DailyDose

TNI నేటి నేర వార్తలు.. విజయవాడ కృష్ణా నదిలో ఐదుగురు విద్యార్థుల గల్లంతు..

TNI  నేటి నేర వార్తలు.. విజయవాడ కృష్ణా నదిలో ఐదుగురు విద్యార్థుల గల్లంతు..

బ్రేకింగ్ న్యూస్.

ఎన్టీఆర్ జిల్లా: విజయవాడ.

విజయవాడ పడమట కృష్ణలంక కు చెందిన ఏడుగురు విద్యార్థులు కృష్ణా నదికి స్థానానికి వెళ్లి విద్యార్థులు.

ఏడుగురులో ఐదుగురు విద్యార్థులు గల్లంతు..?

ఇద్దరు సురక్షితం..?

ఈ ఘటనపై మరింత పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
*********************
తిరుపతి జిల్లా..సత్యవేడు

రన్నింగ్లో ఊడిపోయిన సత్యవేడు ఆర్టీసీ బస్సు టైర్లు

ప్రమాదం తప్పడంతో ఊపిరి పీల్చుకున్న ప్రయాణికులు

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయండి. సురక్షితంగా గమ్యం చేరండి అంటూ పెద్ద ఎత్తున ఆర్టీసీ యాజమాన్యం ప్రచారం చేస్తున్న విషయం జగద్వితమే.

ఇందుకు ఆర్టీసీ సంస్థలో సురక్షితులైన డ్రైవర్లు,సాంకేతిక సిబ్బంది ఉండటమే ప్రధాన కారణంగా ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు.

కానీ ఆర్టీసీ బస్సు మరమతుకు గురైనప్పుడు వాటిని బాగు చేసే విషయంలో డిపో గ్యారేజ్లో పనిచేస్తున్న మెకానికల్స్ నిర్లక్ష్యం వహిస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇందుకు గురువారం రాత్రి సత్యవేడు నియోజకవర్గం నాగలాపురం మండలం సుబ్బానాయుడు కండ్రిక వద్ద చోటు చేసుకున్న సంఘటన తార్కాణంగా నిలుస్తుంది.

వివరాలు ఇలా.. సత్యవేడు డిపోకు చెందిన ఆర్టిసి బస్సు తిరుపతి నుంచి సత్యవేడుకు వస్తుండగా మార్గమధ్యలో సుబ్బానాయుడు కండ్రిక గ్రామానికి సమీపంలో గురువారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో బస్సు వెనుక టైర్లు ఊడిపోయాయి.

దీంతో బస్సు పక్కకు ఒరిగిపోయి నిలిచిపోయింది.
అదృష్టవశాత్తు ఎదురుగా, వెనుక వైపు ఎలాంటి వాహనాలు రాకపోవడంతో ప్రయాణికులు ప్రమాదానికి గురి కాకుండా సురక్షితంగా బయటపడ్డారు.

ఒకవేళ టైర్లు ఊడిపోయిన సమయంలో వాహనాలు ఎదురుగా వచ్చి ఉంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని ప్రయాణికులు పలువురు ఆందోళన వ్యక్తం చేశారు.

కాగా సత్యవేడు డిపో గ్యారేజీలో దాదాపు 30 మంది మెకానికల్స్ పనిచేస్తున్నట్టు సమాచారం.

ఇంతమంది సాంకేతిక సిబ్బంది ఉన్న టైర్లకు సంబంధించిన నట్లు సరిగా బిగించకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపురించాయని ఆర్టీసీ వర్గాలే చెప్తున్నాయి.

డిపో గ్యారేజ్ నుంచి బయటికి వచ్చే ప్రతి బస్సును బ్రేకులు, స్టీరింగ్, టైర్లు, ఆయిల్స్ తదితర వాటిని మెకానికల్స్ పరిశీలించాల్సి ఉంది.

అయితే గురువారం ap39z- 0281 నెంబర్ గల ఆర్టీసీ బస్సు తిరుపతి నుంచి సత్యవేడు వైపు వస్తుండగా సుబ్బానాయుడు కండ్రి వద్ద వెనుక బాగానే ఉన్న రెండు టైర్లు ఓడిపోయింది.

దీంతో బస్సులోని ప్రయాణికులు ఆందోళనకు గురి అయ్యారు.అయితే వెనుక ముందు ఎలాంటి వాహనాలు రాకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది.

అయితే బస్సు టైర్ల బిగింపులో సంబంధిత మెకానికల్స్ అశ్రద్ధ, నిర్లక్ష్యం వహించడం వల్లే ఇలాంటివి చోటు చేసుకున్నట్టు విమర్శలు వినిపిస్తున్నాయి.

దీనిపై ఆర్టీసీ ఉన్నత అధికారులు స్పందించి ఇలాంటివి మళ్లీ పునరావతం కాకుండా చర్యలు తీసుకోవాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు.
**********************************************
చిత్తూరు జిల్లా, బంగారు పాళ్యం

Sad, 😌విద్యుత్ ఘాతుకానికి ఏనుగు మృతి

బంగారుపాళ్యం మండలం కీరమంద, కొల్లదమడుగు అటవీ ప్రాంత వ్యవసాయ భూముల్లో బోరు మోటర్ నోటితో పెరగడంతో విద్యుత్ షాక్ తో ఏనుగు అక్కడికక్కడే మృతి

ఏనుగు నోటిలో విద్యుత్ తీగలు

ఏనుగు మృతిని అటవీ శాఖ అధికారి సమాచారం ఇచ్చిన గ్రామస్తులు
******************************************
Jawaharnagar dammaiguda lake girl death incident..!

Family members doubts:::

చిన్నారి మృతి మిస్టరీ…
నిన్న రాత్రి వరకు చాలా సార్లు పోలీసులతో కలిసి చెరువు వద్ద వెతికాము..! పాప చెరువులో పడి మృతి చెంది ఉంటె బాడీ ఉబ్బిపోయి ఉండాలి.. కానీ ఆలా లేదు.. అంతకుముందే చంపేసి అర్థరాత్రి చెరువులో వేసి ఉంటారు..! పోలీసుల తీరు అనుమానాస్పదంగా ఉంది.. !!

తండ్రికి బాడీ చూపించకుండా పోలీసులు హడావుడిగా తరలించడమెందుకు ?
*******************************************************
ED served Notice to MLA Pilot Rohith Reddy to appear on 19th (monday) in Drugs case
******************
అమరావతి

టీడీపీ కేంద్ర కార్యాలయానికి మరోసారి వచ్చిన ఎన్ఎస్‌జీ గ్రూప్ కమాండర్ కౌషియార్ సింగ్, ఎన్ఎస్‌జీ సిబ్బంది

చంద్రబాబు ఛాంబర్, ప్రచార రథాలను దగ్గరుండి పర్యవేక్షించిన ఎన్ఎస్‌జీ బృందం

చంద్రబాబు ప్రచార సమయంలో రాత్రిపూట బస చేసే బస్సును పరిశీలించిన ఎన్ఎస్‌జీ

టీడీపీ ప్రచార రథాలపైకి ఎక్కి పర్యవేక్షించిన ఎన్ఎస్‌జీ

పార్టీ కార్యాలయ మేనేజర్ శ్రీకాంత్, పరుచూరి కృష్ణలకు పలు సూచనలు చేసిన ఎన్ఎస్‌జీ

ప్రచార రథంపై చంద్రబాబు ఎక్కడి నుంచి ప్రసంగిస్తారనే వివరాలు సేకరించిన ఎన్ఎస్‌జీ

ప్రచార రథంపై 6 ఫీట్ గ్లాస్ ఏర్పాటు చేయాలని పార్టీ సిబ్బందికి సూచించిన ఎన్ఎస్‌జీ

చంద్రబాబు హైట్‌కి సరిపడా ఉండే గ్లాస్ ఏర్పాటు చేయాలని సూచన

ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం పరిశీలించిన ఎన్ఎస్‌జీ
*****************************************************
Jammu Kashmir: ఆర్మీ క్యాంప్ సమీపంలో కాల్పులు.. ఇద్దరి మృతి !

శ్రీనగర్: జమ్మూ- కశ్మీర్‌(Jammu Kashmir)లోని రాజౌరి జిల్లాలో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది! ఓ సైనిక శిబిరం(Army Camp) వెలుపల జరిగిన కాల్పుల్లో ఇద్దరు పౌరులు మృతి చెందారు.మరొకరు గాయపడ్డారు. శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు రక్షణ శాఖ అధికారులు తెలిపారు. గుర్తుతెలియని ఉగ్రవాదులు(Terrorists) ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు వెల్లడించారు. ఆర్మీకి చెందిన ‘వైట్ నైట్ కోర్‌'(White Knight Corps) ఈ మేరకు ఓ ట్వీట్‌ చేసింది. మరోవైపు.. ఈ ఘటనపై స్థానికులు పెద్దఎత్తున నిరసనలకు దిగారు. మిలిటరీ క్యాంప్‌పైకి రాళ్లు రువ్వారు. పట్టణంలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నప్పటికీ.. అదుపులోనే ఉందని అధికారులు తెలిపారు.
మృతులను రాజౌరికి చెందిన కమల్ కుమార్, సురీందర్ కుమార్‌గా గుర్తించారు. ఈ ఘటనలో ఉత్తరాఖండ్‌కు చెందిన అనిల్ కుమార్‌ గాయపడ్డాడు. అతడిని ఆర్మీ ఆసుపత్రిలో చేర్చినట్లు అధికారులు తెలిపారు. ఉదయం 6.15 గంటల ప్రాంతంలో పలువురు స్థానికులు విధుల కోసం ఆర్మీ క్యాంపు ఆల్ఫా గేటు వద్దకు వస్తుండగా కాల్పులు జరిగినట్లు వారు చెప్పారు. ఈ ఘటనను నిరసిస్తూ స్థానికులు వీధుల్లోకి వచ్చారు. పౌర హత్యలను ఖండిస్తూ సైనిక శిబిరంపైకి రాళ్లు రువ్వారు. ఈ ఘటనపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తూ.. జమ్మూ- పూంచ్ జాతీయ రహదారిని దిగ్బంధించారు. మరోవైపు వారిని సముదాయించేందుకు సీనియర్‌ అధికారులు రంగంలోకి దిగారు. రాజౌరీ- పూంచ్‌ రేంజ్‌ డీఐజీ, రాజౌరీ డీసీలు ఘటనాస్థలికి చేరుకున్నారు.
**************************************************
గుంటూరు జిల్లా

తాడేపల్లి

తాడేపల్లి పాతూరు రోడ్లో పేకాట ఆడుతూ పట్టుబడ్డ వైసిపి నాయకులు , సమాచారం బయటకు రానివ్వకుండా గోప్యంగా ఉంచినట్లు సమాచారం

తాడేపల్లి లో ఓ పోలీస్ బాస్ కనుసనల్లోనే పేకాట స్థావరాలు ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం

నిఘవర్గాలను సైతం ఎమ్మెల్యే పేరుతో భయబ్రాంతులకు గురి చేస్తున్న తాడేపల్లి పోలీస్ బాస్

నిఘావర్గాల సమాచారాన్ని పేకాట నిర్వాహకులకు తెలుపుతున్న తాడేపల్లి పోలీస్ బాస్
****************************
పగో జిల్లా : ఉండి:

CCS SI …మరో ముగ్గురు అరెస్ట్

కారులో వస్తున్న మిత్రులను
అడ్డుకొని గంజాయి రవాణా కేసు పెడతామని బెదిరించి నగదు వసూలు చేసిన కేసులో సీసీఎస్ ఎస్సై, మరో ముగ్గుర్ని అరెస్టు చేశామని ఆకివీడు సీఐ గీతా రామకృష్ణ గురువారం తెలిపారు. ఆయన అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. భీమవరం పట్టణంలోని నాచువారి కూడలికి చెందిన సీమకుర్తి సాయిరాజు లోకేశ్ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిందారోపణలు ఎదుర్కొంటున్న సీసీఎస్ ఎస్సై సంపత్, భీమవరం పట్టణ రౌడీ షీటర్లు రౌతు రఘు, విక్టర్ బాబుతో పాటు నేలపాటి రాజేశ్ను అదుపులోకి తీసు కొని భీమవరం కోర్టులో గురువారం హాజరు పరిచామ న్నారు. ఈ నలుగురు నిందితులకు ఈ నెల 28 వరకూ న్యాయమూర్తి రిమాండ్ విధించారని తెలిపారు. ఈ కేసులో భీమవరం రెండో పట్టణానికి చెందిన రౌడీ షీటర్
విక్టర్ బాబు బృంద నాయకుడిగా వ్యవహరించారన్నారు. రౌతు రఘు, విక్టర్ బాబులపై భీమవరం పట్ట ణంలో రెండు మర్డర్ కేసులున్నాయని చెప్పారు. వైద్య సెలవుల్లో ఉన్న సీసీఎస్ ఎస్సై సంపత్ స్వగ్రామం కృష్ణా జిల్లా ఉయ్యూరు అని తెలిపారు. రెండు నెలల కిందటే ఈయనకు వివాహమైందని చెప్పారు. పోలీసు ఇన్ఫార్మర్ గా వ్యవహరిస్తున్న విక్టర్ బాబుతో కలిసి సీసీఎస్ ఎస్సై సంపత్ సన్నిహితంగా మెలిగారని సీఐ వివరించారు. ఈ కేసుతో సంబంధమున్న మరో ఇద్దరు నిందితులను గురువారం అదుపులోకి తీసుకున్నామని, వారిని కోర్టులో శుక్ర వారం హాజరుపరుస్తామని చెప్పారు. ఇంకో నలుగురు నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందం గాలిస్తున్నట్లు సీఐ గీతా రామకృష్ణ తెలిపారు.