకున్నారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాల సేకరణ చేపట్టారు. కోర్టు ఫైల్ చోరీ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే నిందితులను పోలీసులు అరెస్టు చేసి నా నేపథ్యంలో ఆ ఫైళ్ళ వివరాల లో సిబిఐ అధికారుల సేకరిస్తున్నారు. నెల్లూరు జిల్లా ఎస్పీ కార్యాలయానికి చేరుకున్న సిబిఐ అధికారులు ఆ కేసు వివరాలను సేకరిస్తున్నారు.