ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు ఏర్పాట్లు పూర్తి విజయవాడ సిద్ధార్థ ఆడిటోరియంలో డిసెంబర్ 23 24 తేదీల్లో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు రచయితల మహాసభలకు ఏర్పాట్లు అన్ని పూర్తి అయినట్లు ఆహ్వాన సంఘం నిర్వాహకులు మండలి బుద్ధ ప్రసాద్ డాక్టర్ జి వి పూర్ణచంద్ తెలిపారు రెండు రోజులు పాటు జరిగే ఈ మహాసభలకు భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం వెంకయ్య నాయుడు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ NV రమణ ముఖ్య అతిథులుగా హాజరవుతున్నట్లు తెలిపారు ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాల నుండి ఇతర రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు ఈ మహాసభలకు తరలివస్తున్నట్లు తెలిపారు కవిత గోస్టులు కవి సమ్మేళనాలు అవధానాలు పుస్తక ఆవిష్కరణలు సాంస్కృతిక కార్యక్రమాలు తెలుగు భాషా వైభవాన్ని వివరించే విధంగా ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు పూర్తి వివరాలకు ఈ దిగువ బ్రోచర్లను పరిశీలించండి