Politics

వాహనాల రిజిస్ట్రేషన్ నిబంధనలను సవరించిన కేంద్రం.

వాహనాల రిజిస్ట్రేషన్ నిబంధనలను సవరించిన కేంద్రం.

న్యూఢిల్లీ: ఒక రాష్ట్రానికి చెందిన వ్యక్తి వాహనాన్ని, మరొక రాష్ట్రానికి చెందిన వ్యక్తి సులువుగా కొనుగోలు చేసేందుకు, రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈజీగా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్త రిజిస్ట్రేషన్ సిరీస్ (బీహెచ్ ‘భారత్ సిరీస్’)ని తీసుకొచ్చింది. రాష్ట్రాల సిరీస్ తో రిజిస్ట్రేషన్ చేసుకున్న పాత వాహనాలు కూడా బీహెచ్ సిరీస్ నెంబర్ ప్లేట్ ని పొందవచ్చు. దానికి సంబంధించిన అన్ని నియమ నిబంధనల్ని మార్చినట్లు జాతీయ రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ వెల్లడించింది.
అయితే, ఇదివరకు కొత్త వాహనాలు మాత్రమే బీహెచ్ సిరీస్ ని పొందే అవకాశం ఉండేది. దాన్ని మార్చుతూ రూల్ 48ని తీసుకొచ్చింది. దీనివల్ల ఇతర రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని వాహనాలు కొనుగోలు చేసినప్పుడు రిజిస్ట్రేషన్ ఇబ్బంది కాకుండా ఉంటుంది. అయితే, కేంద్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 49,600 వాహనాలు బీహెచ్ సిరీస్ తో రిజిస్ట్రేషన్ చేయించుకున్నాయి…